Saturday, June 18, 2016

అవి వాడితే స్కిన్ అంత మృదువుగా అవుతుందా...

కాలాన్ని బట్టి, బుతువుల బ ట్టి వాతావరణంలో మార్పులు రావడం సహజం. అలాగే మనిషి శరీరంలో కూడా కాలాన్ని బట్టి, బుతువులను బట్టి మార్పలు సంబవిస్తాయి. ముఖం రంగు మారిపోయి అందవిహీనంగా తయారవుతుంది. మీ చర్మాన్ని ముట్టుకున్నప్పుడు బేబీ సాప్ట్ స్కిన్ ముట్టుకున్న ఫీలింగ్ పొందారా? ఖచ్చితంగా నో అనే చెబుతారు. అలాంటి బేబీ సాప్ట్, స్మూత్ స్కిన్ పొందాలను మీరుకోరుకుంటున్నారా. 

చర్మం ఆరోగ్యంగా లేనప్పుడు చర్మం నిర్జీవంగా కలర్ తక్కువ అవుతుంది. ఇలా తయారవ్వడానికి ఏజింగ్, హార్మోన్స్, వర్క్ స్ట్రెస్, పొల్యూషన్, మొదలగునవి కారణమవుతున్నాయి.



స్కిన్ డ్యామేజ్ కు కారణమేదైనా , చర్మాన్ని స్మూత్ గా మరియు సాప్ట్ గా మార్చడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. 

టర్మరిక్, పాలు, నిమ్మఫేస్ ప్యాక్ గ్రేట్ గా పనిచేస్తుంది. 
పసుపు: 2టీస్పూన్ 
పాలు: 2టేబుల్ స్పూన్స్ 
నిమ్మరసం: 2టీస్పూన్స్

స్కిన్ సాప్ట్ గా మార్చే గుణాలు పసుపు, పాలు, నిమ్మరసం పుష్కలంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం స్కిన్ సాప్ట్ గా మారుతుంది. 



పసుపు నేచురల్ స్కిన్ ఎక్సఫ్లోయేటింగ్ ఏజెంట్ . ఇది స్ర్కబ్బింగ్ గా గ్రేట్ గా సహాయపడుతుంది . డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది . బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది, వైట్ హెడ్స్ మరియు చర్మంలోని రఫ్ ప్యాచెస్ ను తొలగిస్తుంది. 

నిమ్మరసం అసిడిక్ నేచరల్ కలిగి ఉంటుంది, ఇది స్కిన్ కంప్లెక్షన్ నివారిస్తుంది . చర్మం మరింత ఫ్రెష్ గా మరియు రేడియంట్ గా కనబడేలా చేస్తుంది.



పాలు చర్మానికి తగిన తేమను, పోషణను అందిస్తుంది, స్కిన్ ఎలాసిటి పెంచుతుంది. దాంతో స్కిన్ ప్యాచెస్, పిగ్మెంటేషన్ నివారిస్తుంది. 

బౌల్లో మొదట సూచించిన పదార్థాలను వేసి మిక్స్ చేయాలి. మొత్తగా పేస్ట్ లా తయారుచేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మందంగా ప్యాక్ వేయాలి. ముఖానికి అప్లై చేసిన తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. 15నిముషాలు తర్వాత మన్నికైన ఫేస్ వాస్ ఉపయోగించి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Friday, June 17, 2016

2 డేస్ లో హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసే 3 నేచురల్ రెమెడీస్ ..!

హార్మోనుల అసమతుల్యత, కాలుష్య ప్రభావం, జుట్టు కోసం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. 

హెల్తీగా మరియు ఒత్తైన..పొడవైన జుట్టును పొందాలంటే మంచి పోషకాహారంను తీసుకోవాలి. పోషకాహారంతో ఎక్కువ న్యూట్రీషియన్స్ పొందడం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ స్ట్రాంగ్ గా మార్చుతాయి.


జుట్టు రాలే సమస్యతో , జుట్టు పల్చగా మరాడం వల్ల నచ్చిన హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చెయ్యలేరు. అనారోగ్యకరమైన హెయిర్ వల్ల, హెయిర్ ఫాల్ వల్ల హెయిర్ ను స్టైల్ గా మార్చుకోవాలనుకున్నా, అది మీకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు . 

