Tuesday, August 23, 2016

చివరి ఘట్టానికి చేరుకున్న కృష్ణా పుష్కరాలు


కృష్ణా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. చివరి అంకానికి చేరుకున్న పుష్కరాల్లో స్నానం చేయడానికి.. తరలివచ్చే భక్తులతో రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పుష్కర ఘాట్లు పదకొండో రోజు కుంభమేళాను తలపించాయి. పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో.. ఘాట్లలో స్నానం చేయాలన్న ఆత్రుతతో భక్తులు భారీగా తరలివచ్చారు. విజయవాడ, అమరావతి, నల్గొండ, మహబూబ్ నగర్లో పుష్కర ఘాట్లు భక్తులతో కళకళలాడాయి.
అటు కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం ఫెర్రీ వద్ద కృష్ణమ్మకు పవిత్రహారతిని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తెలుగు ప్రభుత్వాలు.. ముగింపు ఉత్సవాలను కూడా బాగా ప్లాన్ చేశాయి. ఏపీలో చివరిరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచే పుష్కరస్నానాలు నిలపేయనున్నారు. ఫెర్రీ వద్ద చివరిరోజు కృష్ణమ్మకు ఇచ్చే పవిత్రహారతి కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది.

No comments:

Post a Comment