Friday, August 26, 2016

చాక్లెట్ తినడం మంచి అలవాటే అంటా..!

ప్రతి ఉదయం అందమైనదే. ప్రతి రోజూ విలువైనదే. చిరునవ్వుతో రోజు ప్రారంభించి ఆనందంగా గడపడమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందాన్ని పంచివ్వ మంటోంది ఆధునిక సమాజం. అందుకే నేటి యువతరం అన్నింటా సింపుల్‌ ట్రిక్స్‌ ఆఫర్‌ చేస్తున్నారు. అలాంటి ట్రిక్స్‌లో చాక్లెట్‌ ఒకటి!



ఇప్పుడు చాక్లెట్‌ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు! మనోల్లాసంతో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పేశారు వైద్య నిపుణులు! అత్తా కోడళ్ళైనా, ఆలూమగలైనా, ఆఫీసులో బాసూ కొలీగైనా చాక్లెట్‌వైపు మొగ్గుచూపిస్తే రోజంతా ఆరోగ్యం, ఆనందమేనట! బుజ్జాయి ఏడుస్తోందంటే చాక్లెట్‌ కొనాల్సిందే. ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవాలంటే చాక్లెట్‌ చూపించాల్సిందే. చాక్లెట్‌ తింటే చాలు ముఖంపై చిరునవ్వు రావాల్సిందే..కానీ చాక్లెట్‌ తింటే దంతాలు దెబ్బతింటాయి, పళ్లు పుచ్చిపోతాయి, బరువు పెరుగుతామని చాలామంది భయపడ తారు! జిహ్వను అణచుకుంటారు. ఇవేవీ నిజం కాదట. మరి ఆ చాక్లెట్స్‌ చెప్పే తీపి కబుర్లేంటో విందామా!

చాక్లెట్‌ తింటే సంతోషం కలుగుతుంది.
ఎందుకో తెలుసా! అందులో ఉండే ట్రిప్టోఫాన్, ఫెవైల్‌టి లాలామిన్లు లాంటి పదార్థాల వల్ల పది గ్రాముల చాక్లెట్లు ప్రతిరోజూ తింటే శరీరంలో రక్తప్రస రణ మెరుగు పడుతుందని యూరప్‌ ఆహార భద్రతా సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు వీటిని రోజూవారి డైట్‌లో భాగంగా చేసుకుంటే మరెన్నో లాభాలున్నాయట. వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే తప్పకుండా చాక్లెట్ తినాల్సందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చాక్లెట్లు ఏవి పడితే అవి తినడం కాకుండా ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. మరి రోజుకు ఒక్క చాక్లెట్ తినడం వల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..


హార్ట్ కు మంచిది:
రోజుకు ఒక చాక్లెట్‌ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ చాక్లెట్ తింటే హార్ట్ కు మంచిది . బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. హార్ట్ అటాక్ నివారణతో పాటు హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. . క్రమం తప్ప కుండా రోజూ చాక్లెట్‌ తినేవారికి గుండె జబ్బుల ముప్పు 25 శాతం వరకు తగ్గుతుందనీ, 45 శాతం మేరకు మరణాంతక జబ్బులు తగ్గుతాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. చాక్లెట్‌ గుండె ఆరో గ్యాన్ని పెంచడమే కాకుండా లోబ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. శరీరానికి అవసరమయ్యే శక్తిని వ్యాధి నిరోధకతను వెంటనే అందించే శక్తి చాక్లెట్‌కు ఉంది. ఇవి చాలావరకూ అన్ని రకాల బ్లడ్‌ ప్రజర్స్‌ను రెగ్యులేట్‌ చేస్తాయట. అందువల్ల చాక్లెట్‌ను కూడా రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధినిరోధకశక్తని పెంచుతుంది: చాక్లెట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. దాంతో వివిధ రకాల జబ్బులను రాకుండా నివారిస్తుంది. చాక్లెట్స్ లో ఉండే న్యూట్రీషియన్స్ హానికర బ్యాక్టీరియాను నాశనం చేసి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

