Thursday, March 10, 2016

పీఎస్‌ఎల్‌వీ సీ32 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ సీ32 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 54 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ తర్వాత సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్(షార్) నుంచి ఆకాశంలోకి ప్రయోగించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు.


1425 కిలోలు బరువు కలిగిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1ఎఫ్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ32 రోదసీలోకి మోసుకెళ్లింది. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్‌లో ఇది ఆరో ఉపగ్రహం.

దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు

ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసే అలవాటు, సంప్రదాయం ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు పౌర్ణమి, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది.

అయితే దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరిగానే ఉందా ? మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ? కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది. నిత్యం చేసేదే అయినా.. దీపారాధనలో కొంతమంది తెలిసీ, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లను తెలుసుకుని.. మరోసారి చేయకుండా ఉండటం మంచిది. సాధారణంగా దీపారాధనలో చేసే పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం..



దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?


  • దీపారాధనకు వేరుశనగ నూనె అస్సలు ఉపయోగించరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం, ఆముదం ఉపయోగిస్తే కష్టాలు దూరమవడం, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్టశక్తులు, శత్రుబాధలు తొలగిపోతాయి.  
  • దీపం వెలించడానికి ఒక వత్తి ఉపయోగించరాదు. ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం.
  • దీపారాధకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. దీపారాధనకు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలు ఉపయోగించడం మంచిది.
  • అగ్గిపుల్లతో దీపం వెలిగించారాదు. అగరబత్తీల ద్వారా వెలిగించవచ్చు.
  • దీపం కొండెక్కితే ఓమ్ నమః శివాయ అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు.
  • దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది.
  • విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.
  • సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.
  • దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.




Wednesday, March 9, 2016

వీక్ అండ్స్ సమయంలో ఉయ్యాలలో సేద తీరండి

ఉయ్యాలూగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నప్పుడైతే ఈ ముచ్చట తీర్చుకోవడానికి వాకిట్లోని చెట్టుకు లేదంటే ఇంట్లోనే తాడు లేదా చీర సహాయంతో ఉయ్యాల వేలాడడీయించుకుని మరీ ఊగే వాళ్లం. ఇప్పటికీ అప్పుడప్పుడు పార్కులకు వెళ్లినప్పుడు కూడా మనలో చాలా మంది ఉయ్యాలలూగడానికి ఆసక్తి చూపుతుంటారు. 


అయితే ప్రస్తుతం ఉయ్యాలలూగడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అవే మన ముంగిట్లోకి వచ్చి వాలుతున్నాయి. వినియోగదారులకు అభిరుచుల్ని, సౌకర్యాన్ని బట్టి, ఇప్పుడు ఎన్నో రకాల ఉయ్యాలలు ఫర్నిచర్ షాపుల్లో కొలువుతీరాయి. ఇవి కేవలం మన సరదా తీర్చుకోవడానికే కాదు... ఇంటి ముంగిలికే కొత్త సొగసులను తీసుకొస్తున్నాయి . మరి అలాంటి కొన్ని రకాలా ఉయ్యాలల గురించి తెలుసుకుందాం...


సేదతీరేలా: కొన్ని ఉయ్యాలలు కేవలం కూర్చోవడానికి మాత్రమే కాదు..వెనక్కి జారగిలబడి కూర్చుని సేదతీరేందుకు వీలుగా ఉంటున్నాయి. ఇందులో భాగంగా కూర్చునే సీటుకు చివరి భాగంలో కాస్త వంపుగా ఉంటుంది. దీంతో మోకాలి వెనక భాగంలో సౌకర్యంగా ఉండి, నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే ఉయ్యాలలో ఒరగడానికి వీలుగా ఉండే భాగం కాస్త ఎత్తుగా ఉండి, చివరికి వచ్చే సరికి వంపు తిరిగి ఉంటుంది. ఇలా ఉండటం వల్ల దానిపై తల ఆనించి హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే ఈ ఉయ్యాలకు మధ్యమధ్యలో ఎక్కడా పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండవు కాబట్టి పిల్లలు ఎక్కినా వాటి నుంచి జారి కింద పడకుండా ఉంటుంది.

