Saturday, July 30, 2016

ఆరెంజ్-అలోవెర జ్యూస్ తో మిరాకిల్ బ్యూటి బెనిఫిట్స్ ..!!

అందమైన చందమామలాంటి ముఖంలో నల్లగా ఒక మచ్చ కనిపిస్తే ఎలా ఉంటుంది. చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ముఖ చర్మం ఎప్పుడు అందంగా ఉండాలి. అందమైన ముఖంలో మొటిమలు మచ్చలు ఉంటే ఉన్నవారికే కాదు, చూసే వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. 


సాధారణంగా , మనలో చాలా మంది ఇలా ముఖంలో సెడన్ గా కనిపించే మార్పులకు భయపడిపోయి బ్యూటీ స్టోర్స్ చుట్టూ తిరుగుతూ ఖరీదై బ్యూటీప్రొడక్ట్స్ ను కొని, ఉపయోగిస్తుంటారు . మార్కెట్లో ఇన్ స్టాంట్ గా ఉండే ఈ పదార్థాలు చాల ఎఫెక్టివ్ గా మచ్చలను మొటిమలను నివారిస్తాయనుకుంటారు. 

ఈ కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి చర్మానికి మేలు చేయడం కంటే హాని ఎక్కువ చేస్తుంది. కాబట్టి, మన వంటగదిలోని కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఆరెంజ్ అలోవెవర వంటివి చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోసిస్తాయి. చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పినచేసి స్కిన్ కంప్లెక్షన్ ను హెల్తీగా మరియు రేడియంట్ గా మార్చుతాయి. 



మరి ఈ రెండింటి కాంబినేషన్ లో ఫేస్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలి. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

కావల్సినపదార్థాలు:
ఆరెంజ్ జ్యూస్ : 3 టేబుల్ స్పూన్లు 
అలోవెర: 2 టేబుల్ స్పూన్లు 

తయారుచేయు విధానం: 
పైన సూచించిన పదార్థాలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్ లో ముఖానికి వేసుకును ఫేస్ ప్యాక్ వల్ల పొందే బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

1. డ్రై స్కిన్ నివారిస్తుంది: ఆరెంజ్ అలోవెర ప్యాక్ వల్ల డ్రై స్కిన్ నివారించబడుతుంది. స్కిన్ సాప్ట్ గా మరియు సపెల్ గా మార్చుతుంది.

2. ముడుతలను మాయం చేస్తుంది: ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ తో ముడుతలు మాయం అవుతాయి. వీటిలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి . కాబట్టి ఇవి ఏజింగ్ సెల్స్ ను ఆలస్యం చేస్తుంది. దాంతో ఫైన్ లైన్స్ ముడుతలు నివారించబడుతాయి.

3. మైనర్ స్కిన్ సమస్యలను నివారిస్తుంది: ఈ కాంబినేషన్ ప్యాక్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మైనర్ కట్స్ , బర్న్స్ ను మరియు కీటకాలు కుట్టినప్పుడు ఈ మిశ్రమాన్ని రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

4. స్కిన్ టోన్ లైట్ చేస్తుంది : ఈ రెండింటి మిశ్రమంలో ఉండే విటమిన్ సి చర్మానికి నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మంచి కలర్ పొందుతారు.

5. బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది: ఆరెంజ్ అలోవెర ఫేస్ మాస్క్ ముఖంలో మురికి, మలినాలను తొలగిస్తుంది. చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి శుభ్రం చేస్తుంది. బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది .

6. చర్మంలో జిడ్డును నివారిస్తుంది: ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వల్ల చర్మంలో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో చర్మంలో జిడ్డు తొలగించుకోవచ్చు.

7. తెరచుకున్న చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది: ఆరెంజ్ మరియు అలోవెర కాంబినేషన్ ఫేస్ మాస్క్ వల్ల చర్మం రంద్రాలను చాలా ఎఫెక్టివ్ గా ముడుచుకుపోయేలా చేస్తుంది. స్కిన్ కంప్లెక్షన్ పెంచుతుంది.

