Friday, June 17, 2016

2 డేస్ లో హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసే 3 నేచురల్ రెమెడీస్ ..!

హార్మోనుల అసమతుల్యత, కాలుష్య ప్రభావం, జుట్టు కోసం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. 

హెల్తీగా మరియు ఒత్తైన..పొడవైన జుట్టును పొందాలంటే మంచి పోషకాహారంను తీసుకోవాలి. పోషకాహారంతో ఎక్కువ న్యూట్రీషియన్స్ పొందడం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ స్ట్రాంగ్ గా మార్చుతాయి.


జుట్టు రాలే సమస్యతో , జుట్టు పల్చగా మరాడం వల్ల నచ్చిన హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చెయ్యలేరు. అనారోగ్యకరమైన హెయిర్ వల్ల, హెయిర్ ఫాల్ వల్ల హెయిర్ ను స్టైల్ గా మార్చుకోవాలనుకున్నా, అది మీకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు . 

ఈ మధ్యకాలంలో మీలో హెయిర్ ఫాల్ ఎక్కువగా కనబడుతున్నట్లైతే, మీ శరీరానికి అవసరమయ్యే పోషకాలను ఎక్కువగా అందివ్వాలి. వీటితో పాటు నేచురల్ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల ఎక్సటర్నల్ గా జుట్టును బలోపేతం చేస్తుంది. ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గిస్తుంది. అందుకు కావల్సినవి మరియు తయారీ ఏవిధంగానో తెలుసుకుందాం..



కావల్సినవి: 
కోకనట్ మిల్క్: 2టేబుల్ స్పూన్స్ 
మెంతులు: 1 టేబుల్స్ 
ఉసిరికాయ: 1 

కొబ్బరిపాలు, ఉసిరి మరియు మెంతులు హెయిర్ రూట్స్ ను స్ట్రాగ్ గా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి . హెయిర్ రూట్స్ ను చాలా ఎఫెక్టివ్ గా మరియు స్ట్రాంగ్ గా మార్చే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. 



కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు అద్భుతమైన హెయిర్ కాంపోనెంట్స్, ఈ రెండు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాదు జుట్టు రాలడం మరియు బట్టతలను నివారిస్తుంది.

మెంతులు మరియు ఉసిరికాయ, జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే హెయిర్ ఫోలిసెల్స్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దాంతో జుట్టు చిక్కగా మరియు బౌన్సీగా కనబడుతుంది. ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు కాంతివంతంగా మారుతుంది. 

హెయిర్ ప్యాక్ తయారుచేయు పద్దతి మరియు అప్లై చేయు విధానం: పైన సూచించిన పదార్థాలను బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తల మొత్తానికి పట్టించాలి . తలకు మాత్రమే కాదు కేశాల పొడవునా అప్లై చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ ను 15 నిముషాలు అలాగే వదిలేసి డ్రై అయిన తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

No comments:

Post a Comment