ఎర్ర రక్తకణాలు
శరీర రక్తంలో ఉండే కణాల రకాలలో ఎర్ర రక్తకణాలు కూడా ఒక రకం. ఇవి శరీర కణాలకు కావాల్సిన ఆక్సిజన్ ను సరఫరా చేస్తాయి. వీటి సంఖ్యను కొన్ని ఆహార పదార్థాలను తినటం ద్వారా పెంచుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలు ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచటమేకాకుండా, పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
హోల్ గ్రైన్స్
రక్తకణాల సంఖ్య రెట్టింపు అవటానికి అవసరమైన ముఖ్య పోషకం- కాపర్. మన శరీరానికి ఎంత స్థాయిలో కాపర్ కావాలో అంతమేరకు హోల్ గ్రైన్స్ నుండి పొందవచ్చు. నత్తగుల్లలు (షెల్ ఫిష్), పౌల్ట్రీ, బీన్స్, చెర్రీలు, చాక్లెట్ మరియు నట్స్ వంటి వాటిలో కూడా కాపర్ అధిక స్థాయిలో ఉంటుంది.
నట్స్ (గింజలు)
ఐరన్ ను అధిక మొత్తంలో కలిగి ఉండే ఆహార పదార్థాలను తినటం వలన శరీరం కోల్పోయిన ఐరన్ ను భర్తీ చేయవచ్చు. ఒక పిడికెడు నట్స్ (గింజలు) నుండి శరీరానికి సరిపోయేంత ఐరన్ పొందవచ్చు. అంతేకాకుండా, వీటితో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
బలవర్థకమైన ధాన్యాలు
ఎర్రరక్తకణాలు ఉత్పత్తి చెందుటకు మానవ శరీరానికి విటమిన్ 'B12' అవసరం. బలవర్థకమైన ధాన్యాలు ఈ హార్మోన్ ను పుష్కలంగా కలిగి ఉంటాయి. సాధారణంగా శాఖాహారులు విటమిన్ 'B12' లోపంతో భాదపడుతుంటారు. కావున ఎర్ర రక్త కణాల పెంచుకోటానికి వీటిని మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి.
స్ట్రాబెరీ
"మార్చె పాలిటెక్నిక్ యూనివర్సిటీ" (ఇటలీలో ఉన్న, UNIVPM) మరియు "యూనివర్సిటీ గ్రెనడా" వారు పరిశోధనలు జరిపి, ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయటానికి స్ట్రాబెరీ ఉపయోగపడుతుందని తెలిపారు. స్ట్రాబెరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారకాలు, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయని తెలిపారు.
పచ్చని ఆకూకూరలు
ఎర్ర రక్తకణాల సంఖ్య అధికమవటానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలైనట్టి, 'ఫోలిక్ ఆసిడ్' మరియు 'విటమిన్ 'B6' పచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటాయి. కావున స్పీనాచ్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు పాలకూర వంటి వాటిని మీరు పాటించే ఆహార ప్రణాళికలలో తప్పక కలుపుకోండి.
పండ్లు
ఎర్రరక్తకణాల సంఖ్యను తక్కువగా కలిగి ఉన్నవారు పండ్లను ఎక్కువగా తినమని వైద్యులు మరియు నిపుణులు సలహా ఇస్తుంటారు. ఆప్రికాట్, ఆపిల్, ద్రాక్ష పండ్లు, ఎండుద్రాక్షలు ఎర్ర రక్తకణాల సంఖ్యను రెట్టింపు చేయటమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
హోల్ గ్రైన్స్
నట్స్ (గింజలు)
బలవర్థకమైన ధాన్యాలు
ఎర్రరక్తకణాలు ఉత్పత్తి చెందుటకు మానవ శరీరానికి విటమిన్ 'B12' అవసరం. బలవర్థకమైన ధాన్యాలు ఈ హార్మోన్ ను పుష్కలంగా కలిగి ఉంటాయి. సాధారణంగా శాఖాహారులు విటమిన్ 'B12' లోపంతో భాదపడుతుంటారు. కావున ఎర్ర రక్త కణాల పెంచుకోటానికి వీటిని మీరు పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోండి.
స్ట్రాబెరీ
పచ్చని ఆకూకూరలు
పండ్లు
No comments:
Post a Comment