సౌకర్యంగా: ఒకప్పుడు ఉయ్యాలంటే ఒక బల్ల మాదిరగా ఉండి..దానికి నాలుగు వైపులా గొలుసులతో పైనుంచి వేలాడదీసేవారు. వీటిలో ఒరిగి కూర్చునే వీలుండేది కాదు. కాసేపు ఊగడానికి లేదంటే పుడకోవడానికి మాత్రమే ఉపయుక్తంగా ఉండేవి. ఒక వేళ వీటిలో ఎక్కువ సేపు కూర్చున్నా...నడుంనొప్పి వచ్చేది. కాబట్టి ఇవన్నీ ద్రుష్టిలో ఉంచుకుని ప్రస్తుతం వీటి తయారీలో చాలానే మార్పులు చేశారు. ఇప్పుడున్న ఉయ్యాలల్లో బల్లతో పాటు వెనకవైపు ఒరిగి కూర్చోవడానికి వీలుగా రెండు పక్కలకు రెండు హ్యాండిల్స్ ఉండేలా తయారుచేస్తున్నారు. దీంతో ఈ రకం ఉయ్యాలలు మరింత సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అలాగే ఈ ఉయ్యాలలు పరిమాణాన్ని బట్టి వీటిలో ముగ్గురు లేదా నలుగురు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది.

భోజనం కూడా: ఉయ్యాలూగుతుంటేనే ఎంతో సరదాగా ఉంటుంది. మరి దానిపై కూర్చుని మనకిష్టమైనంది తింటుంటే ..మరెంతో సంతోషంగా అనిపిస్తుంది కదా..! ఇందుకోసం అనువుగా ఉండే ఉయ్యాలు కూడా మార్కెట్లో చాలానే అభిస్తున్నాయి. ఇవి మామూలు ఉయ్యాలల్లాగే ఉంటూ మధ్యలో చిన్న కుర్చీల మాదిరిగా ఎత్తుగా ఉంటుంది. దీనిపై తయారుచేసుకున్న వంటకాల్ని అమర్చుకొని ..రెండువైపులా ఇద్దరూ కూర్చొని ఊగుతూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చు.

ఒక్కరికోసం : ఒక్కరే ఊగేందుకు వీలుగా ఉండే ఉయ్యాలలు కూడా చాలానే లభిస్తున్నాయి. ఈ క్రమంలో సాధారణం కుర్చీ మాదిరిగా ఉండేవి కొన్నైతే, కేన్ తో తయారుచేసినవి మరికొన్ని...అలాగే ఇంకొన్ని ఉయ్యాలలైతే పైకప్పు నుంచి వేలాడదీయకుండా, స్వయంగా వేలాడేలా ఉయ్యాలకే స్వింగ్ స్టాండ్ అమరిక ఉంటుంది. అలాంటి వాటికి ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుంది.

హాయిగా పడుకోవడానికి : కేవలం కూర్చోవడానికే కాదు..మంచి మీద పడుకున్నట్టుగా ఉండే ఉయ్యాలలూ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. వీటిపై పడుకుని హాయిగా నిద్రపోవచ్చు. పైగా వీటిని ముంగిట్లోనే కాకుండా లాన్ లో కూడా అమర్చుకోవచ్చు. తద్వారా బయట చల్లగాలికి కాసేపు రిలాక్స్ అయినట్లుగా ఉంటుంది. అలాగే ఇలాంటి ఉయ్యాలల్ని కొంతమంది హాల్లో కూడా వేలాడదీస్తారు. తద్వారా అందులో పడుకుని టీవీ చూడడమో లేదంటే కాసేపు పాటలు వినడమో చేయవచ్చు. ఈ ఉయ్యాలల్లో పడుకోవడంతో పాటు వెనక్కి ఒరిగి కూర్చోవడానికి వీలుగా ఉంటుంది.

