Monday, March 7, 2016

శివరాత్రి రోజు ఉపవాసవేళ.. హెల్తీగా మరియు ఎనర్జిటిక్ గా ఉండటం ఎలా?

ఉపవాసం చేస్తే పుణ్యం సంగతేమోగానీ నీరసం మాత్రం వస్తుంది అనుకుంటాం. అవునా! అయితే ఏడాదికి ఒక్కరోజైనా శరీర అంతర్గత అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు శివరాత్రి. శివభక్తులు ఉపవాసన, జాగరణ చేస్తుంటారు. వారి దీక్ష మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే...తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపవాసానికి ముందు మీరు తెలుసుకోవల్సిన కొన్ని ముఖ్య విషయాలు..

ఉపవాసం అంటే? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో క్రమశిక్షణ అలవడటానికి ఉపవాసం ఎంతో అవసరం. ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుంది కూడా! కాలరీలను నియంత్రించటం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ పెరుగుతుంది. చక్కెర స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది. ఉపవాసం ద్వారా జీర్ణాశయానికి విశ్రాంతి ఇవ్వటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగువుతుందని వైద్యులు చెప్తూ ఉంటారు. అలాగే ఉపవాసంనాడు పూర్తి విశ్రాంతిలో గడపటం వల్ల శరీరానికి తనని తాను శుద్ధి చేసుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి ఉపవాసం వల్ల ఆరోగ్యపరమైన మేలే జరుగుతుంది.

ఎనర్జీని నింపే నీరు: ఆహారం లేకుండా కొన్ని రోజులపాటు బతకగలం. కానీ నీరు లేకుండా ఒక్క రోజు కూడా బతకలేం. మన శరీరంలోని కణాలు పని చేయటానికి నీరు ఎంతో అవసరం. కాబట్టి ఉపవాసం నాడే కాదు ఉపవాసం ముందు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. ఈ పద్ధతినే ‘సూపర్‌ హైడ్రేషన్‌' అంటారు. అలాగే ఒంట్లోని నీటి శాతాన్ని తగ్గించే ఉప్పు, చక్కెరతో తయారైన పదార్థాలు తినకూడదు. వీటికి బదులుగా శరీరంలోకి చేరిన నీరు నిలిచి ఉండేందుకు తోడ్పడే ‘కార్బోహైడ్రేట్‌ రిచ్‌ ఫుడ్‌' తీసుకోవాలి.

కార్బోహైడ్రేట్‌ రిచ్‌ ఫుడ్‌’ తీసుకోవాలి. అంటే మల్టీగ్రెయిన్‌ బ్రెడ్‌, పాస్టా, తృణధాన్యాలు తీసుకోవాలి. క్యారట్లు, బంగాళాదుంపలు తినాలి. టమేటాలు, యాపిల్స్‌, అరటపళ్లు, ద్రాక్షలు ఆహారంలో చేర్చుకోవాలి.

పండ్లు - పాలు: చాలా మంది ఈ రోజు పండ్లు, పాలతో సరిపెట్టేస్తారు. ఇది చాలా మంచిది. పాలు సమతుల ఆహారం. పండ్లు పోషకాలను ఇవ్వడమే కాకుండా ఆకలి కానివ్వకుండా సాయపడతాయి. రోజులో కనీసం ఆరు సార్లు పండ్లు, పాలతో సరిపెట్టడం వల్ల శరీరంలోని విషపూరితాలు బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా ఈ పద్ధతి ప్రతి రోజూ జరుగుతుంది. ఈ పనంతా కాలేయం చేస్తుంది. రోజంతా పండ్లు, పాలు తీసుకోవడం వల్ల కాలేయానికి విశ్రాంతి లభించి, దాంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

పండ్లు - పాలు: పండ్లలో ఉండే ఖనిజాలు, విటమిన్లు అందడం వల్ల పోషకాహార లోపం వంటివి ఉంటే ఈ రోజుతో భర్తీ అవుతాయి. పీచు పదార్థం వల్ల జీర్ణవ్యవస్థ అంతా శుభ్రపడుతుంది. ఈ కాలం ప్రకృతి నుంచి పండ్లు బాగా అందుతాయి. వచ్చే ఎండాకాలానికి సిద్ధపడటానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. రోజంతా తగినన్ని పండ్లు, పాలు తీసుకున్నవారు కేజీ నుంచి 2 కేజీల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.


  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక పచ్చికొబ్బరి కోరి సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి.

  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది.
  • ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు రోజంతా ఏమీ తినకుండా కేవలం టీ, కాఫీలతో సరిపెట్టేయడం మంచిది కాదు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఆకలి పుడుతున్నప్పుడు ఆహారం అందివ్వకపోతే పొట్టలో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో అల్సర్ పెరిగి, మంట పుడుతుంది. తరచూ ఉపవాసాలు చేసేవారు ఇదే పద్ధతిని అనుసరిస్తే జీర్ణవ్యవస్థపై చెడుప్రభావం చూపి, అనారోగ్యం కలుగుతుంది.
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు ఉపవాసం వల్ల నిన్నంతా ఏమీ తినలేదు కదా అని ఉపవాస దీక్ష వదిలే రోజు ఉదయాన్నే కావల్సినదానికన్నా అధికంగా ఆహారం తీసుకుంటుంటారు కొందరు. ఒకేసారి అలా తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఒంట్లో చేరుతాయి. పైగా రాత్రి జాగరణ చేయడం వల్ల మరుసటి రోజు భోజనం చేసి, నిద్రపోతారు. తిండి, నిద్ర వల్ల ఒంట్లో అదనపు కొవ్వు పెరుగుతుంది.
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు చాలామంది మహిళలు తినాలనే ధ్యాస నుంచి దృష్టి మరల్చుకునేందుకు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలాకాకుండా కాసేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మంద్రమైన సంగీతం వింటూ.. ధ్యానం చేయడం మంచిది.
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు సాధ్యమైనంత వరకూ ఆ రోజు పని భారం లేకుండా చూసుకోవాలి. ఎండలో వెళ్లడం, బరువు పనులు చేయడం సరికాదు. కొన్ని చిన్న చిన్న విధులు చక్కబెట్టడం వరకూ ఫర్వాలేదు
  • ఉపవాసం ఉండే వారు ఇలా చేయకూడదు మామూలు రోజుల్లో పెద్దగా ఆకలి లేకపోయినా ఉపవాసం ఉన్నాం అనే ఆలోచనవల్లనేమో ఆరోజు విపరీతంగా ఆకలేస్తూ ఉంటుంది. ఇక ఆకలి మీదకు మనసు మళ్లిందా ఆహారం జోలికి వెళ్లకుండా ఆపటం ఎవరి తరం కాదు. కాబట్టి మనసును ఇతర విషయాల మీదకు మళ్లించాలి. వీలైనంత బిజీగా మారిపోవాలి. అయితే ఇతరత్రా పనుల్లో మునిగిపోవాలంటే కాలరీలు ఖర్చై నీరసపడిపోతామనే భయం కూడా ఉంటుంది. అందుకే తక్కువ కాలరీలు ఖర్చయ్యే యోగా, పుస్తకాలు చదవటం, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటంలాంటి వాటిలో నిమగ్నమవచ్చు. వీటితోపాటు ఈ చిట్కాలు కూడా పాటించొచ్చు.


No comments:

Post a Comment