Saturday, April 16, 2016

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఈజీ టిప్స్

మచ్చలు లేకుండా, వంక పెట్టడానికి వీలు లేని చర్మం ఉండాలనిఎ అ స్త్రీ కోరుకోదు?? ప్రకటనల్లో చూపించినట్లు మనందరికీ ఇలాంటి చర్మం ఉండటం అసాధ్యం.అలాంటి చర్మం సొంతమవుతుందన్నట్లు చూపించడం మార్కెటింగ్ గిమ్మిక్కు. కానీ అలాంటి చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు,అదీ ఇంట్లో దొరికే పదార్ధాలతో అంటే నమ్ముతారా??

మీరు చెయ్యాల్సిందల్లా సహజంగా లభిచే కొన్ని పదార్ధాలతో మాస్కులు చేసి మీ ముఖానికి క్రమం తప్పకుండా వేస్తూ ఉండటమే.వీటిని క్రమం తప్పకుండా వాడితే మీ చర్మానికి కేవలం మెరుపునివ్వడమే కాకుండా మచ్చలు లేని చర్మం కూడా మీ సొంతమవుతుంది.పెరుగు, కుంకుమ పువ్వు, నారింజ తొక్కల పొడి మొదలైన పదార్ధాలు మీ చర్మం మీద అధ్భుతాలు చేస్తాయి.వీటిని కొన్ని వారాలు వాడి మీ చర్మంలో కలిగే మార్పులని మీరే గమనించండి. ప్రకాశవంతమైన, మచ్చలు లేని చర్మం సొంతమవ్వడానికి ఏ యే పదార్ధాలు వాడాలో క్రింద ఇచ్చాము. చదివి కాంతి వంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.


  • పెరుగు: పెరుగులో ఉన్న లాక్టిక్ ఆసిడ్ బ్లీచింగ్ ఏజెంటుగా పనిచేస్తుంది.పెరుగుని మీ ముఖం మీద మృదువుగా రుద్ది తరువాత వెచ్చటి నీటితో కడిగితే చర్మానికి తేమ అంది ప్రకాశవంతమవుతుంది.


  • కుంకుమ పువ్వు: అతి ఖరీదైన సుగంధ ద్రవ్యమైన కుంకుమ పువ్వుకి చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణాన్ని కలిగి ఉంటుంది.పాలల్లో కాసిని కుంకుమ పూ రెక్కలు వేసి దానిని ముఖానికి పట్టించి ఆరాకా కడిగెయ్యాలి. ముఖం మీద మచ్చలు, గాట్లని తొలగించి చర్మాన్ని మెరిపించే గుణం ఈ సుగంధ ద్రవ్యం సొంతం.
  • నారింజ తొక్కల పొడి: మీ చర్మం సహజం గా మెరిసేటట్లు చేయడంలో నారింజ తొక్కలదే అగ్రస్థానం.ఒక స్పూన్ పెరుగులో ఎండబెట్టి పొడి చేసిన నారింజ తొక్కల పొడిని కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత కడిగితే మీకే తేడా తెలుస్తుంది.వారానికొకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలొస్తాయి.
  • బాదాం మరియూ పాలు:
    నల్లని చర్మపు చాయని మెరుగుపరచడానికి ఇది పురాతన కాలం నుండీ వస్తున్న చిట్కా.ఈ మాస్క్ నల్లటి మచ్చలనీ, నల్ల వలయాలనీ తొలగించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.బాదం పప్పులని నాబెట్టి పేస్టు చేసి దానికి కాస్త పాలు కలపండి. దీనిని ముఖమంతా పట్టించి ఆరాకా కడిగెయ్యాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితాలొస్తాయి.
  • టమాటా మరియూ కొత్తిమీర
    మాస్క్:చర్మ ఛాయని మెరుగుపరచడానికి ఈ ప్యాక్ అధ్భుతాలు చేస్తుంది.ఇది అన్ని రకాల చర్మాలకీ నప్పుతుంది.2 స్పూన్ల కొత్తిమీర రసానికి సమపాళ్ళలో టమాటా రసాన్ని కలిపి ముఖానికి పట్టించి ఆరాకా నీళ్ళతో కడగాలి.


No comments:

Post a Comment