వివిధ మెటీరియళ్లతో: ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకరకాల ఉయ్యాలన్ని కేవలం చెక్కతోనే కాకుండా ఫ్యాబ్రిక్, కేన్ ...వంటి పలు రకాల మెటీరియళ్లతో తయారుచేస్తున్నారు. అయితే ఇవి దేంతో తయారైనా సరే..కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండాలంటే వాటిపై సోఫాసెట్ మాదిరిగా మెత్తటి కుషన్స్ అమర్చితే చూడటానికి కూడా ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

ఇంటి అందాన్ని..మానసిక ఉల్లాసాన్ని పెంచే గ్లామరస్ స్వింగ్ సెట్స్ ఇంటిలోగిళ్లలో అందాన్నిచ్చే ఇలాంటి ఉయ్యాలలు మరెన్నో మార్కెట్టో అందుబాటులో ఉన్నాయి. మరి మీకూ వీటిని తెచ్చుకోవాలనిపిస్తుందా? అయితే వెంటనే మీకు నచ్చిన ఉయ్యాలను ఇంటికి తెచ్చేసుకుని మీ ఇంటికి కొత్త కళ తీసుకురండి..

నోరూరించే మామిడిపళ్లలో దాగున్న 12 బ్యూటీ సీక్రెట్స్

సమ్మర్ వచ్చేసింది. హాట్ హాట్ వెదర్ లో స్వీట్ స్వీట్ గా ఉండే మామిడిపండ్ల మజా కూడా మొదలవుతుంది. సమ్మర్ లో నోరూరించే మామిడిపండ్లు అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. మామిడిపండ్లు అనగానే.. వావ్ అని ఎక్స్ ప్రెషన్స్ కూడా పెట్టేస్తారు కదూ. సమ్మర్ స్పెషల్ గా వచ్చే మామిడిపండ్లలో ఆరోగ్యప్రయోజనాలే కాదు.. బ్యూటీ బెన్ఫిట్స్ కూడా ఉన్నాయి.

మండుటెండలో తియ్య తియ్యని రుచితో.. నోటిని తీపి చేసే మామిడిపండ్లు చర్మ సౌందర్యానికి, కేశాల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మార్కెట్ లో దొరికే మ్యాంగో డ్రింక్స్ కాకుండా.. ఫ్రెష్ గా తయారు చేసిన మ్యాంగో జ్యూస్ ఉపయోగించాలి. అప్పుడే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అద్భుతమైన రుచితో ఆనందపరిచే మ్యాంగోలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఫేస్ ప్యాక్, స్క్రబ్ లలో కూడా మామిడిపండుని ఉపయోగిస్తారు. ఇక వెంటనే మామిడిపండ్లలో ఉండే.. చర్మ, జుట్టు సంరక్షణ ప్రయోజనాలు చూసేద్దాం..