ఈ మధ్యకాలంలో మీలో హెయిర్ ఫాల్ ఎక్కువగా కనబడుతున్నట్లైతే, మీ శరీరానికి అవసరమయ్యే పోషకాలను ఎక్కువగా అందివ్వాలి. వీటితో పాటు నేచురల్ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల ఎక్సటర్నల్ గా జుట్టును బలోపేతం చేస్తుంది. ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గిస్తుంది. అందుకు కావల్సినవి మరియు తయారీ ఏవిధంగానో తెలుసుకుందాం..



కావల్సినవి: 
కోకనట్ మిల్క్: 2టేబుల్ స్పూన్స్ 
మెంతులు: 1 టేబుల్స్ 
ఉసిరికాయ: 1 

కొబ్బరిపాలు, ఉసిరి మరియు మెంతులు హెయిర్ రూట్స్ ను స్ట్రాగ్ గా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి . హెయిర్ రూట్స్ ను చాలా ఎఫెక్టివ్ గా మరియు స్ట్రాంగ్ గా మార్చే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. 



కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు అద్భుతమైన హెయిర్ కాంపోనెంట్స్, ఈ రెండు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాదు జుట్టు రాలడం మరియు బట్టతలను నివారిస్తుంది.

మెంతులు మరియు ఉసిరికాయ, జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే హెయిర్ ఫోలిసెల్స్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దాంతో జుట్టు చిక్కగా మరియు బౌన్సీగా కనబడుతుంది. ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు కాంతివంతంగా మారుతుంది. 

హెయిర్ ప్యాక్ తయారుచేయు పద్దతి మరియు అప్లై చేయు విధానం: పైన సూచించిన పదార్థాలను బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తల మొత్తానికి పట్టించాలి . తలకు మాత్రమే కాదు కేశాల పొడవునా అప్లై చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ ను 15 నిముషాలు అలాగే వదిలేసి డ్రై అయిన తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

హెల్తీ అండ్ టేస్టీ పాలక్ చపాతీ

రైస్, దాల్ లేదా రోటీ? మీకు ఇష్టమైన వంట ఏంటి? ఎప్పుడూ ఒకే భోజనం తిని బోర్ కొడుతున్నదా. అలా బోరుకొట్టకుండా ఉండాలంటే కొన్ని ఒక కొత్త రుచిని చూడాల్సిందే. మైండ్ ను రిఫ్రెష్ చేయాల్సిందే..నాలుకకు కొత్త రుచి చూపించాల్సిందే . అలాంటి సింపుల్ రిసిపి టేస్టీ అండ్ హెల్తీ రిసిపి పాలక్ చపాతి.

పాలకూర, మరియు గోధుమ పిండి కాంభినేషన్ లో తయారుచేసే చపాతీ రిసిపి చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి . మరియు దీనికి పాలకూరను మిక్స్ చేసినప్పుడు రుచి పెరగడంతో పాటు శరీరానికి కూడా చాలా ఆరోగ్యం. మరి ఇంతటి ఆరోగ్యకరమైన ఒక హెల్తీ వంట పాలక్ చపాతీ మీకోసం పరిచయం చేస్తున్నాము.


దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

పాలకూర: 200grm
గోధుమపిండి: 2 cups
వెల్లుల్లి రెబ్బలు: 3-4
పచ్చిమిర్చి: 5-10
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా కొన్ని పాలకూరను శుభ్రంగా కడిగి , కొద్దిగా ఉప్పు చిలకరించి బాయిల్ చేయాలి. ఆకుకూర మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
2. 10 నిముషాల ఉడికించుకొన్న తర్వాత, మూత తీసి ఎక్సెస్ వాటర్ ను తొలగించాలి .ఆకు కూర చల్లగా మారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. పాలకూరతో పాటు అల్లం మరియు పచ్చిమిర్చి కూడా వేసి నీళ్లు పోయకుండా పేస్ట్ చేయాలి .
4. ఇప్పుడు బౌల్ తీసుకొని, గోధుమపిండి, ఉప్పు వేసి మిక్స్ చేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి.
5. తర్వాత పిండిలోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకొన్న ఆకుకూరను కూడా వేసి మొత్తం పిండిని చపాతిల పిండిలా కలుపోవాలి. నీరు సరిపోయంత మాత్రమే వేసి కలుపుకోవాలి.10నిముషాలు పక్కన పెట్టాలి.
6. 10 నిముషాల తర్వాత పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతీల్లా రోల్ చేసుకోవాలి.
7. ఇలా అన్ని చపాతీలను చేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి చపాతీలను ఒక్కొక్కటి వేసి రెండు వైపులా బాగా కాల్చాలి.అంతే పాలక్ చపాతీ రెడీ.
8. ఈ చపాతీలను సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకొని మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేయాలి.