స్ట్రోక్ నివారిస్తుంది:
చాక్లెట్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ గుణాలు స్ట్రోక్ తో పోరడటానికి సహాయపడుతుంది. మహిళలు చాక్లెట్ ను వారానికొకసారి తినడం ఆరోగ్యానికి మంచిది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది: డార్క్ చాక్లెట్ ను రోజుకొక్కటి తినడం వల్ల బ్లడ్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బ్లడ్ ఫ్యూరిఫై చేయడంలో డార్క్ చాక్లెట్ గ్రేట్ అని చెప్పొచ్చు. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది: చాక్లెట్స్ లో ఉండే కోక దీన్నే పెంటమెరిక్ ప్రొకెనిడిన్ అని పిలుస్తారు. ఈ కాంపౌండ్ చాలా ఎఫెక్టివ్ గా క్యాన్సర్ సెల్స్ ను ఎదుర్కుంటుంది. క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది.



డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తుంది:
చాక్లెట్ ను రెగ్యులర్ గా తినడానికి ఇక ముఖ్యకారణం, డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది. చాక్లెట్స్ ఇన్సులిన్ సెన్సిస్టివిటిని పెంచుతుంది. దాంతో డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.

దగ్గు నివారిణి :
చాక్లెట్స్‌ తింటే దగ్గు పెరుగుతుంది కానీ తగ్గుతుందా! అనుకుంటున్నారా తగ్గుతుందనే అంటున్నాయి పరిశోధనలు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు దగ్గును చాక్లెట్‌తోనే తగ్గించవచ్చట. హుల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలైన మొరిస్‌ అంతర్జాతీయ దగ్గు స్పెషలిస్ట్‌. దగ్గును చాక్లెట్‌తో తగ్గించవచ్చనే విషయాన్ని ఓ పరిశోధనలో ఆయన తేల్చేశాడు. 163 మంది రోగులకు 12 నెలలపాటు రోజుకో చాక్లెట్‌ తినిపించి చూస్తే, దగ్గుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదట. సాధారణ మందులకన్నా చాక్లెట్‌ సంబంధించిన ఔషధాన్ని సేవిస్తే దగ్గు తగ్గు ముఖం పడుతుందని ఆయన పరిశోధనలో తేలింది. చాక్లెట్ లో ఉండే థియోబ్రొమైన్ కఫ్ సిరఫ్ లా పనిచేస్తుందని చెబుతున్నారు.

బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది :
చాక్లెట్లు తినడం వల్ల మెదడులో చురుకుదనం పెరుగుతుంది. ఆలోచనాప్రక్రియ మెరుగు పడుతుందని అమెరికా మైన విశ్వవిద్యాలయం - దక్షిణ ఆస్ర్టేలియా విశ్వవిద్యాలయం, లగ్జెమ్‌బర్గ్‌ ఆరోగ్య సంస్థల సంయుక్త పరిశోధనలో వెల్లడైంది. పిల్లల డైట్ లో కూడా చాక్లెట్స్ ను చేర్చడం వల్ల ఇది పిల్లలను మంచి ఇంటలిజెంట్స్ గా మార్చుతుంది. రెగ్యులర్ గా చాకెట్స్‌ తినేవారిలో జ్ఞాపకశక్తి, పరిశీలన, విశ్లేషణా సామర్థ్యం, సమన్వయం తదితర అంశాల్లో మంచి ప్రతిభ చూపుతారు.

రక్తంకు మంచిది :
ప్రతి రోజూ ఒక డార్క్ చాక్లెట్ తినడం వల్ల , చాక్లెట్ లో ఉండే ఔషధగుణాలు రక్తంను శుద్ది చేస్తుంది. దాంతో రక్తప్రసరణ బాగుటుంది. రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్లు ఉండుటవల్ల మీరు వాటిని తిన్న తర్వాత 2-3 గంటలు వరకు రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మెదడులో రక్తనాళాలు విస్తరణ ద్వారా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