  • ప్రకాశవంతమైన చర్మానికి మామిడిపండ్లలో డార్క్ స్పాట్స్, యాక్నే నివారించి ప్రకాశవంతమైన చర్మం అందించే సత్తా ఉంది. విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల.. చర్మం షైనింగ్ గా మారుతుంది.
  • బ్లాక్ హెడ్స్ మామిడిపండ్లు బ్లాక్ హెడ్స్ ఎలా నివారిస్తాయని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే.. ఒక టీ స్పూన్ మామిడిపండు గుజ్జుకి, అర టీ స్పూన్ పాలు లేదా పాలపొడి, తేనె కలపాలి. దీన్ని ముఖంపై బాగా స్ర్కబ్ చేయాలి. ఇది చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ నివారిస్తుంది.
  • యాంటీ ఏజింగ్ ఏజింగ్ ని, పిగ్మెంటేషన్ ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ మామిడిపండ్లలో ఉన్నాయి. అలాగే హానికారక ఫ్రీ రాడికల్స్ తో పోరాడే సత్తా కూడా వీటిలో ఉంది. విటమిన్ సి మొటిమలు, యాక్నేతో పోరాడుతాయి. మ్యాంగో గుజ్జుని చర్మానికి డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల చర్మానికి సహజ సౌందర్యం పొందుతుంది.
  • కాంప్లెక్షన్ మామిడిపండ్లలో విటమిన్ ఏ ఉండటం వల్ల ఇది ఆరోగ్యవంతమైన చర్మానికి సహాయపడుతుంది. బాగా పండిన మామిడిపండుని ముఖానికి, చేతులకు స్క్రబ్ చేయడం, లేదా మామిడిపండు గుజ్జుకి మీగడ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. మీరు ఊహించని ఫలితాలు పొందుతారు.
  • డార్క్ స్పాట్స్ మామిడితొక్క కూడా డార్క్ స్పాట్స్ నివారించడానికి సహాయపడుతుంది. కాబట్టి మామిడితొక్కలను ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ పొడికి టీ స్పూన్ పెరుగు కలిపి.. రాసుకుంటే.. డార్క్ స్పాట్స్ తగ్గిపోయి.. గ్లోల్డెన్ గ్లో సొంతమవుతుంది.
  • యాక్నె మ్యాంగో జ్యూస్ రాయడం వల్ల చర్మంపై యాక్నే నివారించవచ్చు. చిన్న మామిడిపండుని కొద్ది ఉడకబెట్టాలి. ఈ నీటిని యాక్నే రిమూవర్ గా ఉపయోగించాలి.
  • క్లెన్సర్ టీ స్పూన్ వీట్ ఫ్లోర్ కి , కొద్దిగా మామిడిపండు గుజ్జు కలపాలి. ఇది క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. ముఖంపై గుంతలను కూడా మాయం చేస్తుంది.
  • హోంమేడ్ ఫేస్ వాష్ ఒక టీస్పూన్ మామిడిపండు గుజ్జు, ఒక టీస్పూన్ బాదాం పొడి కలపాలి. ఇందులో టేబుల్ స్పూన్ పాలు మిక్స్ చేసి.. బాగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.
  • సున్నితమైన చర్మానికి మీది సెన్సిటివ్ స్కిన్ అయితే.. మామిడిపండు గుజ్జు, ఓట్ మీల్, పాలు, తేనె తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరిన తర్వాత ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
  • జుట్టుకి కండిషనర్ హోంమేడ్ కండిషనర్ తయారు చేసుకోవచ్చు. మామిడిపండు గుజ్జు, పెరుగు, రెండు కోడిగుడ్లలోని పచ్చసొన తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కండిషనర్ లా పనిచేస్తుంది.
  • చుండ్రు మామిడిపండ్లలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది డాండ్రఫ్ నివారించి జుట్టు షైనింగ్ గా మారుతుంది. విటమిన్ ఈ స్కాల్ఫ్ లో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేసి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
  • హెయిర్ లాస్ మ్యాంగో సీడ్ ఆయిల్ లో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఆయిల్ తయారు చేయడానికి మామిడి విత్తనంపై పొట్టు తీసేయాలి. కొబ్బరినూనె, నువ్వుల నూనె, ఆవ నూనె కలిపి ఒక జార్ పెట్టుకోవాలి. ఈ జార్ లో మామిడి విత్తనం వేయాలి. కొన్ని రోజులు సూర్యరశ్మి తగిలేలా ఈ జార్ పెట్టాలి. తర్వాత ఈ ఆయిల్ ని రోజూ వాడుతూ ఉంటే.. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా మారి.. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.


క‌రివేపాకులో ఉన్న అమోఘ‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

ప్ర‌తి ఇల్లాలి నేస్తం క‌రివేపాకు అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. ప్ర‌తి వంట‌లో క‌రివేపాకు ఉండాల్సిందే. క‌రివేపాకు సువాస‌న‌కు మాత్ర‌మే కాదు.. ఔష‌ధ గుణాలు కూడా అమోఘం ఉన్నాయి కాబ‌ట్టి.. అంత ప్రాధాన్య‌త ఇస్తారు. క‌రివేపాకు నిత్యం వాడ‌టం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు స్వ‌స్తిచెప్ప‌వ‌చ్చు. క‌రివేపాకు రుచికి మాత్ర‌మే కాదు.. ఇందులోని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అమోఘంగా ఉంటాయి. దీన్ని వంట‌కాల్లోనే కాకుండా.. ర‌క‌ర‌కాల వ్యాధులు, అనారోగ్య స‌మ‌స్య‌లు నివారించ‌డానికి ఉప‌యోగించ‌వ‌చ్చు. క‌రివేపాకులో ఉన్న అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలేంటో ఇప్పుడు చూద్దాం..