Thursday, June 16, 2016

బ్లడ్ డొనేషన్ వల్ల కలిగే.. అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్..!

వాలంటరీ బ్లడ్ డొనేషన్ అనే పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అభిమాన నటుల బర్త్ డేలు ఉన్నాయంటే చాలు ఫ్యాన్స్ అంతా రక్తదానం ఇచ్చి.. వాళ్లపై అభిమానాన్ని ప్రకటిస్తారు. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే బ్లడ్ డొనేట్ చేయడానికి సోషల్ మీడియా ద్వారా సహాయపడుతున్నారు. 

బ్లడ్ డొనేషన్ పై ఇటీవల కాస్త అవగాహన పెరిగినప్పటికీ.. కొంతమందిలో ఇంకా అనుమానాలు ఉన్నాయి. బ్లడ్ ఇచ్చేయడం వల్ల మళ్లీ వాళ్ల శరీరంలో బ్లడ్ తగ్గిపోతుందని భావించే వాళ్లూ ఉన్నారు. అయితే ఇలాంటి అపోహ ఉన్నవాళ్లలో బ్లడ్ డొనేషన్ పై సరైన అవగాహన కల్పించాలి అంటే.. రక్తదానం వల్ల కలిగే హెల్త్ బెన్ఫిట్స్ తెలుసుకోవాలి.

10 ఏళ్లలో వాలంటరీ బ్లడ్ డొనేషన్ కి .. చాలా మంది వెళ్తున్నారు. అయినా కూడా కొన్ని ప్రమాదక పరిస్థితుల్లో బ్లడ్ దొరకని సందర్భాలు ఉన్నాయి. కేవలం బ్లడ్ డొనేట్ చేయడమే కాదు.. సేఫ్ పద్ధతిలో బ్లడ్ డొనేట్ చాలా అవసరం. దీనివల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు కలుగకుండా ఉంటుంది. ఒక యూనిట్ బ్లడ్ దానం చేసినా.. అనేక మంచి రోగులకు సహాయపడుతుంది. 


డైరెక్ట్ గా మొత్తం బ్లడ్ ని ఉపయోగించుకోవడమే కాకుండా.. రెడ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ ప్లేట్ లెట్స్, ప్లాస్మా ని వేరు చేసి.. కూడా అవసరానికి తగ్గట్టు వైద్యులు ఉపయోగించుకుంటున్నారు. ఇలా సెపరేట్ చేసి.. అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. కాబట్టి ఎంతో ప్రయోజనకరమైన రక్తదానం వల్ల రోగులను కాపాడటమే కాకుండా.. రక్తదానం చేసిన వాళ్లకు కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.



క్యాన్సర్ రక్త దానం చేసినప్పుడు శరీరంలో ఐరన్ లెవెల్స్ మెయింటెన్ చేయబడతాయి. శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గినప్పుడు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.



లివర్ డ్యామేజ్ రిస్క్ శరీరంలో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ రిస్క్ ఉంటుంది. బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండటం వల్ల.. అధికంగా ఉన్న ఐరన్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల లివర్ డ్యామేజ్ రిస్క్ తగ్గించుకోవచ్చు.



ఐరన్ లెవెల్స్ శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు అనీమియాకి దారితీస్తుంది. అలాగే ఎప్పుడైతే శరీరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు అవయవాలకు హాని కలుగుతుంది. రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అధికంగా ఉన్న ఐరన్ ని తగ్గించి, అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.