Friday, July 29, 2016

వర్షాకాలంలో ఆహారాలు చెడిపోకుండా భద్రపరచడానికి జనరల్ టిప్స్

వర్షాకాలంలో ఆహారం చాలా తొందరగా చెడిపోతుంది. ఆహారాన్ని తాజాగా ఉంచటానికి చాలా పని చేయవలసి ఉంటుంది. అయితే ఆహారాన్ని తాజాగా ఉంచటానికి ఈ క్రింద ఉన్న కొన్ని సూచనలను అనుసరించండి.

వర్షాకాలంలో ఆహారం పట్ల శ్రద్ద తీసుకోకపోతే మీ కుటుంబంలోని వారికీ వ్యాదులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 


ఇక్కడ మీ ఆహారం నిల్వ ఉంచటానికి మరియు వ్యాధులను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఎక్కువ మొత్తంలో వండకూడదు 

ఏడాదిలో వర్షాకాలం సమయంలో ఆహారం చాలా సులభంగా ఫంగస్ కు ప్రభావితమవుతుంది. అంతేకాకుండా నగర వాతావరణంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండుట వలన ఆహారం తొందరగా చెడిపోతుంది. దీనికి ఉత్తమ మార్గం ఏమిటంటే మనకు సరిపడే పరిమాణంలో మాత్రమే ఆహారంను వండుకోవాలి. ఒకవేళ మిగిలిపోతే ఇంటిలో పనిచేసేవారికి పెట్టాలి.

రిఫ్రిజరేటర్లో పొడి పదార్దాలను పెట్టండి 

రవ్వ,మైదా వంటి పొడి పదార్దాలను ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అలాగే వర్షాకాలంలో రవ్వను కొంచెం వేగించి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. అలాగే శనగపిండిని కూడా బాగా జల్లించి గాలి చొరని డబ్బాలలో పోసి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచాలి. ఈ విధంగా చేయుట వలన ఫంగస్ ను నివారించవచ్చు.



ఉత్ప్రేరకాలను ఉపయోగించాలి

వర్షాకాలంలో కీటకాలు లేదా పురుగులు నుండి కాయధాన్యాలను సేవ్ చేసేందుకు,వాటిని నిల్వ చేసే ముందు ఆవాల నూనెను రాయాలి. తాజా ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే క్రమంలో వాటికీ కొంత ఆముదమును చల్లాలి. అయితే ఆముదం ఎక్కువగా కాకుండా ఒక నిర్దిష్ట మొత్తంలో తీసుకోని చూడటానికి ప్రకాశవంతముగా ఉండేలాగా మాత్రమే జాగ్రత్తగా రాయాలి. నట్స్ తేమ కారణంగా మెత్తగా మారతాయి. వాటిని మైక్రోవేవ్ లో వేడి చేస్తే,అవి కొన్ని నిమిషాల తర్వాత క్రిస్పి గా మారతాయి.



వండిన ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి

వండిన ఆహారంలో బాక్టీరియా చేరకుండా ఉండటానికి,రెండు గంటలకు ఒకసారి మూత తీసి వండిన ఆహారంను కలుపుతూ ఉండాలి. చపాతీలు నాచు పట్టకుండా ఉండటానికి వార్తాపత్రికలు లేదా సిల్వర్ ఫాయిల్ పేపర్ తో చుట్టాలి. ఈ సీజన్ లో ఆహరం చెడిపోతుంది. కాబట్టి ఆహారం నిల్వ ఉంచినప్పుడు తప్పనిసరిగా కవర్ చేయాలి. అప్పడాలు వేగించిన తర్వాత,ఎక్కువసేపు క్రిస్పిగా ఉండాలంటే వాటిని ఒక జిప్ లాక్ ప్యాకెట్లలో నిల్వ చేయాలి.

మూతలు తప్పనిసరిగా ఉంచాలి 

మీ ఆహారాలను వండటానికి ముందు, తర్వాత కవర్ చేయాలి. లేకపోతె మీ ఆహారానికి మరియు ఆరోగ్యానికి ఒక పెద్ద ముప్పు ఉంటుంది.