కోపం, ఒత్తిడి మటుమాయం:
నలుపురంగు చాక్లెట్‌ తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఈ విషయాన్ని తాజా అధ్య యనాలు కూడా నిరూపిస్తున్నాయి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి బ్లాక్‌ చాక్లెట్‌ ఉపకరి స్తుందట. అందులో ఉండే పాలిఫెనాల్స్‌ అనే రసాయనం ప్రశాంతతను, తృప్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలిఫెనాల్స్‌ రసాయ నాలు ఆక్సిడేటివ్‌గా పనిచేసి ఒత్తిడి తగ్గిస్తాయి. మానసికంగా అనేక దుష్ప్రభావాలని ఇవి దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మోనోపాజ్ దశలో గ్రేట్ గా సహాయపడుతుంది:
మహిళలు మోనోపాజ్ దశలో ఉన్నప్పుడు రోజుకు ఒక్క చాక్లెట్ తింటే చాలు, మూడ్ ను అందిస్తుంది. భావోధ్వేగాలను అణచివేస్తుంది. హార్మోనుల ప్రభావం వల్ల మానసికంగా, శారీరకంగా వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి చాక్లెట్ లో ఉండే గుణాలు గ్రేట్ గా సహాయపడుతాయి.

మహిళల సమస్యలకు:
మహిళలకు వచ్చే నెలసరి సమయంలో ఈస్ర్టో జన్, ప్రొజెస్టరాన్ స్థాయి తగ్గుతుంది. ఈ సమ యంలో కడుపునొప్పి, టెన్షన్, కోపతాపాలు అధిక మవుతాయి. చికాకుగా ఉంటారు. క్షణక్షణానికి వాళ్ల మూడ్‌ మారుతూ ఉంటుంది. హార్మోన్లలో వచ్చే మార్పులే దీనికి కారణం. హాయిని కలిగించే పెరోటినిస్‌ తగ్గిపోవడం, ఎండార్ఫిన్‌లు మాయమవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమయంలో కొన్నిరకాల పోషకాహారంతో పాటు, డార్క్‌ చాక్లెట్లు కూడా అద్భుతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పొట్ట తగ్గడానికి :
నేటికాలంలో చాలామందిని వేధించే సమస్య అధిక బరువు. దానికితోడు బానపొట్ట. సన్నగా నాజూగ్గా తయారవ్వాలనేది ప్రతి వారికీ కోరికే. అందుకు కఠినమైన ఆహారనియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ రోజుకో డార్క్‌ చాక్లెట్‌ తింటే మీ బాన పొట్ట కాస్తా తగ్గుతుందట. ప్రత్యేకించి కోకోబీన్సతో చేసిన చాక్లెట్లు లేదా వాటి పౌడర్‌ శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. కోకో శరీరంలో కొవ్వును ఖర్చు చేస్తుంది. బరువు తగ్గేలా చేస్తుంది.

శృంగార సామర్థ్యం :
చాక్లెట్లతో ఉండే కోకోబీన్స్‌కు లైంగిక సామ ర్థ్యానికి అతిదగ్గర సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. ఇటలీలోని మిలాన్‌లో ఓ హస్పెటల్‌లో 200 మందిపై పరిశోధనలు చేసి వారికి రోజుకొక చాక్లెట్‌ తిని పించారట. చాక్లెట్‌ తిన్న వారిలో ఉండే శృంగార కోరికలు, తిననివారికంటే అధికంగా ఉన్నాయని కనిపెట్టారు. చాక్లెట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీ షియం ఎముకలలో దృఢత్వాన్ని కలిగిస్తాయి. రక్తంలో షుగర్‌ శాతం తగ్గినట్టయితే చాక్లెట్‌ తినడం మంచిది. రోజూ చాక్లెట్‌ తింటే వృద్ధులలో వచ్చే అల్జీమర్స్‌ వ్యాధికి చెక్‌పెట్టవచ్చు.

వృద్ధాప్యం రానివ్వదు: చాక్లెట్లు ఎక్కువగా వినియోగించుట వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే కొంతకాలం వృద్ధాప్యంను తప్పించడంలో సహాయపడుతుంది. ముఖం మీద ముడతలు రాకుండా చేస్తుంది. మళ్లీ, యాంటీఆక్సిడెంట్లు ఈ ప్రయోజనాల కోసం బాధ్యత తీసుకుంటాయి.

No comments:

Post a Comment