హార్ట్ ప్రాబ్లమ్స్ రక్తదానం చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ మెయింటెయిన్ చేసి.. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గించుకోవచ్చు. అలాగే హార్ట్ బీట్ కూడా సరిగ్గా ఉండటానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బరువు తగ్గడానికి, ఎక్స్ ట్రా క్యాలరీలు కరిగించడానికి సహాయపడుతుంది.


బ్లడ్ ఫ్లో పెరగడానికి తరచుగా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా సాగుతుంది. శరీరమంతటికీ రక్త సరఫరా సరిగ్గా అందుతుంది. దీనివల్ల బ్లాకేజ్, బ్లడ్ వెజెల్స్ డ్యామేజ్ నివారించవచ్చు.



న్యూ బ్లడ్ సెల్స్ రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొత్త బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు.

సైకలాజికల్ బెన్ఫిట్స్ రక్తదానం చేయడం వల్ల.. మానసికంగా మంచి ఫలితాలు పొందవచ్చు. అవసరమైన వాళ్లకు బ్లడ్ డొనేట్ చేశామన్న ఫీలింగ్ సంతోషాన్నిస్తుంది. దీనివల్ల ఒకరి జీవితాన్ని కాపాడిన వాళ్లు అవుతారు.

Wednesday, June 15, 2016

జొన్న రొట్టె -గుత్తి వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్

స్టఫ్ చేసే వంటలు ఏవైనా సరే అద్భుతమైన టేస్ట్ ఉంటాయి. చాలా మంది వంకాయలు తినడానికి ఇష్టపడరు. అయితే స్టఫ్డ్ బ్రిజాల్స్(గుత్తివంకాయను)తినడానికి మాత్రం ఎక్కువగా ఇష్టం. 

సాధారణంగా వంకాయతో చాలా రకాల వంటలను వండుతారు. అయితే గుత్తివంకా కూరంటే ప్రాణం లేచొస్తుంది. వంకాయలతో తయారు చేసి గుత్తివంకాయ మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది. గుత్తివంకాయ సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్. ఇల్లలో తరచూ చేస్తూనే ఉంటారు. అయితే గుత్తి వంకాయనే కొంచెం డిఫరెంట్ గా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. 

ఈ వంటలను చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. సింపుల్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గుత్తివంకాయ గ్రేవీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా ఉంటుంది. ఈగ్రేవీకి ఇండియన్ మసాలాలు జోడించి వండితే ఇంకొంచెం రుచిగా ఉంటుంది. గుత్తివంకాయ గ్రేవీకి బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టె. ఈ రెండింటి కాంబినేషన్ రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. జొన్న రొట్టెను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది మరియు బలాన్ని అందిస్తుంది. 


జొన్నల్లో మినిరల్స్ , ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇది అనీమియాను నివారిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. మరి ఈ టేస్టీ కాంబినేషన్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

జొన్న రొట్టికి కావల్సిన పదార్థాలు:  
జొన్న పిండి: 4కప్పులు 
ఉప్పు : కొద్దిగా వేడి నీళ్ళు 


కొన్ని తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి,కొద్దిగా ఉప్పు, జొన్నపిండి వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి . 
2. పిండి సాప్ట్ గా కలిపి 10-15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. 
3. 15 నిముషాల తర్వాత పిండి తీసుకొని అందులో నుండి కొద్దిగా తీసుకొని, చపాతీలకు తీసుకున్నత తీసుకొని, చపాతీల్లా ఒత్తుకోవాలి. 
4. పిండి సాప్ట్ గా ఉంటుంది కాబట్టి చేత్తోనే బాగా చపాతీల్లా వెడల్పుగా ఒత్తుకోవాలి .ఇలా అన్ని ఒకే సారి ఒత్తుకోవచ్చు , లేదా ఒక్కొక్కటీ ఒత్తుకుంటూ కాల్చవచ్చు. 
5. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, పాన్ వేడి చేయాలి. పాన్ వేడి అయ్యాక జొన్న రొట్టెను వేసి రెండు వైపులా చపాతీలాగా వేడి చేయాలి. లేదా కాల్చుకోవాలి. 