వండటానికి ముందు శుభ్రం కడిగి తడి ఆరనివ్వాలి

కూరగాయలు మరియు పండ్లను శుభ్రంగా కడగాలి. వీటిని ఉపయోగించడానికి ముందు మరియు ఫ్రిడ్జ్ లో పెట్టటానికి ముందు బాగా ఆరనివ్వాలి.

Thursday, July 28, 2016

తొక్కే కదా అనుకోకండి..

జాయింట్ పెయిన్స్ ఎందుకొస్తాయి. సాధారణంగా ఆర్థరైటిస్ కారణంగా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. ఈ పరిస్థితిలో జాయింట్స్ లో ఎక్కువగా నొప్పి మరియు వాపు ఉంటుంది. .జాయింట్స్ లో ఉండే కార్టిలేజ్ చిరగడానికి కారణమవుతుంది. జాయింట్ పెయిన్ గౌట్ వల్ల కూడా వస్తుంది. జాయింట్ మరియు టిష్యులలో యూరిక్ యాసిడ్ నిల్వ చేరడం వల్ల గౌట్ పెయిన్ కు దారితీస్తుంది. దాంతో జాయింట్ సమస్యలకు దారితీస్తుంది. 

కొన్ని సందర్భాల్లో ప్రమాదాల వల్ల , ఆపరేషన్స్ వల్ల జాయింట్ పెయిన్స్ , స్ప్రెయిన్ మరియు స్ట్రెయిన్ వల్ల కూడా జాయింట్ పెయిన్ కు కారణమవుతుంది. జాయింట్స్ ఒక దానికొకటి కనెక్ట్ అయ్యుండం వల్ల మనం మన శరీరాన్ని తేలికగా కదిలించగలుగుతాము. మరియు మన శరీరం బ్యాలెన్స్ చేయడానికి ఎముకలను స్ట్రాంగ్ ఉంచడానికి జాయింట్ ఉపయోగడపుతాయి . కేవలం ఒకే ఒక రెమెడీతో జాయింట్ పెయిన్ నివారించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? అదేదో కాదు నిమ్మ తొక్క జాయింట్ పెయిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . జాయింట్ పెయిన్ కు ఇది ఒక అద్భుతమైన ఔషధి. 



నిమ్మతొక్కలో క్యాల్షియం, విటమిన్ సి, పెక్టిన్, ఫైబర్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఈ న్యూట్రీషియన్స్ అన్నీ శరీరంలో డ్యామేజ్ లను రిపేర్ చేయడానికి, నయం చేయడానికి సహాయపడుతాయి.జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి లెమన్ పీల్ తినవచ్చు. అలాగే నిమ్మతొక్కను నొప్పి ఉన్న జాయింట్స్ లో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆర్టికల్లో నిమ్మతొక్కను ఉపయోగించి జాయింట్ పెయిన్ ఎలా నివారించుకోవచ్చు మరియు ఇతర హెల్త్ బెనిఫిట్స్ ఏంటని తెసుకుందాం...

జాయింట్ పెయిన్ నివారించడానికి నిమ్మరసం: పుష్కలంగా ఉంది . విటమిన్ సి లో నయం చేసే గుణాలు ఎక్కువ. కాబట్టి, ప్రతి రోజూ 30శాతం విటమిన్ సి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు .ఇందులో ఉండే ప్రోటీన్ లిగమెంట్ ఫార్మేషన్ కు టెండెన్స్ మరియు స్కిన్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఎముకల ఆరోగ్యానికి నిమ్మ: నిమ్మరసంలో ఉండే విటమిన్ సి బోన్ కు కనెక్ట్ అయ్యుండే కార్టిజోల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. లేదా రిపేర్ చేస్తుంది. ప్రమాదాల వల్ల జరిగే గాయాలను మాన్పుతుంది . నిమ్మరసం ఎముకలను, కార్టిజోల్ మరియు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.


