Friday, July 15, 2016

అమేజింగ్ స్కిన్ పొందాలంటే రాత్రిపూట త‌ప్ప‌కుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్

రోజంతా బిజీ బిజీగా గ‌డ‌ప‌డం.. అల‌స‌ట‌, వ‌ర్క్ ప్రెజ‌ర్ కార‌ణంగా.. ఇంటికి వ‌చ్చేస‌రికి చ‌ర్మ సంర‌క్ష‌ణ‌పై జాగ్ర‌త్త వ‌హించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తారు. వ‌ర్క్ చేసేవాళ్లు, వాళ్ల పిల్ల‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లోప‌డి.. బిజీ షెడ్యూల్ లో త‌మ గురించి ప‌ట్టించుకోరు. దీనివ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు పెరుగుతాయి.

చాలా సంద‌ర్భాల్లో గ్లోయింగ్ స్కిన్, లాంగ్ హెయిర్ ఉన్న‌ప్ప‌టికీ.. స‌మ‌యం లేక‌పోవ‌డం వ‌ల్ల, స‌రైన శ్ర‌ద్ద తీసుకోక‌పోవ‌డం, ఒత్తిడి, ఎక్కువ స‌మ‌యం కంప్యూట‌ర్ ముందు గ‌డ‌ప‌టం, దుమ్ము, ధూళి, కాలుష్యం వంటి కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం, జుట్టు నిర్జీవంగా, డ‌ల్ గా మారుతుంది. ఉన్న మంచి జుట్టు, చ‌ర్మాన్ని కోల్పోవ‌డం మొద‌ల‌వుతుంది.

చాలామంది జుట్టు, చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం కొన్ని టిప్స్ ని ఉద‌యం పాటిస్తారు. కానీ కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను రాత్రి నిద్ర‌కు ముందు పాటించ‌డం చాలా అవ‌స‌రం. రెగ్యుల‌ర్ చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం.. రాత్రిపూట కొన్ని టిప్స్ ఫాలో అయితే.. ఎఫెక్టివ్ గా ప‌నిచేస్తాయి.

ముఖం శుభ్రం చేసుకోవ‌డం కొన్ని గంట‌ల ముందు ముఖాన్ని శుభ్రం చేసుకున్నా.. రాత్రిప‌డుకోవ‌డానికి ముందు మ‌ళ్లీ శుభ్రం చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. దీనివ‌ల్ల పింపుల్స్ రాకుండా అరిక‌ట్ట‌వ‌చ్చు.

మేక‌ప్ తీసేయ‌డం రాత్రి పడుకోవ‌డానికి ముందు మేక‌ప్ తొల‌గించ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే.. మేక‌ప్ కోసం ఉప‌యోగించే ప్రొడ‌క్ట్స్ లో ఉండే కెమిక‌ల్స్, గ్రీజ్ మొటిమ‌లు, యాక్నెకి కార‌ణ‌మ‌వుతాయి.

ఎక్స్ ఫోలియేట్ మైల్డ్ స్క్ర‌బ్ ఉప‌యోగించి చ‌ర్మాన్ని రాత్రి పూట ఎక్స్ ఫోలియేట్ చేయాలి. దీనివ‌ల్ల దుమ్ము, డెట్ స్కిన్ సెల్స్ చ‌ర్మం నుంచి రాత్రిపూట తొల‌గించాలి.

అండ‌ర్ ఐ క్రీమ్ రాత్రిపూట క‌ళ్ల కింద క్రీమ్ అప్లై చేసి కొన్ని నిమిషాల‌పాటు మ‌సాజ్ చేయాలి. దీనివ‌ల్ల డార్క్ స‌ర్కిల్స్, ఏజ్ లైన్స్ నివారించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

చేతులు, పాదాల సంర‌క్ష‌ణ‌ విట‌మిన్ ఏ లేదా విట‌మిన్ సి ఉన్న క్రీమ్ లేదా మాయిశ్చ‌రైజ‌ర్ ని పాదాలు, చేతుల సంర‌క్ష‌ణ‌కు ఉప‌యోగించ‌డం వ‌ల్ల‌.. ఏజ్ స్పాట్స్, ప‌గిలిన పాదాల‌ను నివారించ‌వ‌చ్చు. అలాగే కాళ్లు, చేతుల చ‌ర్మం డ్యామేజ్ అవ‌కుండా నివారించ‌వ‌చ్చు.

ముఖానికి మాయిశ్చ‌రైజ‌ర్ మాయిశ్చ‌రైజ‌ర్ ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల కొల్లాజెన్ ప్రొడ‌క్ష‌న్ ని పెంచుతుంది. రాత్రిపూట మాయిశ్చ‌రైజ‌ర్ రాస్తే.. చ‌ర్మంపై ఏజింగ్ ల‌క్ష‌ణాలు, ముడ‌త‌లు, ఫైన్ లైన్స్ కి దూరంగా ఉండ‌వ‌చ్చు.

కాట‌న్ పిల్లో క‌వ‌ర్స్ కాట‌న్ పిల్లో క‌వ‌ర్స్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మం, జుట్టు ర‌ఫ్ గా, డ‌ల్ గా మార‌కుండా.. హెల్తీగా, షైనీగా ఉంటుంది.

No comments:

Post a Comment