Thursday, March 17, 2016

సపోటాలో దాగున్న మనకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలు

సపోటా రుచికరమైన హెల్తీ ఫ్రూట్ . అంతే కాదు ఇందులో న్యూట్రీషియనల్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి .ఇది మామిడిపండ్లు, అరటిపండ్లు, మరియ జాక్ ఫ్రూట్ వంటి కోవలోకి వస్తాయి . ఇవన్నీ తక్కువ క్యాలరీలను అందిస్తాయి. ఇది ఒక మంచి ఉత్తమమైన ఫ్రూట్ . ఇది తక్షణ శక్తిని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

 ఈ పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ లు ఎనర్జీ బూస్టర్స్ గా పనిచేస్తాయి . సపోటా పండ్లలో అనేక న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . మరియు యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, ఎ, మరియు సిలు కూడా పుష్కలంగా ఉన్నాయి . మరియు ఇది కాపర్ కు మంచి మూలం వంటిది. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఇంకా ఫైూబర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇది ల్యాక్సేటివ్. సపోటాలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని మరియు మ్యూకోస ను కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది . అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ లంగ్ మరియు ఓరల్ క్యావీటి క్యాన్సర్ ప్రమాధాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. సపోటాలో ఉండే టానిన్ కంటెంట్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ , యాంటీ పారాసిటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. అంతే కాదు, వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి మరి అవేంటో తెలుసుకుందాం...

కళ్ళు ఆరోగ్యంగా ఉంచుతుంది: సపోటాపండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది . ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది: సపోటాలో ఉండే ఫైబర్ మలబద్దకం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే డైటరీ ఫైబర్ క్రోనిక్ మలబద్దకాన్నినివారిస్తుంది .

ఇన్ఫ్లమేషన్ దూరం చేస్తుంది: సపోటాపండ్లలో ఉండే టానిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కండరాల సలుపులు, నొప్పులను నివారించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ గా సపోటాలు గ్రేట్ గా సహాయపడుతాయి . ఇది శరీరంలోని వాపు మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది: ఈ పండు కిడ్నీ స్టోన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ తొలగిపోవతాయి. ముఖ్యంగా సపోటా పండులోని విత్తనాలను పొడి చేసి, గ్లాసు నీటిలో వేసి త్రాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ నివారించబడుతాయి . సపోటాలో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు కిడ్నీలోని స్టోన్స్ ను నివారిస్తుంది.

బోన్స్ స్ట్రాంగ్ గాఉంచుతుంది: సపోటాలో ఉండే క్యాల్షియం మరియు ఇతర మినిరల్స్ ఫాస్పరస్, మరియు ఐరన్ వంటివి బోన్స్ ను స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంచుతాయి . సపోటాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బోన్ ఎలిమెంట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . ఇది బోన్ హెల్త్ మరియు క్వాలిటీని మెరుగుపరుస్తాయి.

No comments:

Post a Comment