  • క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలు కలిపి పచ్చడిగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటివి త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి.
  • క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు ఎండిన కరివేపాకులు, ధనియాలు, జీలకర్రలను నెయ్యిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, సీసాలో నిల్వచేసుకోవాలి. దీనిని ఉదయం సాయంకాలాలు భోజనంలో వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది.
  • క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు కరివేపాకులను ముద్దగా నూరి 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
  • క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు కరివేపాకు కాయల రసం తీసుకుని అంతే మోతాదులో నిమ్మరసం కలిపి తీసుకుంటే.. చ‌ర్మంపై ద‌ద్దుర్లు, వాపు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
  • క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా టీస్పూన్ మోతాదులో తీసుకుంటే మూత్ర పిండాల సమస్య తగ్గుతుంది.
  • క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని, వెన్నతోగాని కలిపి కళ్ల కింద చర్మం మీద రాసుకుంటే న‌ల్ల‌టి వలయాలు తగ్గుతాయి.
  • క‌రివేపాకులో ఉన్న ఔష‌ధ గుణాలు కరివేపాకు పొడిని ఆహారంలో ప్రతిరోజూ మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే చెమట వల్ల వచ్చే దుర్వాసన తగ్గుతుంది.


Tuesday, March 8, 2016

మహిళ మేలుకుంది... హక్కుల్ని సాధించింది


అంతర్జాతీయ మహిళా దినోత్సవం.... ఒక్క మనమే కాదు... ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయంగా, వ్యాపారపరంగా, అధికారపరంగా ఎదిగిన తమ జాతి ఉన్నతిని చూసి ఉప్పొంగుతున్నారు. అసలు మహిళా దినోత్సవం ఎలా వచ్చింది...? ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు... మరి ఒకప్పుడు... కేవలం ఇంటిపనులకే పరిమితం. ముఖం మీద మూసిన కొంగు బయట ఎత్తకూడదు. ఇక పాశ్చాత్య దేశాల్లో చాలా చిన్నస్థాయి ఉద్యోగాలకే మహిళలు అర్హులు. అయినా వారికిచ్చే రోజూవారి కూలీ మగవాళ్లతో పోలిస్తే చాలా తక్కువ. ఇలా ప్రతి విషయంలోనూ అణగారి పోయిన వారి మనసుపొరల్లోంచి ఉబికిన విప్లవమే... మహిళా దినోత్సవంగా మారింది. మహిళల్లో పంటిబిగువున బాధల్ని నొక్కిపట్టేవారే కాదు... తమ సమస్య ఇది బయటికి చెబుతూ ఉద్యమాలు చేసే నాయకురాళ్లు ఉన్నారు. అలాంటి వారి చలవే ఈ మహిళా దినోత్సవం. చరిత్రలో చూస్తే ప్రత్యేకంగా ఒకరి వల్ల మహిళా దినోత్సవం వచ్చిందని లేదు. వివిధ దేశాల్లో అనేక మంది మహిళలు చేసిన ఉద్యమాల ఫలితంగా ఆడవాళ్లకి ఓ దినోత్సవం ఏర్పడినట్టు తెలుస్తోంది. 

మొదటగా 1910లో ఇద్దరు జర్మన్ సామ్యవాదుల వల్ల అంతర్జాతీయ మహిళాదినోత్సవం అనే పేరు బయటికి వచ్చింది. దాదాపు 17 దేశాలకు చెందిన వందమంది మహిళలు ఆ ఏడాది ఒక్కచోట చేరారు. కాలరాస్తున్న హక్కుల గురించి చర్చించుకున్నారు. ఓటు హక్కుతో పాటూ, మగవాళ్లతో అన్నింట్లోనూ సమాన హక్కులు సాధించాలని ఆ వందమహిళలు అనుకున్నారు. ఆ మరుసటి ఏడాది మళ్లీ సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి ఊహించని రీతిగా ఏకంగా పదిలక్షల మంది మహిళలు వచ్చారు. మహిళల పోరాటం ఊపందుకుంది. 1913లో రష్యన్ మహిళలు మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం చేసుకున్నారు. జర్మనీలో 1914లో చేసుకున్న మహిళదినోత్సవాన్ని మహిళల ఓటుహక్కుకోసం అంకితమిచ్చారు. అయితే, వారికి ఓటుహక్కు మాత్రం 1918లో వచ్చింది. నిజానికి మార్చి 8న ప్రస్తుతం మహిళా దినోత్సవం చేసుకుంటున్నా... ఆ రోజున మాత్రం ఎలాంటి విప్లవాలు, ఉద్యమాలు జరుగలేదు. 

