Saturday, April 16, 2016

టేస్టీ ఫాస్ట్ ఫుడ్ తో కలిగే.. డేంజరస్ డిసీజెస్.. !

ఫాస్ట్ ఫుడ్.. !! చిన్నా పెద్దా .. అందరినీ నోరూరించే పసందైన, కలర్ ఫుల్ ఫుడ్ ఇది. ఇది లేకుండా రోజు గడవదంటే ఆశ్చర్యం లేదు. చాలా త్వరగా ప్రేపర్ చేసి.. త్వరగా తినడానికి వీలయ్యే ఆహారమిది. ఫాస్ట్ ఫుడ్ ని ఎలాంటి పోషకాలు లేని ఆహారంగా, ఎక్కువ ఫ్యాట్, క్యాలరీలు ఉన్న ఫుడ్ గా చెప్పవచ్చు.



ఫాస్ట్ ఫుడ్స్ లో తక్కువ పోషక విలువలు, ఎక్కువ ఫ్యాట్, షుగర్, క్యాలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి, ఆరోగ్యానికి మంచిది కాదు. స్నాక్ ఫుడ్స్, గమ్, క్యాండీ, స్వీట్ డిజర్ట్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్, కార్బొనేటెడ్ బివరేజెస్ వంటివన్నీ ఫాస్ట్ ఫుడ్స్ గా పరిగణిస్తారు. అలాగే పేస్ట్రీలు, సాండ్ విజ్ లు, బర్గర్స్, కబాబ్, పిజ్జా, సూప్స్, సలాడ్స్ ఇవన్నీ.. ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్సే. కానీ.. వీటినే ఎక్కువ ఇంట్రెస్ట్ గా తీసుకుంటారు. 


ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు టక్కున గుర్తొచ్చేది.. టేస్టీగా, సువాసనగా, కలర్ ఫుల్ గా ఉండే ఫాస్ట్ ఫుడ్సే. కానీ ఇంతకీ ఎట్రాక్ట్ చేసే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల దుష్ర్పభావాలు ఎక్కువని.. అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం..


  • ఒబేసిటీ : ఫాస్ట్ ఫుడ్ వల్ల ఎక్కువగా వచ్చే సమస్య ఒబేసిటీ. అంటే.. శరీరంలో ఎక్కువగా ఫ్యాట్ చేరడం. అధిక బరువు ఉండటం, ఒబేసిటీ ఒకటి కాదు. తక్కువ మొత్తంలో ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నా.. ఎక్కువ క్యాలరీలు శరీరానికి అందడం వల్ల బరువు పెరుగుతారు.

  • గుండె సమస్యలు వారానికి నాలుగు సార్లు, అంతకంటే ఎక్కువ సార్లు ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్లలో హార్ట్ డిసీజ్ లు వచ్చే ఛాన్స్ లు ఎక్కువ. వీటిల్లో ఎక్కువగా ఉండే శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల హార్ట్ డిసీజ్ లకు అవకాశాలు ఎక్కువ.

  • టైప్ 2 డయాబెటీస్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కి కారణమవుతుందట. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వస్తుంది.. అది డయాబెటిస్ ని డెవలప్ చేస్తుంది.
  • అల్సర్ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల.. తీవ్రమైన నొప్పితో కూడిన ఎసిడిటీ ఏర్పడుతుంది. స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్.. కారణంగానే ఎక్కువ అల్సర్స్ వస్తున్నట్లు అధ్యయనాలు నిరూపించాయి. పిజ్జా, చిప్స్, సాల్టెడ్ స్నాక్స్ వంటివి అల్సర్లకి ప్రధాన కారణం.
  • ఆకలి తగ్గిపోతుంది మామూలు ఆహారాల మాదిరిగా కాకుండా.. ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే ఆకలి తగ్గిపోతుంది. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి, జీర్ణం కాకుండా.. ఫాయిజనస్ గా మారుతుంది.
  • పోషకాలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి. కానీ.. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల.. ఎలాంటి పోషకాలు అందవు. దీనివల్ల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
  • ఒత్తిడి ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల హార్ట్, బ్లడ్, లివర్ వంటి రకరకాల వ్యాధులు వస్తాయి. అలాగే.. ఇది ఒత్తిడిని కూడా పెంచుతుంది. తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకునే వాళ్ల కంటే.. ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకునే వాళ్లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 





No comments:

Post a Comment