Tuesday, June 21, 2016

ప్రస్తుత జీవితంలో యోగా ప్రాధాన్యత ఏంటి ?

యోగా అంటే.. పాత కాలానికి సంబంధించింది అని భావిస్తాం. కానీ.. ఇటీవల యోగా చాలా పాపులారిటీ సంపాదించింది. మనం హెల్తీగా, హ్యాపీగా బతకడానికి యోగా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ ఆధునిక ప్రపంచంలో యోగాకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. 



ప్రస్తుత రోజుల్లో మనుషులు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒత్తిడి ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న ప్రాబ్లమ్. దాని నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. ఫలితం పొందలేకపోతున్నారు. 



కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి పరిష్కారం వెతుక్కుంటున్నారు. అయితే.. ఒత్తిడిని, శారీరక శ్రమను జయించడానికి అందుబాటులో ఉన్న సింపుల్ సొల్యూషన్ యోగా. శారీరక, మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని పొందాలంటే.. యోగా సహాయపడుతుందని.. అందరిలో అవగాహన కల్పించడం చాలా అవసరం.



యోగా అంటే ఏంటి ? యోగా అనే పదం సంస్కృత పదం యోగ్ నుంచి వచ్చింది. యోగ్ అంటే.. జాయిన్, లేదా కలయిక అని అర్థం. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇండియాలోని మహర్షులు యోగాను కనుగొన్నారు. మానసిక ప్రశాంతతను పొందడానికి యోగా ప్రాక్టీస్ చేసేవాళ్లు. అలాగే ధ్యానం ద్వారా అంతర్దృష్టి తెలుసుకునేవాళ్లు.


ప్రస్తుత లైఫ్ లో యోగా ఎందుకు అవసరం ? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితం చాలా బిజీగా మారిపోయింది. పనితో నిగమ్నమయి ఉంటారు. లేదా వర్క్ కోసం బిజీగా ఉండిపోయి ఉంటారు. ఈ పోటీతత్వ ప్రపంచంలో ప్రజలు.. వాళ్ల వ్యక్తిగత విషయాలను మరిచిపోతున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో పడిపోయి.. పర్సనల్ జీవితంపై ఆసక్తి కోల్పోతున్నారు. 



బ్యాక్ పెయిన్, కాళ్ల నొప్పులు ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు చిన్న వయసులోనే వేధిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్ లో పనిచేసేవాళ్లు.. ఇలాంటి సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. 

జీవితం రేస్ లా మారిపోవడంతో.. ఏం కోల్పోతున్నారో గుర్తించలేకపోతున్నారు. కాబట్టి.. మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాలి. పార్టీలు, షికార్లు, పబ్ లు, క్లబ్ లు అంటూ.. యూత్ ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతోంది. ఇలాంటప్పుడే.. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు.

ప్రస్తుత జీవితంలో యోగా ప్రాధాన్యత ఏంటి

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో యోగాకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసుకుంటున్నారు. చాలా స్కూల్లు, కాలేజీల్లో.. ఆరోగ్యానికి సంబంధించిన కోర్సులతో పాటు, యోగాపైనా అవగాహన కల్పిస్తున్నారు. మోడ్రన్ ప్రపంచంలో యోగాకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

యోగా అనేది మొత్తంగా ఎంతో ప్రయోజనకరం. ఇందులో వందల ఆసనాలున్నాయి. బిగినర్స్ నుంచి.. అనుభవజ్ఝుల వరకు లెవెల్ కి తగ్గట్టు ఆసనాలు ఉన్నాయి. తల నుంచి పాదాల వరకు ఎలాంటి సమస్య ఉన్నాయి.. సరైన పరిష్కారం యోగా. ఇది అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. ప్రశాంతతను కలిగిస్తుంది.

యోగా చాలా న్యాచురల్ మెడిసిన్ గా చెప్పవచ్చు. అయితే ఏ ఆసనం వేయడానికైనా ముందు ఎక్స్ పర్ట్ సలహా తీసుకోవడం అవసరం. అప్పుడే.. యోగాసనం వేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి హెల్తీగా ఉండాలి అంటే, హెల్తీ మైండ్ కావాలన్నా.. డే టు డే లైఫ్ లో యోగా చాలా అవసరం.

No comments:

Post a Comment