Friday, March 18, 2016

వాటర్ మెలోన్ మరియు స్ట్రాబెర్రీ స్మూతీ

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కంటే...ఏ ఎండకు ఆ షేక్స్ తాగడం బెటర్. షేక్స్‌తో ఎండలకు షాకివ్వవచ్చు. సమ్మర్‌ని షేక్ చేయవచ్చు. మిల్క్ షేక్‌లు..స్మూతీలు ..కడుపును చల్లగా ఉంచుతాయి. ఒంటికీ చలవ చేస్తాయి. పాలూ పండ్లతో ఒక షేక్. చాకో కోకోలతో ఇంకో షేక్. ఐస్ క్రీములతో మరో షేక్..షేక్. ఎండల్ని రుచికరంగా చల్లబరుచుకోండి. ఈ సమ్మర్‌ను వశపరుచుకోండి. ఇక అప్పుడే మార్కెట్లో వాటర్ మెలోన్, స్ట్రాబెర్రీలు దర్శనమిస్తుననాయి. పిల్లలు అలాగే తినమంటే తినరు. ఎలా అనుకుంటూ పాల..ఐస్ క్రీమ్ తో స్మూతీ చేసిఇవ్వొచ్చు. పాలు, పళ్లు రెండు ఒకేసారి పిల్లలకు, పెద్దలకు కూడా ఇలా ఇవ్వొచ్చన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం..మరియు ఇష్టంగాను తాగేస్తారు..మరీ మీరు తయారు చేయండి ఈ సింపుల్ అండ్ టేస్ట్ వాటర్ మెలోన్ -స్ట్రాబెర్రీ స్మూతీని..



కావల్సిన పదార్థాలు:
స్ట్రాబెర్రీస్ - 1 cup
వాటర్ మెలోన్ - 2 cup
యాలకలు - 2 to 3
పెప్పర్ - చిటికెడు
షుగర్ - 1/2 cup
ఐస్ - 1/2 cup
తయారుచేయు విధానం:
1. ముందుగా వాటర్ మెలోన్ మరియు స్ట్రాబెర్రీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిలో విత్తనాలు తొలగించాలి.
2. తర్వాత ఈ ఫ్రూట్ ముక్కలను మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు వాటర్ వేసి గ్రైండ్ చేయాలి.
3. తర్వాత ఈ స్మూతీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొద్దిసేపు బయట అలాగే ఉంచాలి.
4. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఈ స్మూతిని మిక్సీ జార్లో వేసి , స్మూతీతో పాటు, ఐస్ క్యూబ్స్, యాలకలు, మరియు పంచదార వేసి మరో సారి గ్రైండ్ చేయాలి.
5. తర్వాత ఈ స్మూతీని సర్వింగ్ గ్లాసులోకి మార్చుకొని చిటికెడు పెప్పర్ పౌడర్ ను చిలకరించి, కూల్ కూల్ గా ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కు సర్వ్ చేయడమే ఆలస్యం.

No comments:

Post a Comment