Tuesday, July 26, 2016

కూల్ డ్రింక్స్ ఏ కదా అనుకోకండి.. కొంప ముంచుతుంది...

ఇంటికి ఎవ‌రైనా అతిథులు వ‌స్తే చాలు కూల్‌డ్రింక్స్ ఇచ్చేస్తుంటాం...స‌మ్మ‌ర్ వ‌చ్చిదంటే చాలు బాటిల్స్ మీద బాటిల్స్ డ్రింక్స్ తాగేస్తుంటాం. 



అబ్బా..బయట బాగా ఎండగా ఉందిరా.. పదా ఓ కూల్ డ్రింక్ తాగుదాం ప్రెండ్స్ మద్య సంభాషణ. ! చింటూ మామయ్య బాగా ఎండన పడివచ్చారు వెళ్లి ఫ్రిడ్జ్ లోని ఓ కూల్ డ్రింక్ పట్ట్రా కొడుకుతో తల్లి.! బిర్యానీ తో పాటు ఓ కూల్ డ్రింక్ ఉంటేనే అసలు మజా...ఓ బిర్యానీ సెంటర్ దగ్గర సంభాషణ. ఈ మద్య కాలంలో కూల్ డ్రింక్ అనే పదం కామన్ అయిపోయింది. అదేదో సర్వ రోగ నివారిణి లాగా.! 

అయితే ఈ కూల్ డ్రింక్స్‌లు మ‌న‌కు తాత్కాలికంగా దాహ‌ర్తి తీర్చినా, అప్ప‌టిక‌ప్పుడు కాస్త ఉత్తేజాన్ని ఇచ్చిన ధీర్ఘ‌కాలంలో మ‌న జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాయ‌న్న విష‌యం మాత్రం చాలా త‌క్కువ‌మందికి మాత్ర‌మే తెలుస్తుంది. గటగటా కూల్ డ్రింక్ లను తాగడం వరకే మనకు తెలుసు. కానీ వాటి వల్ల తర్వాత మన ఆరోగ్యం ఎలా తయారవుతుంది? అనేది మనకు తెలియదు. 



మన శరీరంలోకి పోయిన కూల్ డ్రింక్ ఏయే అవయవాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెల్సుకుందాం. అమెరికాలో సంవత్సరానికి ఒకరు తాగే కూల్ డ్రింక్ సరాసరి 251 లీటర్లంట! అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా?

కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాలకు: కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.



కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు: కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వు గా మారి బరువు పెరుగుతారు.

కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు: రక్తంలోకి షుగర్ ను పంపియడం కొనసాగుతుంది. కోల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్త పోటు పెరిగి, మీ కంటి పాపలు చిన్నగవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.

కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు: ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే.

కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు: గంట తరువాత, మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి.

ఎముకల సాంద్రత తగ్గుట: ఇందులో ప్రతిరోజూ కూల్ డ్రింక్ తాగే మహిళలలో ఎముకల సాంద్రత తగ్గిపోయిందట. 2005లో ఎముక ఖనిజ సాంద్రత (BMD ) పరీక్ష ను కూల్ డ్రింక్స్ తాగే 1413 మంది మహిళలపై, 1125 మంది మగవారిపై నిర్వహించి అమెరికా వారు ఈ విషయాన్ని దృవీకరించారు.

కాల్షియం తగ్గిపోవుట: కూల్ డ్రింక్ లో ఫాస్పరిక్ ఆసిడ్ ఉండటం వలన ఎముకలలో ఉండే కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది. దీని కారణంగా శరీరం ఏ పనిచేయడానికి సహకరించదు.

ఊబకాయం/బరువు పెరగడం: ప్రతిరోజూ కూల్ డ్రింక్ తీసుకోవడం వలన సంవత్సరానికి దాదాపు 6.5కేజీలు/14.5 పౌండ్ల బరువు పెరుగుతారు.

కాల్షియం తగ్గిపోవుట: కూల్ డ్రింక్ లో ఫాస్పరిక్ ఆసిడ్ ఉండటం వలన ఎముకలలో ఉండే కాల్షియం పూర్తిగా తగ్గిపోతుంది. దీని కారణంగా శరీరం ఏ పనిచేయడానికి సహకరించదు.

మధుమేహం: ఒక కూల్ డ్రింక్ లో ఉండే చక్కెర దాదాపు 10 టీ స్ఫూన్లతో సమానం.ఇది తాగడం వలన మధుమేహ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ శాతం ఉంది మరియు ఇన్సులెన్ నిరోధం కూడా కోల్పోతారు.

క్యాన్సర్ కు కారణం: కూల్ డ్రింక్ తీసుకోవడం వలన క్యాన్సర్ ను ప్రమాదకరంగా మారే అవకాశం ఎక్కువ. మధుమేహ వ్యాధితో పాటు దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది.

హృదయ సంబంధిత వ్యాధులు: చక్కెర శాతం మనం తీసుకుండే కూల్ డ్రింక్స్ వల్ల గుండె సంబంధిత వ్యాదులు చోటుచేసు కుంటాయి మరియు గుండెనొప్పికి దారితీస్తాయి.

కృత్రిమ చక్కెరలు: మనం తీసుకుంటున్న ఈ డ్రింక్స్ కారణంగా కృత్రిమ చక్కెర ఎక్కువగా శరీరంలోకి చేరి జీవక్రియ మరియు కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపుతుంది.

దంతాలపై ప్రభావం: వాటిలోని ఆసిడ్ కారణంగా దంతసమస్యలు వస్తాయి. అలాగే కొత్త బ్యాక్టీరియాలు నోటిలోకి చేరుతాయి. అందువలన నోటి దుర్వాసన మరియు దంత సమస్యలు కలుగుతాయి.

లివర్ కు ప్రమాదకరం: కూల్ డ్రింక్ లో శుక్రరసం మరియు మెర్కురీలను కలపడం వలన కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి, ముందుముందు కాలేయం పూర్తిగా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది.

నివేదిక వ‌చ్చాక షుగర్‌తో కూడిన డ్రింక్ లపై పన్ను విధించాలన్న ఒత్తిడి కూడా బ్రిటీష్ ప్రభుత్వంపై పెరిగింది. ఈ పరిశోధనల నేపథ్యంలో బ్రిటన్‌లోని శీతల పానీయాల ఉత్పత్తి సంస్థలు తమ డ్రింక్స్‌లో చక్కెర శాతాన్ని చాలావరకు తగ్గించే పనిలో పడ్డాయి.

కూల్ డ్రింక్ తాగడం పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.

No comments:

Post a Comment