Thursday, June 16, 2016

బ్లడ్ డొనేషన్ వల్ల కలిగే.. అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్..!

వాలంటరీ బ్లడ్ డొనేషన్ అనే పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అభిమాన నటుల బర్త్ డేలు ఉన్నాయంటే చాలు ఫ్యాన్స్ అంతా రక్తదానం ఇచ్చి.. వాళ్లపై అభిమానాన్ని ప్రకటిస్తారు. అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే బ్లడ్ డొనేట్ చేయడానికి సోషల్ మీడియా ద్వారా సహాయపడుతున్నారు. 

బ్లడ్ డొనేషన్ పై ఇటీవల కాస్త అవగాహన పెరిగినప్పటికీ.. కొంతమందిలో ఇంకా అనుమానాలు ఉన్నాయి. బ్లడ్ ఇచ్చేయడం వల్ల మళ్లీ వాళ్ల శరీరంలో బ్లడ్ తగ్గిపోతుందని భావించే వాళ్లూ ఉన్నారు. అయితే ఇలాంటి అపోహ ఉన్నవాళ్లలో బ్లడ్ డొనేషన్ పై సరైన అవగాహన కల్పించాలి అంటే.. రక్తదానం వల్ల కలిగే హెల్త్ బెన్ఫిట్స్ తెలుసుకోవాలి.

10 ఏళ్లలో వాలంటరీ బ్లడ్ డొనేషన్ కి .. చాలా మంది వెళ్తున్నారు. అయినా కూడా కొన్ని ప్రమాదక పరిస్థితుల్లో బ్లడ్ దొరకని సందర్భాలు ఉన్నాయి. కేవలం బ్లడ్ డొనేట్ చేయడమే కాదు.. సేఫ్ పద్ధతిలో బ్లడ్ డొనేట్ చాలా అవసరం. దీనివల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు కలుగకుండా ఉంటుంది. ఒక యూనిట్ బ్లడ్ దానం చేసినా.. అనేక మంచి రోగులకు సహాయపడుతుంది. 


డైరెక్ట్ గా మొత్తం బ్లడ్ ని ఉపయోగించుకోవడమే కాకుండా.. రెడ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ ప్లేట్ లెట్స్, ప్లాస్మా ని వేరు చేసి.. కూడా అవసరానికి తగ్గట్టు వైద్యులు ఉపయోగించుకుంటున్నారు. ఇలా సెపరేట్ చేసి.. అనేక రకాల వ్యాధులను నయం చేస్తున్నారు. కాబట్టి ఎంతో ప్రయోజనకరమైన రక్తదానం వల్ల రోగులను కాపాడటమే కాకుండా.. రక్తదానం చేసిన వాళ్లకు కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.



క్యాన్సర్ రక్త దానం చేసినప్పుడు శరీరంలో ఐరన్ లెవెల్స్ మెయింటెన్ చేయబడతాయి. శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గినప్పుడు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.



లివర్ డ్యామేజ్ రిస్క్ శరీరంలో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ రిస్క్ ఉంటుంది. బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండటం వల్ల.. అధికంగా ఉన్న ఐరన్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల లివర్ డ్యామేజ్ రిస్క్ తగ్గించుకోవచ్చు.



ఐరన్ లెవెల్స్ శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు అనీమియాకి దారితీస్తుంది. అలాగే ఎప్పుడైతే శరీరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు అవయవాలకు హాని కలుగుతుంది. రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అధికంగా ఉన్న ఐరన్ ని తగ్గించి, అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.


హార్ట్ ప్రాబ్లమ్స్ రక్తదానం చేయడం వల్ల ఐరన్ లెవెల్స్ మెయింటెయిన్ చేసి.. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గించుకోవచ్చు. అలాగే హార్ట్ బీట్ కూడా సరిగ్గా ఉండటానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బరువు తగ్గడానికి, ఎక్స్ ట్రా క్యాలరీలు కరిగించడానికి సహాయపడుతుంది.


బ్లడ్ ఫ్లో పెరగడానికి తరచుగా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా సాగుతుంది. శరీరమంతటికీ రక్త సరఫరా సరిగ్గా అందుతుంది. దీనివల్ల బ్లాకేజ్, బ్లడ్ వెజెల్స్ డ్యామేజ్ నివారించవచ్చు.



న్యూ బ్లడ్ సెల్స్ రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొత్త బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చు.

సైకలాజికల్ బెన్ఫిట్స్ రక్తదానం చేయడం వల్ల.. మానసికంగా మంచి ఫలితాలు పొందవచ్చు. అవసరమైన వాళ్లకు బ్లడ్ డొనేట్ చేశామన్న ఫీలింగ్ సంతోషాన్నిస్తుంది. దీనివల్ల ఒకరి జీవితాన్ని కాపాడిన వాళ్లు అవుతారు.

No comments:

Post a Comment