Monday, July 25, 2016

ఎగ్ ని ఎలా తీసుకుంటే.. అందులోని పోషకాలు పొందవచ్చు ?


ఏ వయసు వాళ్లకైనా.. ఎగ్ అనేది హెల్తీ ఆప్షన్. బ్రెడ్ స్లైస్ లో ఎగ్ పెట్టుకుని తీసుకోవడం వల్ల.. శరీరానికి మంచిది. ఎగ్ ద్వారా ప్రొటీన్స్ కావాల్సిన మోతాదులో పొందవచ్చు. అయితే.. ప్రతి రోజూ ఎగ్స్ తినడానికి బోర్ గా పీలవుతుంటే.. డిఫరెంట్ గా, టేస్టీగా తీసుకోవచ్చు. దీనివల్ల ప్రొటీన్స్ అందుతాయి.. ఎగ్స్ ని డైలీ డైట్ లో చేర్చుకోవచ్చు. 


అయితే చాలామంది ఉడికించిన ఎగ్ ద్వారా మాత్రమే.. సరైన పోషకాలు పొందవచ్చని భావిస్తారు. కానీ.. ఎగ్ ని రకరకాల పద్ధతుల్లో తీసుకుంటూనే.. దాని ద్వారా పోషకాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఒకేరకంగా తీసుకోవడం కంటే.. విభిన్నంగా ఎగ్ ని తీసుకోండి. ఇప్పుడు ఎగ్ ని టేస్టీగా, హెల్తీగా తీసుకునే పద్ధతులు చూద్దాం..




స్క్రాంబుల్డ్ ఎగ్:
ఎగ్స్ పగల కొట్టి.. ఒక గిన్నెలో మిశ్రమాన్ని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కారం, పాలు కలిపి.. బాగా కలపాలి. ఇప్పుడు ఒక పాన్ పై వేయాలి. తర్వాత కొన్ని టమోటా ముక్కలు, మిర్చి ముక్కలు ఎగ్ మిశ్రమంపై చల్లుకుని.. బాగా కలపాలి. ఇలా తీసుకోవడం చాలా మంచిది.



ఎగ్ సాండ్విచ్:
బ్రెడ్ తో పాటు, ఎగ్స్ తీసుకోవడం వల్ల రెండింటి ద్వారా ప్రొటీన్స్ పొందవచ్చు. ఎగ్ ని ఆమ్లెట్ వేసుకుని.. బ్రెడ్ ని కాస్త వెన్నతో కాల్చి మధ్యలో పట్టుకుని తింటే.. హెల్తీగానూ, టేస్టీగానూ ఉంటుంది.



సలాడ్ రూపంలో :
రెండు ఎగ్స్ తీసుకుని డైరెక్ట్ గా పాన్ పై వేయాలి. అది ఫ్రై అయ్యాక.. దాన్ని ప్లేట్ లోకి తీసుకుని సలాడ్ ని పైన వేసుకుని తీసుకోవడం వల్ల సలాడ్ ద్వారా, ఎగ్ ద్వారా కావాల్సినన్ని పోషకాలు పొందవచ్చు.



ఫ్రెంచ్ టోస్ట్ :
2 పచ్చి కోడిగుడ్లను ఒక గ్లాసు పాలలో కలపాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో వోల్ గ్రెయిన్ బ్రెడ్ ని ముంచి.. పాన్ పై ఫ్రై చేసుకోవాలి. అంతే.. ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. దీనిద్వారా కూడా.. క్యాల్షియం, ప్రొటీన్స్ పొందవచ్చు.



ఆమ్లెట్స్ :
మీకు బాగా ఇష్టమైన వెజిటబుల్స్ ని తీసుకుని అంటే ఆనియన్, టమోటా, మిర్చి అన్నింటినీ.. ఎగ్ లో మిక్స్ చేసి.. ఆమ్లెట్ వేసుకుని తినవచ్చు.



ఎగ్ బుర్జీ :
దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఎగ్ ఫ్రై అంటారు. ఈ కూరను రైస్, చపాతీలతో తీసుకోవచ్చు.



ఉడికించిన ఎగ్ :
చాలా సింపుల్ అండ్ హెల్తీ పద్ధతి. ఎగ్ ని ఉడికించి.. కాస్త పెప్పర్ వేసుకుని తినడం వల్ల.. శరీరానికి కావాల్సిన పోషకాలు పొందవచ్చు.



ఓట్ మీల్ :
ఓట్ మీల్ హెల్త్ బెన్ఫిట్స్ కూడా పొందాలి అనుకుంటే.. చాలా సింపుల్ గా ఎగ్ తో పాటు తీసుకోవచ్చు. ఉడికించి కోడిగుడ్ల ముక్కలపై ఓట్ మీల్ ని ప్లేస్ చేసి.. తీసుకుంటే.. సరి.

No comments:

Post a Comment