శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ సీ32 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 54 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ తర్వాత సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్(షార్) నుంచి ఆకాశంలోకి ప్రయోగించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు.
1425 కిలోలు బరువు కలిగిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1ఎఫ్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ32 రోదసీలోకి మోసుకెళ్లింది. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం సిరీస్‌లో ఇది ఆరో ఉపగ్రహం.
No comments:
Post a Comment