1917లో అమెరికాలోని ఫ్లోరిడాలో మహిళా విప్లవమే లేచింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో చివరి ఆదివారం మహిళాదినోత్సవం చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యాల తదితర దేశాల్లో ఏర్పడిన ఆహారకొరత ముగిసిపోవాలని నినాదాలు చేశారు. అనంతరం అదే ఏడాది అక్టోబర్ లో రష్యాలోనూ ఉద్యమాలు చేశారు మహిళలు. మహిళా దినోత్సవం రోజును దేశంలో సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. చివరికి 1965 నుంచి రష్యాలో మహిళా దినోత్సవం అంతర్జాతీయ సెలవుదినంగా మారింది. 1922లో చైనా, 1936లో స్పెయిన్ లో మహిళాదినోత్సవం అధికారికంగా చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాలో1949 నుంచి మార్చి ఎనిమిది నుంచి మహిళలకు సగం సెలవు ను ప్రభుత్వం ఇచ్చింది. 1977లో మార్చి8ని అధికారికంగా మహిళదినోత్సవంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతిపాదించింది.

Monday, March 7, 2016

శివరాత్రి రోజు ఉపవాసవేళ.. హెల్తీగా మరియు ఎనర్జిటిక్ గా ఉండటం ఎలా?

ఉపవాసం చేస్తే పుణ్యం సంగతేమోగానీ నీరసం మాత్రం వస్తుంది అనుకుంటాం. అవునా! అయితే ఏడాదికి ఒక్కరోజైనా శరీర అంతర్గత అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు శివరాత్రి. శివభక్తులు ఉపవాసన, జాగరణ చేస్తుంటారు. వారి దీక్ష మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే...తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసానికి ముందు మీరు తెలుసుకోవల్సిన కొన్ని ముఖ్య విషయాలు..

ఉపవాసం అంటే? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో క్రమశిక్షణ అలవడటానికి ఉపవాసం ఎంతో అవసరం. ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుంది కూడా! కాలరీలను నియంత్రించటం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ పెరుగుతుంది. చక్కెర స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది. ఉపవాసం ద్వారా జీర్ణాశయానికి విశ్రాంతి ఇవ్వటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగువుతుందని వైద్యులు చెప్తూ ఉంటారు. అలాగే ఉపవాసంనాడు పూర్తి విశ్రాంతిలో గడపటం వల్ల శరీరానికి తనని తాను శుద్ధి చేసుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి ఉపవాసం వల్ల ఆరోగ్యపరమైన మేలే జరుగుతుంది.

ఎనర్జీని నింపే నీరు: ఆహారం లేకుండా కొన్ని రోజులపాటు బతకగలం. కానీ నీరు లేకుండా ఒక్క రోజు కూడా బతకలేం. మన శరీరంలోని కణాలు పని చేయటానికి నీరు ఎంతో అవసరం. కాబట్టి ఉపవాసం నాడే కాదు ఉపవాసం ముందు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. ఈ పద్ధతినే ‘సూపర్‌ హైడ్రేషన్‌' అంటారు. అలాగే ఒంట్లోని నీటి శాతాన్ని తగ్గించే ఉప్పు, చక్కెరతో తయారైన పదార్థాలు తినకూడదు. వీటికి బదులుగా శరీరంలోకి చేరిన నీరు నిలిచి ఉండేందుకు తోడ్పడే ‘కార్బోహైడ్రేట్‌ రిచ్‌ ఫుడ్‌' తీసుకోవాలి.

కార్బోహైడ్రేట్‌ రిచ్‌ ఫుడ్‌’ తీసుకోవాలి. అంటే మల్టీగ్రెయిన్‌ బ్రెడ్‌, పాస్టా, తృణధాన్యాలు తీసుకోవాలి. క్యారట్లు, బంగాళాదుంపలు తినాలి. టమేటాలు, యాపిల్స్‌, అరటపళ్లు, ద్రాక్షలు ఆహారంలో చేర్చుకోవాలి.