నిమ్మలో ఉండే క్యాల్షియం: ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే మరో పోషకపదార్థం క్యాల్షియం, . ఇది ఎముకల ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

నిమ్మ తొక్క రిసిపి తయారీ: 5నిమ్మకాయలు, ఆలివ్ ఆయిల్, ప్లాస్టిక్ బ్యాగ్ , ఉలెన్ షాల్, మరియు జార్. నిమ్మ తొక్కను తొలగించి తొక్కను జార్ వేసి, అలాగే ఆలివ్ ఆయిల్ కూడా వేసి, టైట్ గా మూత పెట్టి మూడు వారాలు అలాగే ఉంచాలి.3 వారాల తర్వాత బయటకు తీసి జాయింట్ పెయిన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . తర్వాత ప్లాస్టిక్ కవర్ ను కవర్ చేసి దాని మీద వేడిగా కాపడం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జాయింట్ లోపలికి ఆయిల్ షోషణ చెంది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది . రాత్రి నిద్రించడానికి ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది,.

నిమ్మతొక్క తినడం గుండెకు కూడా మంచిదే: నిమ్మ తొక్కలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. హార్ట్ కు మేలు చేస్తుంది.

వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది: నిమ్మతొక్క వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. జలుబు దగ్గు మరియు గొంతు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

మలబద్దకం గ్యాస్ నివారిస్తుంది: నిమ్మతొక్కలో ఉండే ఫైబర్ కంటెంట్ నార్మల్ బౌల్ మూమెంట్ ను కు సహాయపడుతుంది. కోలన్ శుభ్రం చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపుబ్బరం తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గించడంలో నిమ్మతొక్క గ్రేట్ రెమెడీ. నిమ్మతొక్కలో ఉండే పెక్టిన్ శరీంర షుగర్ గ్రహించకుండా చేస్తుంది. బరువు తగ్గిస్తుంది.

డయాబెటిస్ నివారిస్తుంది: నిమ్మతొక్క డయాబెటిక్ వారికి కూడా మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది.

హెల్తీ స్కిన్: హెల్తీ స్కిన్ కోసం ఒక బెస్ట్ హోం రెమెడీ లెమన్ . లెమన్ పీల్ డార్క్ స్పాట్స్ , ముడుతలు, ఇతర స్కిన్ సమస్యలను నివారిస్తుంది. . దీన్ని నేరుగా ముఖానికి అప్లై చేసి సమస్యలను తగ్గించుకోవచ్చు.

Wednesday, July 27, 2016

ప్రముఖ ఆలయాల్లో... తప్పకుండా రుచి చూడాల్సిన మహా ప్రసాదాలు..!!

దేవుడికి నైవేద్యం పెట్టడం ద్వారా దేవుడిపై భక్తిని చాటుకుంటాం. దేవాలయాల్లో ప్రసాదం పంచడం ఆనవాయితీగా వస్తుంది. గుళ్లో దేవుడి ప్రసాదం తీసుకుంటే.. ఆ దేవుడి ఆశీస్సులు, వరం పొందవచ్చని ఒక నమ్మకం ఉంది. ప్రసాదాలను ఎంతమందికి పంచితే.. అంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. 

దేవుడికి కొబ్బరికాయ, పూలు ఎంత ముఖ్యమో.. నైవేద్యంగా ప్రసాదం సమర్పించడమూ అంతే ముఖ్యం. నైవేద్యంగా.. ఏదైనా సమర్పించవచ్చు. ఉన్నవాళ్లు పంచభక్ష పరమాన్నాలు సమర్పిస్తే.. లేనివాళ్లు బెల్లంతో దేవుడికి నైవేద్యం పెడతారు. ఏది పెట్టినా.. దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు. అయితే.. పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాలకు దేవుడి విగ్రహం, వాతావరణం ప్రత్యేకం 

అయితే.. కొన్ని ఆలయాల్లో ప్రసాదమే ప్రత్యేకం. ముఖ్యంగా.. తిరుమల అనగానే.. ఆ ఏడుకొండలవాడి లడ్డూకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. లడ్డూ ప్రసాదం ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుకే.. ఈ తిరుమల లడ్డూ అంతే అందరికీ ప్రీతికరం.

