స్టఫ్ చేసే వంటలు ఏవైనా సరే అద్భుతమైన టేస్ట్ ఉంటాయి. చాలా మంది వంకాయలు తినడానికి ఇష్టపడరు. అయితే స్టఫ్డ్ బ్రిజాల్స్(గుత్తివంకాయను)తినడానికి మాత్రం ఎక్కువగా ఇష్టం.
సాధారణంగా వంకాయతో చాలా రకాల వంటలను వండుతారు. అయితే గుత్తివంకా కూరంటే ప్రాణం లేచొస్తుంది. వంకాయలతో తయారు చేసి గుత్తివంకాయ మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది. గుత్తివంకాయ సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్. ఇల్లలో తరచూ చేస్తూనే ఉంటారు. అయితే గుత్తి వంకాయనే కొంచెం డిఫరెంట్ గా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
ఈ వంటలను చాలా సింపుల్ గా తయారుచేయవచ్చు. సింపుల్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గుత్తివంకాయ గ్రేవీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడేలా ఉంటుంది. ఈగ్రేవీకి ఇండియన్ మసాలాలు జోడించి వండితే ఇంకొంచెం రుచిగా ఉంటుంది. గుత్తివంకాయ గ్రేవీకి బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టె. ఈ రెండింటి కాంబినేషన్ రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. జొన్న రొట్టెను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది మరియు బలాన్ని అందిస్తుంది.
జొన్నల్లో మినిరల్స్ , ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇది అనీమియాను నివారిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. మరి ఈ టేస్టీ కాంబినేషన్ ఎలా తయారుచేయాలో చూద్దాం...
జొన్న రొట్టికి కావల్సిన పదార్థాలు:
జొన్న పిండి: 4కప్పులు
ఉప్పు : కొద్దిగా వేడి నీళ్ళు
కొన్ని తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి,కొద్దిగా ఉప్పు, జొన్నపిండి వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి .
2. పిండి సాప్ట్ గా కలిపి 10-15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. 15 నిముషాల తర్వాత పిండి తీసుకొని అందులో నుండి కొద్దిగా తీసుకొని, చపాతీలకు తీసుకున్నత తీసుకొని, చపాతీల్లా ఒత్తుకోవాలి.
4. పిండి సాప్ట్ గా ఉంటుంది కాబట్టి చేత్తోనే బాగా చపాతీల్లా వెడల్పుగా ఒత్తుకోవాలి .ఇలా అన్ని ఒకే సారి ఒత్తుకోవచ్చు , లేదా ఒక్కొక్కటీ ఒత్తుకుంటూ కాల్చవచ్చు.
5. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, పాన్ వేడి చేయాలి. పాన్ వేడి అయ్యాక జొన్న రొట్టెను వేసి రెండు వైపులా చపాతీలాగా వేడి చేయాలి. లేదా కాల్చుకోవాలి.
బ్రింజాల్ కర్రీకి కావల్సిన పదార్థాలు:
బ్రింజాల్ - 6 (blue coloured)
వేరుశెనగలు - 1 cup
పచ్చిశెనగపప్పు - 1/2 cup
కొబ్బరి - 1/2 cup
బెల్లం - 2 teaspoons
చింతపండు పేస్ట్ - 1 teaspoon
జీలకర్ర - 1/2 teaspoon
ఆవాలు - 1/2 teaspoon
ఎండుమిర్చి - 5 to 6
ఉల్లిపాయలు - 1 cup
టమోటోలు - 1 cup
కొత్తిమీరు: 1/2 cup
పసుపు: 1/4th teaspoon
నూనె: కొద్దిగా ఉప్పు
తయారుచేయు విధానం:
1. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, ఉల్లిపాయలు, టమోటో, వేరుశెనగలు, పచ్చిశెనగపప్పు, కొత్తిమీర, జీలకర్ర, చింతపండు, బెల్లం మరియు ఉప్పు వేసి , సరిపడా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు వంకాయలను తీసుకొని, వీటిని శుభ్రంగా కడిగి ఒక్కొక్క వంకాయను నాలుగు భాగాలుగా కట్ చేయాలి. కాడవైపు క్రింది భాగంలో కట్ చేయకుండా ముప్పావు బాగానికి మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మసాలను స్టఫ్ చేయడానికి సులభంగా ఉంటుంది .
3. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకొన్న మసాలాను వంకాయల్లో స్టప్ చేయాలి.
4. ఇప్పుడు మరో పాన్ తీసుకొని, అందులో నూనె వేసి వేడి అయ్యాక, అందులో ఆవాలు, ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు మరియు కారం వేసి ఫ్రై చేసుకోవాలి .
5. పోపు వేగిన తర్వాత అందులో స్టఫ్ చేసి పెట్టుకొన్న వంకాయలను కూడా వేసి నిధానంగా మసాలా పచ్చివాసన పోయే వరకూ పాన్ లో వంకాయలతో పాటు మసాలను వేగనివ్వాలి .
6. వంకాయలు 5-10నిముషాలు వేగిన తర్వాత అందులో సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేసి మూత పెట్టి వంకాయలు మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. అంతే గుత్తి వంకాయ రెడీ. జొన్నరొట్టెకు బెస్ట్ కాంబినేసన్ గుత్తి వంకాయ కర్రీ. ఈ కాంబినేషన్ చాలా అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది.
No comments:
Post a Comment