Tuesday, August 30, 2016

జింజర్ చేస్తుంది ఎంతో మేలు..!

జింజర్ టీ మొదట కనుగొన్నది చైనాలో కానీ ఇప్పుడు అది ప్రపంచమొత్తం మోస్ట్ ఫేవరెట్ డ్రింక్ అయింది. ఎందుకంటే ఇందులో ఉండే ఆరోమా స్మెల్ మరియు ఫ్లేవర్ వల్ల ,ఇందులోని గ్రేట్ బెనిఫిట్స్ వల్ల జింజర్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. దీన్ని ఫ్రెష్ గా మరియు డ్రైగా ఉపయోగిస్తున్నారు. అయితే జింజర్ టీ వివిధ రకాల ఫ్లేవర్స్ తో తయారుచేస్తున్నారు. 



జింజర్ టీలోని అద్భుత ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలుసు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ఇది టేస్టీగా ఉంటుంది.అందుకే 2500సంవత్సరాల నుండి దీన్ని ఫేవరెట్ డ్రింక్ గా చైనావారు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్, ముక్కుదిబ్బడ మొదలగు సమస్యల నుండి ఉపశమనం పొందడానికి వారి రెగ్యులర్ డైట్ లో దీన్ని ఎక్కువగాఉపయోగిస్తున్నారు. అల్లం టీలో కాపర్, మెగ్నీషీయం, పొటాషిం, క్యాల్షియం, మరియు జింక్ లు అధికంగా ఉన్నాయి. ఇవి కాకుండా విటమిన్ బి, సి మరియు డిలు కూడా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం... 


1. వికారం మరియు వాంతులు: అల్లం టీ తాగడం వల్ల వాంతులు వికారం తగ్గతుంది . సర్జరీ తర్వాత లేదా మోషన్ సిక్ నెస్ వల్ల మరియు సీసిక్ నెస్ వల్ల వచ్చే వికారంను నివారించడంలో అల్లం టీ గ్రేట్ గా సహాయపడుతంది. కీమో థెరఫీ తర్వాత వచ్చే వామిటింగ్ సెన్షేషన్ ను నివారిస్తుంది. 

2. జలుబు మరియు దగ్గు తగ్గిస్తుంది: జింజర్ టీని కొన్ని వేల సంవత్సరాల నుండి జలబు దగ్గు నివారణలో బాగంగా ఉపయోగిస్తున్నారు . అల్లం టీ ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. దాంతో శ్వాస బాగుంటుంది. బ్రీతింగ్ సమస్యలనుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అలర్జీలను మరియు హెవీ ఫీవర్ వల్ల తరచూ వచ్చే తుమ్ములను నివారిస్తుంది. 



3. ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది: అల్లం టీ ఒత్తిడి తగ్గించడంలో ఒక అద్భుతమై టీ. ముఖ్యంగా దీని ఉండే ఆరోమా వాసన ఇన్ స్టాంట్ గా సెన్స్ ను ప్రశాంత పరుస్తుంది. బ్రెయిన్ ను రిలాక్స్ చేస్తుంది . మనస్సులో భావోద్రేకాన్ని తగ్గిస్తుంది. అల్లం టీలో సోగోల్స్ మరియు జింజరోల్స్ అనే యాక్టివ్ గుణాలుండటం వల్ల బాడీని క్లీన్ చేస్తుంది . దాంతో స్ట్రెస్ తగ్గుతుంది. ఆస్తమా పేషంట్స్ కూడా జింజర్ టీని ఎక్కువగా తీసుకుంటున్నారు. 

4. ఆకలిని పెంచుతుంది: జింజర్ టీ ఆకలి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అల్లం టీని భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణశక్తిని పెంచుతుంది. 

5. రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది: అల్లం టీని రెగ్యులర్ గా తీసుకుంటుంటే రుతుక్రమంలో వచ్చే నొప్పిలు, తిమ్మెర్లను నివారిస్తుంది. 

6. తలనొప్పి తగ్గిస్తుంది: అల్లం టీలో తలనొప్పి తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఉండే ఇన్ హిబిటెడ్ ప్రోస్టోగ్లాడిన్ సింథసిస్ పెయిన్ తగ్గిస్తుంది . బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు. కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు! బ్రెస్ట్ రాషెస్ ను మాయం చేసే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!! గర్భిణీ స్త్రీలు ఒక్క అరటిపండు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..!! 

7. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది: ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల మినిరల్ యాసిడ్స్ ను రక్తం ద్వారా బాడీ మొత్తం సప్లై చేస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. 

8. క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది: అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల , కొన్ని రకాల ప్రోటీన్స్ వల్ల అల్లం క్యాన్సర్ కు వ్యతిరేఖమని ఇది ఒక పవర్ ఫుల్ పదార్థమని రీసెంట్ గా జరిపిన స్టడీలో తేలింది. 

9. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: పరిశోధనల ప్రకారం బ్యాడ్ కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను ఏర్పడుటకు సహాయపడుతుంది. 

10. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది: అల్లం టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ ఒక కప్పు అల్లం టీ తాగడం వల్ల స్ట్రోక్ తగ్గిస్తుంది .అల్లం లో ఉండే యాంటీఫ్యాటీ యాసిడ్స్ రక్త నాళాల్లో అడ్డంకులు లేకుండా పనిచేస్తుంది. 

11. అల్లం టీలో ఇతర ప్రయోజనాలు: లివర్ ను డిటాక్సిఫై చేస్తుంది, బ్యాడ్ బ్రీత్ నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. జింజర్ టీలో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది. కాబట్టి, అల్లం టీలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా,దీన్ని పరిమితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కు దారితీస్తుంది.బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. అల్లం టీ అనస్తీయాకు కూడా కారణమవుతుంది.దాంతో రక్తస్రావానికి కారణమవుతుంది.

No comments:

Post a Comment