అయితే కొన్ని ఆలయాల్లో ప్రసాదం అంటే.. అరచేతిలో పెట్టేవే కాకుండా.. కడుపునిండా ప్రసాదం పెట్టే ఆలయాలు కూడా ఉన్నాయి. దేవుళ్లకు పెట్టే ప్రసాదాలు.. ఆయా ప్రదేశాలు, ప్రాంతాలు, ఆచారాలను బట్టి.. ఉంటాయి. మరో విషయం ఏంటంటే.. కొన్ని ఆలయాల్లో మాంసాహారాన్ని కూడా.. ప్రసాదాలుగా పెడతారు. ఇవాళ ఇండియాలోని ప్రత్యేక ఆలయాల్లో.. స్పెషల్ ప్రసాదాల లిస్ట్ చూద్దాం..




తిరుమల లడ్డు ప్రసాదం అనగానే ముందుగా తెలుగురాష్ట్రాల వాళ్లకు గుర్తొచ్చేది తిరుమల లడ్డు. నెయ్యితో తయారు చేసే..ఈ లడ్డూకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇందులో ప్రధానంగా వాడతారు. ఈ లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది.

లడ్డూతో పాటు తిరుమలలో లడ్డూ ప్రసాదంతోపాటు వడ, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, ఆపమ్, పాయసం, జిలేబీ, మురుకు, కేసరి, మల్హోరా ప్రసాదాలు కూడా చాలా ప్రత్యేకం.

పూరీ జగన్నాథ్ ఆలయ ప్రసాదం ప్రసాదాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒడిషాలోని పూరీ జగన్నాథ్ ఆలయ మహాప్రసాదం. ఇక్కడ పూరీ జగన్నాథుడికి 56 రకాల వంటకాలతో ప్రసాదాలు సమర్పిస్తారు.

రుచి, వాసన ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ప్రసాదాలను దేవుడికి సమర్పించక ముందు.. రుచి, వాసన ఉండదు. కానీ దేవుడికి నైవేద్యంగా సమర్పించగానే.. ప్రదానికి ఘుమఘుమల వాసన, రుచి వస్తాయి.

నాన్ వెజ్ ప్రసాదం పూరీ జగన్నాథ ఆలయంలోనే మాంసాహారం కూడా ప్రసాదంగా పెడతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే జగన్నాథుడి భార్య విమలాదేవికి ప్రతిరోజూ దుర్గాపూజలు చేసి.. అమ్మవారికి బలి ఇచ్చిన మేక మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. అలాగే గుడి కొలనులోని చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీ.

గోల్డెన్ టెంపుల్ సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే అమృతసర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులకు గోల్డెన్ లెంపుల్‌లోని లంగాలర్‌లో కుల, మత రహితంగా ప్రసాదం వడ్డిస్తారు.

ప్రసాదం స్పెషాలిటీ లంగార్‌లోని సాంప్రదాయ వంటశాలలో రోజూ రెండు లక్షల చపాతీలు, ఒకటిన్నర టన్నుల పప్పు, వండి వడ్డిస్తారు. భక్తులకు ప్రసాదంగా పంచేందుకు 100 క్వింటాళ్ల గోధుమ పిండి, 25 క్వింటాళ్ల ధాన్యాలు, 10 క్వింటాళ్ల రైస్, 5000 లీటర్ల పాలు, 10 క్వింటాళ్ల చక్కెర, 5 క్వింటాళ్ల నెయ్యి ఉపయోగిస్తారు.

రాజస్థాన్ ఆలయం వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాజస్థాన్‌లో సల్సార్ బాలాజీ ఆలయంలో సావమణి ప్రసాదం చాలా ప్రత్యేకం. ఇక్కడున్న స్వయంభూ హనుమాన్ ఆలయంలో హనుమంతుడి విగ్రహం గుండ్రంగా ఉంటుంది. ఆంజనేయుడికి గడ్డాలు, మీసాలు కూడా ఉంటాయి.



ప్రసాదం ఈ మీసాల ఆంజనేయుడికి భక్తులు 50 కేజీలకు తగ్గకుండా నైవేద్యాన్ని సమర్పిస్తారు. నెయ్యి కలిపిన దాల్ భాటి, చుర్మా, బూందీ, దూద్ పేడా లడ్డూ ఈ ఆంజనేయుడికి సమర్పించే ప్రసాదం స్పెషాలిటీ.

