Monday, June 13, 2016

ఈ సీజన్ లో చర్మం గురించి పట్టించుకోవాలి సుమా.!

వర్షాకాలం వచ్చేసింది. చిటపట చినుకుల్లో సరదాగా ఎంజాయ్ చేయాలని చాలామందికి ఉంటుంది. అలాగే హాట్ సమ్మర్ నుంచి చల్లటి అనుభూతిని ఆస్వాదించడానికి అందరూ ఇష్టపడతారు. అయితే.. చర్మ సమస్యలు కూడా వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఎదురవుతాయి. కాబట్టి.. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. 

వర్షాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారడం, యాక్నె, పింపుల్స్, ఇతర చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. ఎందుకంటే.. గాలిలో ఉండే దుమ్ము, ధూళిని చర్మానికి హానిచేస్తాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. వర్షాకాలాన్ని మీరు అనుకున్న విధంగా ఎంజాయ్ చేస్తూనే.. అందంగా మెరిసిపోవచ్చు. 

వర్షాకాలంలో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతున్నాం. ఈ చిట్కాలు కేవలం చర్మాన్ని సంరక్షించడమే కాకుండా.. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. కాస్మొటిక్స్ అవసరం లేకుండానే వర్షాకాలంలో మీరు మెరిసిపోవచ్చు.

రెండుసార్లు ఫేస్ వాష్ వర్షాకాలంలో చర్మం దుమ్ము, క్రిములు, కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది చర్మానికి చాలా హానికరం. కాబట్టి.. ముఖాన్ని ఖచ్చితంగా.. రెండు సార్లు శుభ్రం చేసుకోవడం వల్ల దుమ్ము తొలగిపోతుంది.


టోనర్ ఆల్కహాల్ ఫ్రీ టోనర్ ఉపయోగించడం వర్షాకాలంలో చాలా అవసరం. ముఖ్యంగా డ్రైన్ స్కిన్ ఉన్నవాళ్లు.. ఇంకా డ్రై కాకుండా ఉండాలంటే.. టోనర్ కంపల్సరీ వాడాలి. ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే.. యాస్ట్రిజెంట్ ఉపయోగించడం మంచిది.

వాటర్ ప్రూఫ్ మేకప్ వర్షాకాలంలో ఎక్కువ మేకప్ వేసుకుంటే.. ఏమీ బాగోదు. కానీ.. వాటర్ ప్రూఫ్ మేకప్ వాడితే.. ఎలాంటి నష్టం ఉండదు. అవి అయితే చెదిరిపోకుండా ఉంటాయి.

వారానికి ఒకసారి ఎక్స్ఫోలియేట్ డెడ్ స్కిన్ సెల్స్ నివారించడానికి..చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా అవసరం. అయితే వారానికి ఒకసారి కంపల్సరీ హోంమేడ్ స్క్రబ్ ఉపయోగించి.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవడం వల్ల.. చర్మం నిగారిస్తుంది.

సన్ స్క్రీన్ వాతావరణం చల్లగా, డార్క్ గా ఉన్నప్పుడు చాలామంది సన్ స్క్రీన్ లోషన్ వాడకుండా ఉంటారు. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే.. కొన్ని సెకన్ల పాటు సూర్య కిరణాలు పడినా.. చర్మానికి చాలా హానికరం. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా.. కొంచెం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి.


ఎక్కువ నీళ్లు తాగడం వర్షాకాలంలో చాలామంది వాతావరణం చల్లగా ఉండటం వల్ల నీళ్లు సరిగా తాగరు. కానీ.. వర్షాకాలంలో.. అయినా సరే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల... హైడ్రేట్ గా ఉంటారు. దీనివల్ల చర్మం ఫ్రెఫ్ గా, అందంగా కనిపిస్తుంది.

No comments:

Post a Comment