బ్రింజాల్ కర్రీకి కావల్సిన పదార్థాలు: 
బ్రింజాల్ - 6 (blue coloured) 
వేరుశెనగలు - 1 cup 
పచ్చిశెనగపప్పు - 1/2 cup 
కొబ్బరి - 1/2 cup 
బెల్లం - 2 teaspoons 
చింతపండు పేస్ట్ - 1 teaspoon 
జీలకర్ర - 1/2 teaspoon 
ఆవాలు - 1/2 teaspoon 
ఎండుమిర్చి - 5 to 6 
ఉల్లిపాయలు - 1 cup 
టమోటోలు - 1 cup 
కొత్తిమీరు: 1/2 cup 
పసుపు: 1/4th teaspoon 
నూనె: కొద్దిగా ఉప్పు 
తయారుచేయు విధానం: 
1. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, ఉల్లిపాయలు, టమోటో, వేరుశెనగలు, పచ్చిశెనగపప్పు, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, బెల్లం మరియు ఉప్పు వేసి , సరిపడా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 
2. ఇప్పుడు వంకాయలను తీసుకొని, వీటిని శుభ్రంగా కడిగి ఒక్కొక్క వంకాయను నాలుగు భాగాలుగా కట్ చేయాలి. కాడవైపు క్రింది భాగంలో కట్ చేయకుండా ముప్పావు బాగానికి మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మసాలను స్టఫ్ చేయడానికి సులభంగా ఉంటుంది . 
3. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకొన్న మసాలాను వంకాయల్లో స్టప్ చేయాలి. 
4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని, అందులో నూనె వేసి వేడి అయ్యాక, అందులో ఆవాలు, ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు మరియు కారం వేసి ఫ్రై చేసుకోవాలి . 
5. పోపు వేగిన తర్వాత అందులో స్టఫ్ చేసి పెట్టుకొన్న వంకాయలను కూడా వేసి నిధానంగా మసాలా పచ్చివాసన పోయే వరకూ పాన్ లో వంకాయలతో పాటు మసాలను వేగనివ్వాలి . 
6. వంకాయలు 5-10నిముషాలు వేగిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేసి మూత పెట్టి వంకాయలు మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. అంతే గుత్తి వంకాయ రెడీ. జొన్నరొట్టెకు బెస్ట్ కాంబినేసన్ గుత్తి వంకాయ కర్రీ. ఈ కాంబినేషన్ చాలా అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది.




Tuesday, June 14, 2016

తప్పడు ప్రమాణాలు చేస్తే వెంటనే శిక్షించే సిద్ది వినాయకుడు..

అడ్డంకులను, ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలు బాగుండాలని దీవించే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వ విఘ్నాలను నివారించే దేవుడు వినాయకుడు. హిందూ దేవుళ్ళలో ఎందరు దేవుళ్ళు ఉన్నా సరే మొదటి పూజలు మాత్రం ఆ గణనాధుడికే. పూర్వీకుల కాలం నుండి నేటివరకూ ప్రపంచదేశాలలో భక్తులచే విశేష పూజలందుకుంటూ కోరిన వరాలు తీర్చే బొజ్జ గణపయ్యగా ఆయన చాలా ఫేమస్. అయితే చిత్తూరు జిల్లాలోని స్వయంభు గణపతిగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయకుడి క్షేత్రానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 


వక్రతుండిగా, లంబోధరుడిగా, గజాననుడు, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ముద్దల తనయుడు, మన రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకంలో కొలువుదీరాడు. అయితే చిత్తూరు జిల్లాలోని స్వయంభు గణపతిగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయకుడి క్షేత్రానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది మరి ఆ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం..

కాణిపాక వరసిద్ది వినాయక స్ధలపురాణం: 



ప్రస్తుతం కాణిపాకంగా మనం అంతా పిలుస్తున్న ఆ ఊరు పూర్వ కాలంలో ‘విహారపురి'. ఈ గ్రామంలో ధర్మాచరణ పరాయుణులైన ముగ్గురు వికలాంగ సోదరులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పూర్వజన్మ కర్మఫలంగా వారు గుడ్డి, మూగ, చెవిటి వారిగా జన్మించారు. వారి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న భూమిని సాగు చేసుకొంటూ జీవనం సాగించేవారు.