వైష్ణోదేవి ఆలయం జమ్మూ సమీపంలో వైష్ణోదేవి ఆలయంలో పిండి రూపంలో అమ్మవారు ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ దేవాలయం ఎంత ఫేమసో ఇక్కడ పెట్టే ప్రసాదానికీ అంతే పేరుంది.

ప్రసాదం వైష్ణోదేవి అమ్మవారికి రాజ్‌మా, బియ్యంతో ఉడికించిన ప్రసాదం, కడీ చావల్, శెనగలు, పూరీ, ప్రసాదంగా పెడతారు. ఈ ప్రసాదాల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా వండుతారు. అలాగే డ్రైడ్ యాపిల్స్, ఎండుకొబ్బరి, వాల్ నట్స్ కూడా చాలా ఫేమస్.

జాగర్ కోవిల్ మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో కల్లా జాగర్ ఆలయం ఉంది. దీన్నే అలాగర్ టెంపుల్ అని పిలుస్తారు. విష్ణుమార్తి కొలువై ఉన్న ఈ ఆలయంలో ప్రసాదం ఏంటో తెలుసా.. సాంబార్, దోశె.


Tuesday, July 26, 2016

కూల్ డ్రింక్స్ ఏ కదా అనుకోకండి.. కొంప ముంచుతుంది...

ఇంటికి ఎవ‌రైనా అతిథులు వ‌స్తే చాలు కూల్‌డ్రింక్స్ ఇచ్చేస్తుంటాం...స‌మ్మ‌ర్ వ‌చ్చిదంటే చాలు బాటిల్స్ మీద బాటిల్స్ డ్రింక్స్ తాగేస్తుంటాం. 



అబ్బా..బయట బాగా ఎండగా ఉందిరా.. పదా ఓ కూల్ డ్రింక్ తాగుదాం ప్రెండ్స్ మద్య సంభాషణ. ! చింటూ మామయ్య బాగా ఎండన పడివచ్చారు వెళ్లి ఫ్రిడ్జ్ లోని ఓ కూల్ డ్రింక్ పట్ట్రా కొడుకుతో తల్లి.! బిర్యానీ తో పాటు ఓ కూల్ డ్రింక్ ఉంటేనే అసలు మజా...ఓ బిర్యానీ సెంటర్ దగ్గర సంభాషణ. ఈ మద్య కాలంలో కూల్ డ్రింక్ అనే పదం కామన్ అయిపోయింది. అదేదో సర్వ రోగ నివారిణి లాగా.! 

అయితే ఈ కూల్ డ్రింక్స్‌లు మ‌న‌కు తాత్కాలికంగా దాహ‌ర్తి తీర్చినా, అప్ప‌టిక‌ప్పుడు కాస్త ఉత్తేజాన్ని ఇచ్చిన ధీర్ఘ‌కాలంలో మ‌న జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాయ‌న్న విష‌యం మాత్రం చాలా త‌క్కువ‌మందికి మాత్ర‌మే తెలుస్తుంది. గటగటా కూల్ డ్రింక్ లను తాగడం వరకే మనకు తెలుసు. కానీ వాటి వల్ల తర్వాత మన ఆరోగ్యం ఎలా తయారవుతుంది? అనేది మనకు తెలియదు. 



మన శరీరంలోకి పోయిన కూల్ డ్రింక్ ఏయే అవయవాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెల్సుకుందాం. అమెరికాలో సంవత్సరానికి ఒకరు తాగే కూల్ డ్రింక్ సరాసరి 251 లీటర్లంట! అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా?

కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాలకు: కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.



కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు: కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వు గా మారి బరువు పెరుగుతారు.

కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు: రక్తంలోకి షుగర్ ను పంపియడం కొనసాగుతుంది. కోల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్త పోటు పెరిగి, మీ కంటి పాపలు చిన్నగవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.

కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు: ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే.

కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు: గంట తరువాత, మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి.