పండ్లు - పాలు: చాలా మంది ఈ రోజు పండ్లు, పాలతో సరిపెట్టేస్తారు. ఇది చాలా మంచిది. పాలు సమతుల ఆహారం. పండ్లు పోషకాలను ఇవ్వడమే కాకుండా ఆకలి కానివ్వకుండా సాయపడతాయి. రోజులో కనీసం ఆరు సార్లు పండ్లు, పాలతో సరిపెట్టడం వల్ల శరీరంలోని విషపూరితాలు బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా ఈ పద్ధతి ప్రతి రోజూ జరుగుతుంది. ఈ పనంతా కాలేయం చేస్తుంది. రోజంతా పండ్లు, పాలు తీసుకోవడం వల్ల కాలేయానికి విశ్రాంతి లభించి, దాంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

పండ్లు - పాలు: పండ్లలో ఉండే ఖనిజాలు, విటమిన్లు అందడం వల్ల పోషకాహార లోపం వంటివి ఉంటే ఈ రోజుతో భర్తీ అవుతాయి. పీచు పదార్థం వల్ల జీర్ణవ్యవస్థ అంతా శుభ్రపడుతుంది. ఈ కాలం ప్రకృతి నుంచి పండ్లు బాగా అందుతాయి. వచ్చే ఎండాకాలానికి సిద్ధపడటానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. రోజంతా తగినన్ని పండ్లు, పాలు తీసుకున్నవారు కేజీ నుంచి 2 కేజీల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.


  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక పచ్చికొబ్బరి కోరి సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి.

  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు రోజంతా ఏమీ తినకుండా కేవలం టీ, కాఫీలతో సరిపెట్టేయడం మంచిది కాదు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఆకలి పుడుతున్నప్పుడు ఆహారం అందివ్వకపోతే పొట్టలో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో అల్సర్ పెరిగి, మంట పుడుతుంది. తరచూ ఉపవాసాలు చేసేవారు ఇదే పద్ధతిని అనుసరిస్తే జీర్ణవ్యవస్థపై చెడుప్రభావం చూపి, అనారోగ్యం కలుగుతుంది.
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు ఉపవాసం వల్ల నిన్నంతా ఏమీ తినలేదు కదా అని ఉపవాస దీక్ష వదిలే రోజు ఉదయాన్నే కావల్సినదానికన్నా అధికంగా ఆహారం తీసుకుంటుంటారు కొందరు. ఒకేసారి అలా తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఒంట్లో చేరుతాయి. పైగా రాత్రి జాగరణ చేయడం వల్ల మరుసటి రోజు భోజనం చేసి, నిద్రపోతారు. తిండి, నిద్ర వల్ల ఒంట్లో అదనపు కొవ్వు పెరుగుతుంది.
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు చాలామంది మహిళలు తినాలనే ధ్యాస నుంచి దృష్టి మరల్చుకునేందుకు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలాకాకుండా కాసేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మంద్రమైన సంగీతం వింటూ.. ధ్యానం చేయడం మంచిది.
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు సాధ్యమైనంత వరకూ ఆ రోజు పని భారం లేకుండా చూసుకోవాలి. ఎండలో వెళ్లడం, బరువు పనులు చేయడం సరికాదు. కొన్ని చిన్న చిన్న విధులు చక్కబెట్టడం వరకూ ఫర్వాలేదు
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు మామూలు రోజుల్లో పెద్దగా ఆకలి లేకపోయినా ఉపవాసం ఉన్నాం అనే ఆలోచనవల్లనేమో ఆరోజు విపరీతంగా ఆకలేస్తూ ఉంటుంది. ఇక ఆకలి మీదకు మనసు మళ్లిందా ఆహారం జోలికి వెళ్లకుండా ఆపటం ఎవరి తరం కాదు. కాబట్టి మనసును ఇతర విషయాల మీదకు మళ్లించాలి. వీలైనంత బిజీగా మారిపోవాలి. అయితే ఇతరత్రా పనుల్లో మునిగిపోవాలంటే కాలరీలు ఖర్చై నీరసపడిపోతామనే భయం కూడా ఉంటుంది. అందుకే తక్కువ కాలరీలు ఖర్చయ్యే యోగా, పుస్తకాలు చదవటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటంలాంటి వాటిలో నిమగ్నమవచ్చు. వీటితోపాటు ఈ చిట్కాలు కూడా పాటించొచ్చు.