ఈ క్రమంలో ఒక సారి ఆగ్రామం కరవుకాటకాలతో అల్లాడి పోయింది. పంటలపొలాలకు మాత్రమే కాదు, కనీసం గ్రామస్తులకు తాగడానికి నీరు సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరవును జయించడానికి ముగ్గురు సోదరులు తమ పొలంలోని బావిని లోతు చేయడానికి పూనుకొన్నారు. వీరు బావిని తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డు వచ్చింది. దీనిని తొలగించడానికి ప్రయత్నించారు.

ఈ ప్రయత్నంలో చేతిలోని గడ్డపార, గుణపాల సహాయంతో రాయినితొలగిస్తుండగా చేతిలోని పార పెద్ద బండ రాయికి తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మింది. ఈ రక్తం అంగవైకల్య సోదరులను తాకింది. దీంతో వీరికి ఉన్న అంగవైకల్యం తొలగిపోయాయి.



గ్రామాన్ని పాలిస్తున్న రాజుకు, ఆ ముగ్గురు వికలాంగ సోదరులు వివరించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న గ్రామస్థులు బావిని పూర్తిగా మరింత లోతుగా తవ్వి పరిశీలించారు. ఆ బావిలో ‘గణనాథుని' రూపం కనిపించింది. తెలియకు చేసిన తప్పుకు క్షమించమని ఆ ప్రజలు వేడుకున్నారు. స్వయంభుగా వెలసిన ఆ గణనాథుడికి గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి కొబ్బరి కాయలను సమర్పించారు.



కొబ్బరి కాయల సమర్పణతో ‘కాణి' భూమి(కాణి అంటే ఎకరం పొలం అని అర్థం, పాకరం అంటే నీరు ప్రవహించడం) పారింది. దీంతో ‘విహారపురి' గ్రామానికి ‘కాణిపారకరమ్‌' అన్న పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాస్తా ‘కాణిపాకం'గామారింది.

తనునమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ది,బుద్దులను ప్రసాదించే విఘ్ననాయకుడు శ్రీకాణిపాకం వినాయకుడు.కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది. స్వామివారు ఇక్కడ బావిలో స్వయంభూగా వెలిసాడు. ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతీ భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం అనవాయితిగా వస్తుంది.



ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైవున్న బావిలోనీరు భూభాగానికి సమానంగా ఉంటుంది. అదే నీటిని భక్తుల తీర్ధం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు.

ఈ భావిలో స్వామి వారి వాహనము ఎలుక వున్నది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్ధం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి..



స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది. 

వరసిద్ధుడు ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి కెక్కారు. స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే శిక్షిస్తారని ఇక్కడికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతే కాకుండా వ్యసనాలకు బానిసలైన వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని నమ్మకం. స్వామివారి ఎదుట సాధారణ ప్రమాణాలే కాకుండా రాజకీయ ప్రమాణాలు సైతం చేయడం విశేషం.

ఎందరో వ్యక్తిగత దురవ్యసనాల నుంచి విముక్తి పొందడానికి ఈ క్షెత్రం దారి చూపుతోంది. ఇక్కడ సప్రమాణం చేస్తే దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. తాగుడు, జూదం వివాహేతర సంబందాలు, దొంగతనాలు వంటి వ్యసనాలుకు గురైన వారిని కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకువచ్చి ప్రమాణం చేయిస్తుంటారు. మత తప్పితే అశుభం జరుగుతుందనే భయంతో చాలామంది ప్రమాణాలకు కట్టుబడి మంచిగా మారుతుంటారు.

వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం, 2002 సంవత్సరంలో భక్తులు విరాళంగా స్వామివారికి సమర్పించిన వెండి కవచం సైతం సరిపోవడం లేదు.

స్వామివారిని దర్శించుకునే భక్తులకు అర్చకులు నీటిని చేయి పెట్టి తోడి మారి చూపిస్తుంటారు. ఈ నిదర్శనలకు తోడూ స్వామివారు స్వయంభువు అని చెప్పడానికి మరిన్ని ఆధారాలు సజీవంగా కనిపిస్తున్నాయి.