ఎముకల సాంద్రత తగ్గుట: ఇందులో ప్రతిరోజూ కూల్ డ్రింక్ తాగే మహిళలలో ఎముకల సాంద్రత తగ్గిపోయిందట. 2005లో ఎముక ఖనిజ సాంద్రత (BMD ) పరీక్ష ను కూల్ డ్రింక్స్ తాగే 1413 మంది మహిళలపై, 1125 మంది మగవారిపై నిర్వహించి అమెరికా వారు ఈ విషయాన్ని దృవీకరించారు.

కాల్షియం తగ్గిపోవుట: కూల్ డ్రింక్ లో ఫాస్పరిక్ ఆసిడ్ ఉండటం వలన ఎముకలలో ఉండే కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది. దీని కారణంగా శరీరం ఏ పనిచేయడానికి సహకరించదు.

ఊబకాయం/బరువు పెరగడం: ప్రతిరోజూ కూల్ డ్రింక్ తీసుకోవడం వలన సంవత్సరానికి దాదాపు 6.5కేజీలు/14.5 పౌండ్ల బరువు పెరుగుతారు.

కాల్షియం తగ్గిపోవుట: కూల్ డ్రింక్ లో ఫాస్పరిక్ ఆసిడ్ ఉండటం వలన ఎముకలలో ఉండే కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది. దీని కారణంగా శరీరం ఏ పనిచేయడానికి సహకరించదు.

మధుమేహం: ఒక కూల్ డ్రింక్ లో ఉండే చక్కెర దాదాపు 10 టీ స్ఫూన్లతో సమానం.ఇది తాగడం వలన మధుమేహ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ శాతం ఉంది మరియు ఇన్సులెన్ నిరోధం కూడా కోల్పోతారు.

క్యాన్సర్ కు కారణం: కూల్ డ్రింక్ తీసుకోవడం వలన క్యాన్సర్ ను ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువ. మధుమేహ వ్యాధితో పాటు దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది.

హృదయ సంబంధిత వ్యాధులు: చక్కెర శాతం మనం తీసుకుండే కూల్ డ్రింక్స్ వల్ల గుండె సంబంధిత వ్యాదులు చోటుచేసు కుంటాయి మరియు గుండెనొప్పికి దారితీస్తాయి.

కృత్రిమ చక్కెరలు: మనం తీసుకుంటున్న ఈ డ్రింక్స్ కారణంగా కృత్రిమ చక్కెర ఎక్కువగా శరీరంలోకి చేరి జీవక్రియ మరియు కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపుతుంది.

దంతాలపై ప్రభావం: వాటిలోని ఆసిడ్ కారణంగా దంతసమస్యలు వస్తాయి. అలాగే కొత్త బ్యాక్టీరియాలు నోటిలోకి చేరుతాయి. అందువలన నోటి దుర్వాసన మరియు దంత సమస్యలు కలుగుతాయి.

లివర్ కు ప్రమాదకరం: కూల్ డ్రింక్ లో శుక్రరసం మరియు మెర్కురీలను కలపడం వలన కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి, ముందుముందు కాలేయం పూర్తిగా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది.

నివేదిక వ‌చ్చాక షుగర్‌తో కూడిన డ్రింక్ లపై పన్ను విధించాలన్న ఒత్తిడి కూడా బ్రిటీష్ ప్రభుత్వంపై పెరిగింది. ఈ పరిశోధనల నేపథ్యంలో బ్రిటన్‌లోని శీతల పానీయాల ఉత్పత్తి సంస్థలు తమ డ్రింక్స్‌లో చక్కెర శాతాన్ని చాలావరకు తగ్గించే పనిలో పడ్డాయి.

కూల్ డ్రింక్ తాగడం పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.

Monday, July 25, 2016

ఎగ్ ని ఎలా తీసుకుంటే.. అందులోని పోషకాలు పొందవచ్చు ?


ఏ వయసు వాళ్లకైనా.. ఎగ్ అనేది హెల్తీ ఆప్షన్. బ్రెడ్ స్లైస్ లో ఎగ్ పెట్టుకుని తీసుకోవడం వల్ల.. శరీరానికి మంచిది. ఎగ్ ద్వారా ప్రొటీన్స్ కావాల్సిన మోతాదులో పొందవచ్చు. అయితే.. ప్రతి రోజూ ఎగ్స్ తినడానికి బోర్ గా పీలవుతుంటే.. డిఫరెంట్ గా, టేస్టీగా తీసుకోవచ్చు. దీనివల్ల ప్రొటీన్స్ అందుతాయి.. ఎగ్స్ ని డైలీ డైట్ లో చేర్చుకోవచ్చు. 


