Thursday, July 14, 2016

రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్..!!

గ్రీన్ టీ తాగడం వల్ల పొందే ప్రయోజనాలు చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. పంచదార, పాలు కలపకుండా గ్రీన్ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని, అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది, అలాగే.. అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే గ్రీన్ టీ చర్మం, జుట్టుకి చాలా మంచిది. అయితే చాలామంది ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. కనీసం రాత్రి పడుకోవడానికి ముందు.. గ్రీన్ టీ తాగడం మొదలుపెడితే.. లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.



రిలాక్స్ గా ఉంచడానికి రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగడం వల్ల.. ఈ టీలో ఉండే కెఫీన్ బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుంది. ఎమినో యాసిడ్స్, ఎల్ థియానిన్ ఆందోళన నుంచి ఉపశమనం కలిగగించి.. రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది.



కామన్ కోల్డ్ క్రిముల నాశనానికి కెటాచిన్ అనేది చాలా పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. దీన్ని గ్రీన్ టీ ద్వారా తేలికగా పొందవచ్చు. ఒకవేళ మీరు కామన్ కోల్డ్, ఫ్లూ నుంచి బాధపడుతుంటే.. ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోండి. ఇది క్రిములను, బ్యాక్టీరియాను నాశనం చేయడంలో గ్రేట్ మెడిసిన్ గా పనిచేస్తుంది.



మెటబాలిజం మెరుగుపరచడానికి నిద్రలో ఎలాంటి భంగం ఏర్పడకుండా హ్యాపీగా నిద్రపోవాలంటే.. మెటబాలిజం మెరుగుపడాలి. హెల్తీ మెటబాలిజం కోసం.. ఫిట్ బాడీ, గ్లోయింగ్ స్కిన్ పొందడం. రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగడం వల్ల.. మెటబాలిజం ట్రాక్ లో ఉంటుంది.

ఫ్లూ రిస్క్ తగ్గిస్తుంది రాత్రి పడుకోవడానికి ముందు గ్రీన్ టీ తాగడం వల్ల.. సీజనల్ గా వచ్చే ఇన్ఫెక్షన్స్, ఫ్లూ రిస్క్ ని తగ్గించవచ్చు. వైరల్ ఫీవర్ రాకుండా అడ్డుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే ఫోలిఫెనాల్ వైరల్ ఎటాక్ ని అరికడుతుంది.

బాడీ నుంచి మలినాలు తొలగించడానికి రాత్రిపూట గ్రీన్ టీ తాగడం వల్ల బోవెల్ మూమెంట్స్ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. ఉదయం శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. అనేక రకాల వ్యాధులకు కారణమయ్యే టాక్సిన్స్ ని గ్రీన్ టీ తాగడం వల్ల తేలికగా తొలగించుకోవచ్చు.

స్మార్ట్ గా చేస్తుంది రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగడం వల్ల.. బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం ఇవాళే మొదలుపెట్టండి.

క్యాన్సర్ రిస్క్ ఫ్రీ రాడికల్స్ గ్రోత్ కి వ్యతిరేకంగా పోరాడటంలో గ్రీన్ టీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలెరెక్టల్ క్యాన్సర్ రిస్క్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి.. ప్రతి రోజూ రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ తాగితే.. క్యాన్సర్ మీ దరిచేరకుండా ఉంటుంది.

No comments:

Post a Comment