దానితరువాత పలువురు భక్తులు కవచాలు చేయించారు. అవికూడా తర్వాత స్వామివారికి సరిపోవడంలేదు. ఇలా ఎప్పటికప్పుడు స్వామివారి మూలవిరాట్టు పెరుగుతూ పోతున్నందున ఆ కవచాలు ఇప్పుడు మూషిక మండపంలో భక్తుల ప్రదర్శనకు మాత్రమే వినియోగిస్తున్నారు.

Monday, June 13, 2016

ఈ సీజన్ లో చర్మం గురించి పట్టించుకోవాలి సుమా.!

వర్షాకాలం వచ్చేసింది. చిటపట చినుకుల్లో సరదాగా ఎంజాయ్ చేయాలని చాలామందికి ఉంటుంది. అలాగే హాట్ సమ్మర్ నుంచి చల్లటి అనుభూతిని ఆస్వాదించడానికి అందరూ ఇష్టపడతారు. అయితే.. చర్మ సమస్యలు కూడా వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఎదురవుతాయి. కాబట్టి.. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. 

వర్షాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారడం, యాక్నె, పింపుల్స్, ఇతర చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఎందుకంటే.. గాలిలో ఉండే దుమ్ము, ధూళిని చర్మానికి హానిచేస్తాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. వర్షాకాలాన్ని మీరు అనుకున్న విధంగా ఎంజాయ్ చేస్తూనే.. అందంగా మెరిసిపోవచ్చు. 

వర్షాకాలంలో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాం. ఈ చిట్కాలు కేవలం చర్మాన్ని సంరక్షించడమే కాకుండా.. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. కాస్మొటిక్స్ అవసరం లేకుండానే వర్షాకాలంలో మీరు మెరిసిపోవచ్చు.

రెండుసార్లు ఫేస్ వాష్ వర్షాకాలంలో చర్మం దుమ్ము, క్రిములు, కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది చర్మానికి చాలా హానికరం. కాబట్టి.. ముఖాన్ని ఖచ్చితంగా.. రెండు సార్లు శుభ్రం చేసుకోవడం వల్ల దుమ్ము తొలగిపోతుంది.


టోనర్ ఆల్కహాల్ ఫ్రీ టోనర్ ఉపయోగించడం వర్షాకాలంలో చాలా అవసరం. ముఖ్యంగా డ్రైన్ స్కిన్ ఉన్నవాళ్లు.. ఇంకా డ్రై కాకుండా ఉండాలంటే.. టోనర్ కంపల్సరీ వాడాలి. ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే.. యాస్ట్రిజెంట్ ఉపయోగించడం మంచిది.

వాటర్ ప్రూఫ్ మేకప్ వర్షాకాలంలో ఎక్కువ మేకప్ వేసుకుంటే.. ఏమీ బాగోదు. కానీ.. వాటర్ ప్రూఫ్ మేకప్ వాడితే.. ఎలాంటి నష్టం ఉండదు. అవి అయితే చెదిరిపోకుండా ఉంటాయి.

వారానికి ఒకసారి ఎక్స్ఫోలియేట్ డెడ్ స్కిన్ సెల్స్ నివారించడానికి..చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా అవసరం. అయితే వారానికి ఒకసారి కంపల్సరీ హోంమేడ్ స్క్రబ్ ఉపయోగించి.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవడం వల్ల.. చర్మం నిగారిస్తుంది.

సన్ స్క్రీన్ వాతావరణం చల్లగా, డార్క్ గా ఉన్నప్పుడు చాలామంది సన్ స్క్రీన్ లోషన్ వాడకుండా ఉంటారు. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే.. కొన్ని సెకన్ల పాటు సూర్య కిరణాలు పడినా.. చర్మానికి చాలా హానికరం. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా.. కొంచెం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి.


ఎక్కువ నీళ్లు తాగడం వర్షాకాలంలో చాలామంది వాతావరణం చల్లగా ఉండటం వల్ల నీళ్లు సరిగా తాగరు. కానీ.. వర్షాకాలంలో.. అయినా సరే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల... హైడ్రేట్ గా ఉంటారు. దీనివల్ల చర్మం ఫ్రెఫ్ గా, అందంగా కనిపిస్తుంది.