Wednesday, July 27, 2016

ప్రముఖ ఆలయాల్లో... తప్పకుండా రుచి చూడాల్సిన మహా ప్రసాదాలు..!!

దేవుడికి నైవేద్యం పెట్టడం ద్వారా దేవుడిపై భక్తిని చాటుకుంటాం. దేవాలయాల్లో ప్రసాదం పంచడం ఆనవాయితీగా వస్తుంది. గుళ్లో దేవుడి ప్రసాదం తీసుకుంటే.. ఆ దేవుడి ఆశీస్సులు, వరం పొందవచ్చని ఒక నమ్మకం ఉంది. ప్రసాదాలను ఎంతమందికి పంచితే.. అంత పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. 

దేవుడికి కొబ్బరికాయ, పూలు ఎంత ముఖ్యమో.. నైవేద్యంగా ప్రసాదం సమర్పించడమూ అంతే ముఖ్యం. నైవేద్యంగా.. ఏదైనా సమర్పించవచ్చు. ఉన్నవాళ్లు పంచభక్ష పరమాన్నాలు సమర్పిస్తే.. లేనివాళ్లు బెల్లంతో దేవుడికి నైవేద్యం పెడతారు. ఏది పెట్టినా.. దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు. అయితే.. పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాలకు దేవుడి విగ్రహం, వాతావరణం ప్రత్యేకం 

అయితే.. కొన్ని ఆలయాల్లో ప్రసాదమే ప్రత్యేకం. ముఖ్యంగా.. తిరుమల అనగానే.. ఆ ఏడుకొండలవాడి లడ్డూకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. లడ్డూ ప్రసాదం ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుకే.. ఈ తిరుమల లడ్డూ అంతే అందరికీ ప్రీతికరం.

అయితే కొన్ని ఆలయాల్లో ప్రసాదం అంటే.. అరచేతిలో పెట్టేవే కాకుండా.. కడుపునిండా ప్రసాదం పెట్టే ఆలయాలు కూడా ఉన్నాయి. దేవుళ్లకు పెట్టే ప్రసాదాలు.. ఆయా ప్రదేశాలు, ప్రాంతాలు, ఆచారాలను బట్టి.. ఉంటాయి. మరో విషయం ఏంటంటే.. కొన్ని ఆలయాల్లో మాంసాహారాన్ని కూడా.. ప్రసాదాలుగా పెడతారు. ఇవాళ ఇండియాలోని ప్రత్యేక ఆలయాల్లో.. స్పెషల్ ప్రసాదాల లిస్ట్ చూద్దాం..




తిరుమల లడ్డు ప్రసాదం అనగానే ముందుగా తెలుగురాష్ట్రాల వాళ్లకు గుర్తొచ్చేది తిరుమల లడ్డు. నెయ్యితో తయారు చేసే..ఈ లడ్డూకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇందులో ప్రధానంగా వాడతారు. ఈ లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది.

లడ్డూతో పాటు తిరుమలలో లడ్డూ ప్రసాదంతోపాటు వడ, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, ఆపమ్, పాయసం, జిలేబీ, మురుకు, కేసరి, మల్హోరా ప్రసాదాలు కూడా చాలా ప్రత్యేకం.

పూరీ జగన్నాథ్ ఆలయ ప్రసాదం ప్రసాదాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒడిషాలోని పూరీ జగన్నాథ్ ఆలయ మహాప్రసాదం. ఇక్కడ పూరీ జగన్నాథుడికి 56 రకాల వంటకాలతో ప్రసాదాలు సమర్పిస్తారు.

రుచి, వాసన ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ప్రసాదాలను దేవుడికి సమర్పించక ముందు.. రుచి, వాసన ఉండదు. కానీ దేవుడికి నైవేద్యంగా సమర్పించగానే.. ప్రదానికి ఘుమఘుమల వాసన, రుచి వస్తాయి.

నాన్ వెజ్ ప్రసాదం పూరీ జగన్నాథ ఆలయంలోనే మాంసాహారం కూడా ప్రసాదంగా పెడతారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే జగన్నాథుడి భార్య విమలాదేవికి ప్రతిరోజూ దుర్గాపూజలు చేసి.. అమ్మవారికి బలి ఇచ్చిన మేక మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా పెడతారు. అలాగే గుడి కొలనులోని చేపలను కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీ.

గోల్డెన్ టెంపుల్ సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే అమృతసర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు రోజూ లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులకు గోల్డెన్ లెంపుల్‌లోని లంగాలర్‌లో కుల, మత రహితంగా ప్రసాదం వడ్డిస్తారు.

ప్రసాదం స్పెషాలిటీ లంగార్‌లోని సాంప్రదాయ వంటశాలలో రోజూ రెండు లక్షల చపాతీలు, ఒకటిన్నర టన్నుల పప్పు, వండి వడ్డిస్తారు. భక్తులకు ప్రసాదంగా పంచేందుకు 100 క్వింటాళ్ల గోధుమ పిండి, 25 క్వింటాళ్ల ధాన్యాలు, 10 క్వింటాళ్ల రైస్, 5000 లీటర్ల పాలు, 10 క్వింటాళ్ల చక్కెర, 5 క్వింటాళ్ల నెయ్యి ఉపయోగిస్తారు.

రాజస్థాన్ ఆలయం వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాజస్థాన్‌లో సల్సార్ బాలాజీ ఆలయంలో సావమణి ప్రసాదం చాలా ప్రత్యేకం. ఇక్కడున్న స్వయంభూ హనుమాన్ ఆలయంలో హనుమంతుడి విగ్రహం గుండ్రంగా ఉంటుంది. ఆంజనేయుడికి గడ్డాలు, మీసాలు కూడా ఉంటాయి.



ప్రసాదం ఈ మీసాల ఆంజనేయుడికి భక్తులు 50 కేజీలకు తగ్గకుండా నైవేద్యాన్ని సమర్పిస్తారు. నెయ్యి కలిపిన దాల్ భాటి, చుర్మా, బూందీ, దూద్ పేడా లడ్డూ ఈ ఆంజనేయుడికి సమర్పించే ప్రసాదం స్పెషాలిటీ.

వైష్ణోదేవి ఆలయం జమ్మూ సమీపంలో వైష్ణోదేవి ఆలయంలో పిండి రూపంలో అమ్మవారు ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ దేవాలయం ఎంత ఫేమసో ఇక్కడ పెట్టే ప్రసాదానికీ అంతే పేరుంది.

ప్రసాదం వైష్ణోదేవి అమ్మవారికి రాజ్‌మా, బియ్యంతో ఉడికించిన ప్రసాదం, కడీ చావల్, శెనగలు, పూరీ, ప్రసాదంగా పెడతారు. ఈ ప్రసాదాల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా వండుతారు. అలాగే డ్రైడ్ యాపిల్స్, ఎండుకొబ్బరి, వాల్ నట్స్ కూడా చాలా ఫేమస్.

జాగర్ కోవిల్ మధురైకి 20 కిలోమీటర్ల దూరంలో కల్లా జాగర్ ఆలయం ఉంది. దీన్నే అలాగర్ టెంపుల్ అని పిలుస్తారు. విష్ణుమార్తి కొలువై ఉన్న ఈ ఆలయంలో ప్రసాదం ఏంటో తెలుసా.. సాంబార్, దోశె.


No comments:

Post a Comment