Saturday, August 13, 2016

ఘనంగా పుష్కర స్నానాలు


తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటిరోజు నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ దుర్గాఘాట్లో, తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్లో సతీ సమేతంగా పుష్కరస్నానం చేశారు. ఇద్దరు సీఎంలు తమ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని సంకల్పం చేసుకున్నారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


కృష్ణాతీరంలోని గ్రామాలన్నీ పుష్కరకళతో మెరిసిపోతున్నాయి. సరిగ్గా పుష్కరాల సమయానికి కృష్ణానదికి వరద రావడంపై అందరూ సంతోషంగా ఉన్నారు. శ్రీశైలం పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ శక్తిమేరకు యాత్రికులకు సేవలందిస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రతి ఐదు నిమిషాలకు పుష్కర ఘాట్లకు బస్సులు తిరుగుతున్నాయి. రైల్వే శాఖ కోసం పుష్కరాల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. పుష్కర ఘాట్ల సమీపంలోని ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొత్తం మీద కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.

No comments:

Post a Comment