Saturday, May 7, 2016

బరువు తగ్గించే అమేజింగ్ డ్రింక్...

ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యకర బరువును కలిగిండాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారు. అధిక బరువు మరయు ఊబకాయం ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తో ప్రతి ఒక్కరికీ తెలుసు.

అధికబరువు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అద్రుష్టవశాత్తు , ఎంత బరువున్నా ...బరువు తగ్గించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వర్కౌట్స్, జిమ్, వ్యాయామాలు మరియు కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడానికి బదులు, ఇతర సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. ఏ పనిచేయాలన్నా, పరిమితంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గించుకోవడానికి నేచురల్ రెమెడీ ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక సీక్రెట్ రెమెడీని మీరు బరువు తగ్గించుకోవడానికి పరిచయం చేస్తున్నాము.

ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ శరీరానికి డిటాక్సిఫై చేయడంతో పాటు , బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ మార్గం. ఈ నేచురల్ డ్రింక్ ను తయారుచేయడానికి మూడు ముఖ్యమైన పదార్థాలు అవసరం అవుతాయి. వాటిలో కీరదోస, లెమన్, మరియు మింట్ . కీరదోసకాయ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు అద్భుతమైన డ్యూరియాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి.

అదే విధంగా నిమ్మరసం అసిడిక్ లక్షణం కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. మరియు ఫ్యాట్ బర్నింగ్ కాంపోనెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఇక పుదీన అద్భుత ఔషధాలు కలిగినది . అనేక న్యూట్రీషియన్స్ గలది మరియు ఇది స్టొమక్ యాసిడ్స్ ను నివారిస్తుంది.

ఈ మూడు రకాల కాంబినేషన్ పదార్థాలు జీర్ణక్రియను పెంచడంలో గొప్పగా సహాయపడుతాయి . వీటిని కలిపినప్పుడు , వండర్ ఫుల్ టమ్మీ ఫ్లాటనింగ్ డ్రింక్ గా పనిచేస్తుంది.

పొట్టదగ్గర చేరిన అనవసర వ్యర్థాలను తొలగించడంలో ఈ డ్రింక్ గ్రేట్ గా పనిచేస్తుంది. దాంతో బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

మరి ఈ బరువు తగ్గించే డ్రింక్ తయారుచేయడం ఎలా, దీనికి ఏం అవసరం అవుతాయో తెలుసుకుందాం..


కావల్సినవి:
కీరదోసకాయ: 1/2
నిమ్మకాయ: 1
పుదీనా ఆకులు 10
నీరు: 1లీటర్
తయారుచేయు విధానం: కీరదోసకాయను , పుదీనా ఆకులను కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను ఒక లీటర్ నీటిలో మిక్స్ చేసి ఫ్రెష్ లెమన్ జ్యూస్ ను అందులో జోడించాలి . తర్వాత మీకు ఇష్టమైతే కొన్ని ఐస్ ముక్కలు జోడించి చల్లచల్లగా లాంగించేయాలి.

ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . రిమార్క్ లేకుండా క్రమంగా బరువు తగ్గుతారు. మంచి మార్పు కనిపిస్తుంది . ఈ హెల్తీ హ్యాబిట్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందడంతో పాటు, స్లిమ్ గా తయారవుతారు.

No comments:

Post a Comment