అయితే చాలామంది ఉడికించిన ఎగ్ ద్వారా మాత్రమే.. సరైన పోషకాలు పొందవచ్చని భావిస్తారు. కానీ.. ఎగ్ ని రకరకాల పద్ధతుల్లో తీసుకుంటూనే.. దాని ద్వారా పోషకాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఒకేరకంగా తీసుకోవడం కంటే.. విభిన్నంగా ఎగ్ ని తీసుకోండి. ఇప్పుడు ఎగ్ ని టేస్టీగా, హెల్తీగా తీసుకునే పద్ధతులు చూద్దాం..




స్క్రాంబుల్డ్ ఎగ్:
ఎగ్స్ పగల కొట్టి.. ఒక గిన్నెలో మిశ్రమాన్ని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కారం, పాలు కలిపి.. బాగా కలపాలి. ఇప్పుడు ఒక పాన్ పై వేయాలి. తర్వాత కొన్ని టమోటా ముక్కలు, మిర్చి ముక్కలు ఎగ్ మిశ్రమంపై చల్లుకుని.. బాగా కలపాలి. ఇలా తీసుకోవడం చాలా మంచిది.



ఎగ్ సాండ్విచ్:
బ్రెడ్ తో పాటు, ఎగ్స్ తీసుకోవడం వల్ల రెండింటి ద్వారా ప్రొటీన్స్ పొందవచ్చు. ఎగ్ ని ఆమ్లెట్ వేసుకుని.. బ్రెడ్ ని కాస్త వెన్నతో కాల్చి మధ్యలో పట్టుకుని తింటే.. హెల్తీగానూ, టేస్టీగానూ ఉంటుంది.



సలాడ్ రూపంలో :
రెండు ఎగ్స్ తీసుకుని డైరెక్ట్ గా పాన్ పై వేయాలి. అది ఫ్రై అయ్యాక.. దాన్ని ప్లేట్ లోకి తీసుకుని సలాడ్ ని పైన వేసుకుని తీసుకోవడం వల్ల సలాడ్ ద్వారా, ఎగ్ ద్వారా కావాల్సినన్ని పోషకాలు పొందవచ్చు.



ఫ్రెంచ్ టోస్ట్ :
2 పచ్చి కోడిగుడ్లను ఒక గ్లాసు పాలలో కలపాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో వోల్ గ్రెయిన్ బ్రెడ్ ని ముంచి.. పాన్ పై ఫ్రై చేసుకోవాలి. అంతే.. ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. దీనిద్వారా కూడా.. క్యాల్షియం, ప్రొటీన్స్ పొందవచ్చు.



ఆమ్లెట్స్ :
మీకు బాగా ఇష్టమైన వెజిటబుల్స్ ని తీసుకుని అంటే ఆనియన్, టమోటా, మిర్చి అన్నింటినీ.. ఎగ్ లో మిక్స్ చేసి.. ఆమ్లెట్ వేసుకుని తినవచ్చు.



ఎగ్ బుర్జీ :
దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఎగ్ ఫ్రై అంటారు. ఈ కూరను రైస్, చపాతీలతో తీసుకోవచ్చు.



ఉడికించిన ఎగ్ :
చాలా సింపుల్ అండ్ హెల్తీ పద్ధతి. ఎగ్ ని ఉడికించి.. కాస్త పెప్పర్ వేసుకుని తినడం వల్ల.. శరీరానికి కావాల్సిన పోషకాలు పొందవచ్చు.



ఓట్ మీల్ :
ఓట్ మీల్ హెల్త్ బెన్ఫిట్స్ కూడా పొందాలి అనుకుంటే.. చాలా సింపుల్ గా ఎగ్ తో పాటు తీసుకోవచ్చు. ఉడికించి కోడిగుడ్ల ముక్కలపై ఓట్ మీల్ ని ప్లేస్ చేసి.. తీసుకుంటే.. సరి.