Wednesday, June 22, 2016

భోజనం తర్వాత ఇలా చేస్తే వందేళ్ళు ఆరోగ్యంగా ఉండోచ్చట..

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో బరువు తగ్గించుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గించుకోవాలనుకునే వారు వర్కౌట్స్ చేయడానికి లేదా జిమ్ కు వెళ్ళడానికి లేజీగా పీలవుతుంటారు. అందుకు ఒక సింపుల్ చిట్కా...భోజనం చేసిన తర్వాత సింపుల్ గా వాక్ చేయండి. ఇది పాతకాలపు పద్దతో లేదా అపోహనో కాదు. ఇది నిజంగా కొంత ప్రయోజనం కలిగిస్తుంది కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు . భోజనం తర్వాత నడవడం వల్ల హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. బరువు కంట్రోల్ చేస్తుంది, నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఫ్యాటీ లివర్ ను నివారిస్తుందని పరిశోధనల్లో నిర్ధారించబడినది. 

భోజనం చేసిన తర్వాత మీ లాన్ లో లేదా బాల్కనీలో మీకు అనుకూలమైన ప్రదేశంలో చిన్న వాక్ చేయండి. ఇలా చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్రబాగా పడుతుంది . బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి . భోజనం చేసిన తర్వాత చిన్న పాటి నడక వల్ల జీర్ణశక్తి పెరిగి, జీర్ణక్రియ చురుకుగా పనిచేస్తుంది. మెటబాలిజం రేటు పెరుగుతుంది . బోరుగా అనిపిస్తే మీకు నచ్చిన వారితో, లేదా మీ పార్ట్నర్ తో కబుర్లు చెప్పుకుంటూ 10 నిముషాలు నడవడం వల్ల మీకు ఆ ఫీలింగ్ కూడా తెలియదు. 



బరువు తగ్గి, హెల్తీగా ఉండటానికి ఒది ఒక సింపుల్ ఫన్నీ మార్గం. అంతే కాదు, భోజనం చేసిన వెంటనే ఒక చిన్న పాటి నడక వల్ల మరికొన్ని ప్రయోజనాలున్నాయి. అవేంటంటే...



బరువు తగ్గుతారు: బరువు తగ్గించుకోవాలి, కానీ వ్యాయామాలు చేయడం ఇష్టం ఉండదు. అలాంటి వారు భోజనం చేసిన వెంటనే ఒక చిన్న పాటి వాక్ చేయండి. తిన్న వెంటనే వాక్ చేయడం వల్ల నడుము వద్ద కొవ్వు ఏర్పడకుండా , నడుచుట్టుకొలత తగ్గించుకోవచ్చు.


బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది: భోజనం చేసిన వెంటనే వాక్ చేయడం వల్ల ప్యాంక్రియాటిస్ లో ఇన్సులిన్ పెరుగుతుంది . ఇది రక్తంతోపాటు గ్లూకోజ్ ను కండరాలకు అందజేస్తుంది దాంతో కొవ్వును విచ్చిన్న చేసి ఎనర్జీగా మారుతుంది . మీల్స్ చేసిన తర్వాత బ్రిస్క్ వాక్ చేయడం వల్ల డయాబెటిస్ ను నివారించుకోవచ్చు.



గాఢ నిద్ర: రాత్రి డిన్నర్ చేసిన తర్వాత చిన్న పాటి నడక వల్ల జీర్ణశక్తి పెరుగుతంది . మెటబాలిజం రేటు పెరుగుతుంది . దాంతో పొట్ట సమస్యలుండవు. ఇంకా మంచి గాఢ నిద్ర పడుతుంది. నిద్ర సమస్యలు ఉండవు. 

మెటబాలిజం రేటును మెరుగుపరుస్తుంది: బరువును కంట్రోల్ చేసుకోవాలనుకుంటే వాక్ చేయాలి. వాకింగ్ చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది . మెటబాలిజం రేటు పెరగడం వల్ల శరీరం స్లిమ్ గా తయారవుతుంది . అంతే కాదు మెటబాలిజం రేటు పెరగడం వల్ల శరీరంలో ఇతర అవయవాలు చురుకుగా పనిచేస్తాయి.



ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించి ఫ్యాటీ లివర్ ను నివారిస్తుంది: భోజనం తర్వాత నడవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది . జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకున్నప్పుడు వెంటనే వాక్ చేయడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ తొలగించి ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులను నివారిస్తాయి.



హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ ను నివారిస్తాయి: భోజనం చేసిన తర్వాత 15నిముషాలు వాక్ చేయడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది , దాంతో బ్రెయిన్ మరియు హార్ట్ కు చెడు రక్తం ప్రసరించడాన్ని ఆపుతుంది. మంచి రక్తం ప్రసరణను మెరుగుపరుస్తుంది . దాంతో హార్ట్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ కు అవకాశం ఉండదు.



స్ట్రెస్ తగ్గిస్తుంది: భోజనం చేసిన తర్వాత వాక్ చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగు పడుతుంది. ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గిస్తుంది.


1 comment:

  1. Breaking News on Everyday

    http://andhranewsdaily.blogspot.in/

    ReplyDelete