Saturday, May 21, 2016

ఇన్ స్టాంట్ ఎనర్జీనిచ్చే ఎనర్జిటిక్ ఫుడ్స్..

సాధారణంగా కొంత మంది ఆహారం బాగే తింటున్నా....శరీరంలో ఏదో ఒక లోపంగా అనిపిస్తుంటుంది. శక్తిలేనట్లు బలహీనంగా ఫీలవుతుంటారు. దాంతో ఎప్పుడు చూసిన అలటతో కనబడుతుంటారు?ఈ కారణం చేత దినచర్య కష్టమవుతుంది. ఏ పనిచేయాలన్నా కష్టంగా ఫీలవుతారు.

ఇలాంటి లక్షణాలు మీలో కనిపించాయంటే మీరు బలహీనతతో బాధపడుతున్నారని గుర్తించాలి. వైద్య పరంగా బలహీనంగా ఉన్నవారు శరీరంలో శక్తి లేకుండా ఉంటారు. ముఖ్యంగా కండరాలు మరియు ఎముకల్లో శక్తిని కోల్పోతారు . ఇలా కండరాలు, ఎముకలు బలహీనంగా మారినప్పుడు దినదిన చర్యలు కష్టంగా మారుతాయి . తరచూ అలసటతో ఆందోళను చెందుతుంటారు .

బలహీనత అనేది సాధారణ సమస్య లేదా కొన్ని ప్రత్యేకమైన కండరాలకు సంబంధించన సమస్యగా నిపుణుల అభిప్రాయపడుతున్నారు . బలహీనత ఉన్నవారు శరీరం మొత్తం వీక్ గా అనిపించడం , లేదా కాళ్ళు, భుజాల బలహీనంగా శక్తి, ఎనర్జీ లేనట్లు ఫీలవుతుంటారు. ఇలా కండరాలు బలహీనపడినప్పుడు ఒంట్లో శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. శక్తిసామర్థ్యాలు తగ్గినప్పుడు మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

శరీరకంగా బలహీనంగా మారినప్పుడు అందుకు ముఖ్య కారణం సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఫ్లూ లేదా ఇన్ఫెక్షన్స్, నిద్రలేమి, థైరాయిడ్ సమస్యలు మొదలగునవన్నీ బలహీనంగా మారడానికి కారణం అవుతాయి. అంతే కాదు, క్యాన్సర్, మరియు స్ట్రోక్ వంటి లక్షణాల్లో బలహీనత కూడా ఒకటి.

కాబట్టి, వారం రోజుల కంటే ఎక్కువగా మీరు తరచూ బలహీనతకు గురి అవుతుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం. బలహీనతకు గల అసలు కారణాన్ని తెలుసుకొని తగిన చికిత్సను తీసుకోవడం మంచిది.

సహజంగా చాలా మంది సాధరణ బలహీనతతో బాధపడుతుంటారని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు. అలాంటి వారికి సరైన పౌస్టికాహారం, హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్ ను అంధివ్వడం మరియు లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం వల్ల తప్పనిసరిగా బలహీనత నుండి బయటపడవచ్చు. మరి అలాంటీ హెల్తీ బ్యాలెన్డ్స్ డైట్ ఫుడ్స్ ను కొన్ని ఈ క్రింది లిస్ట్ లో అందివ్వడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని హెల్తీ లైఫ్ ను ఎంజాయ్ చేయండి...


అరటిపండ్లు: అరటిపండ్లలో నేచురల్ షుగర్స్ కాకుండా , ఎనర్జీని అందించే అద్భుతమైన ఆహారం. ఎందుకంటే అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. నేచురల్ షుగర్స్ వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి రోజులో ఒకటి రెండు అరటిపండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి. దాంతో మీ డైలీ యాక్టివిటీస్ చురుకుగా చేసుకోవచ్చు.


పాలు: పాలలో క్యాల్షియం, విటమిన్ బి మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీరానికి అవసరమయ్యే ఎనర్జీని అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ మిస్ కాకుండా ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలను బలోపేతం చేసుకోవచ్చు . వీక్ నెస్ ను తగ్గిస్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ ను అందిస్తుంది.



బాదం: బాదంలో అత్యంత పోషకవిలున్నాయన్న విషయం యూనివర్సల్ ఫ్యాక్ట్ . బాదం రెగ్యులర్ గా తినడం వల్ల బలహీనత తగ్గించుకోవచ్చు . బాదంలో విటమిన్ ఇ మరియు మెగ్నీషియం, వంటి మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది వీక్ నెస్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.



జెన్సింగ్ రూట్ : జెన్సింగ్ రూట్ మరో రిమార్కబుల్ నేచురల్ రెమెడీ. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల నరాలను బలపరుస్తుంది. తగినంత శక్తిని అందిస్తుంది. ఈ హెర్బ్ నేరుగా నరాల మీద ప్రభావం చూపుతుంది, . దాంతో నరాల బలహీనత మరియు టైయర్డ్ నెస్, వీక్ నెస్ అనే సమస్యలుండవు.



స్ట్రాబెర్రీస్: స్ట్రాబెరీలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి . ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. టిష్యు డ్యామేజ్ ను నివారిస్తుంది . ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల బాడీ మజిల్స్ కు సరిపడా శక్తిని అందిస్తుంది. వీక్ నెస్ తో పోరాడుతుంది, కాబట్టి రెగ్యులర్ గా స్ట్రాబెర్రీస్ తినడం వల్ల టేస్టీగా ఉంటుంది మరియు బలహీనతను తగ్గించుకోవచ్చు.



తులసీ టీ తులసీ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇతరబెనిఫిట్స్ కూడా అధికంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పు తులసీ టీ తాగడం వల్ల కండరాలు, ఎముకలు బలోపేతం చేయడంతో బలహీనత నుండి ఉపశమనం పొందవచ్చు.



ఆమ్లా: ఉసిరికాయ ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. కాబట్టి, ఆమ్లా (ఉసరికాయను )రెగ్యులర్ డైట్ లో ఏదోఒక విధంగా చేర్చుకోవడం వల్ల వీక్ నెస్ ఉండదు.



కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో అమేజింగ్ హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది . ఈ విషయం చాల కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇది వీక్ నెస్ కు కూడా చాలా ఎఫెక్టివ్ గా తగ్గించి శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది. కొబ్బరి నూనెను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెంచుతుంది . ఎనర్జీ లెవల్స్ పెరుగడంతో వీక్ నెస్ తగ్గుంది.



మామిడిపండ్లు: మామిడిపండ్లు అద్భుతమైన రుచి మాత్రమే కాదు, ఈ పండ్లు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్య గ్రేట్ విటమిన్స్ మరియు మినిరల్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి . దాంతో ఎనర్జీ లెవల్స్ పెరగడంతో ఆరోగ్యంగా ఉంటారు.



గుడ్లు: గుడ్డులో ఐరన్, విటమిన్ ఎ, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి . ఒక గుడ్డును రోజూ తినడం వల్ల ఇన్ స్టంట్ గా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి . ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు చేర్చుకోవడం వల్ల నేచురల్ గా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

No comments:

Post a Comment