Wednesday, June 22, 2016

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ34

శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.25 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్ ను ప్రయోగించారు. 48 గంటల కౌంట్‌డౌన్ పూర్తయిన అనంతరం వివిధ దేశాలకు చెందిన 20 ఉపగ్రహాలను మోసుకుని పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది.

44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ34 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశల్లో ప్రయోగించారు.  727.5 కిలోల కార్టోశాట్ 2 సిరీస్‌తో పాటు 560 కిలోల బరువైన మరో 19 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ34 మోసుకుపోయింది. ఈ ప్రయోగంలో భారత్‌కు చెందిన ఉపగ్రహాలతో పాటు అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేసియా ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం ఈ ఉపగ్రహాల బరువు 1288 కిలోలు.

No comments:

Post a Comment