సాధారణ జుట్టు సమస్యల్లో ఆయిలీ హెయిర్ ఒకటి. మీరు రెగ్యులర్ గా తలస్నానం చేస్తున్నా, జుట్టు ఎప్పుడూ జిడ్డుగా కనబడుతుంటుందా ? తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఈ జిడ్డు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా కేశాల మీద ప్రభావం చూపుతుంది.
నూనె వల్ల జుట్టు మరింత మురికిగా, జిడ్డుగా కనబడేలా చేస్తుంది. అలాగే మరికొంత మందిలో జీన్స్, హార్మోనుల ప్రభావంతో పాటు, అసాధారణ ఆహారపు అలవాట్లు , ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా జుట్టు జిడ్డుగా మారే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా ఆయిలీ హెయిర్ జుట్టుకు సంబంధించిన చుండ్రు, జుట్టు చిట్లడం వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి జుట్టును మ్యానేజ్ చేయడం చాలా కష్టం. ఇలాంటి జుట్టు నిర్వాహణ కోసం ఒక సులభమైన, పవర్ఫుల్ హోం మేడ్ హెయిర్ మాస్క్ ను పరిచయం చేస్తున్నాం. ఇది ఆయిల్ జుట్టుకు ఉపయోగించి, ఆయిలీ హెయిర్ నునివారించుకోండి.
అలాగే తలలో ఉండే అదనపు నూనెను గ్రహిస్తాయి. ఈ పదార్థాలు యాంటీబ్యాక్టీరియల్ స్వభావం కలిగి ఉంటాయి. అందువల్ల ఇవి వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడతాయి. ఆయిలీ హెయిర్ ను నివారించుకోవడానికి ఇంట్లో మీరు ఉపయోగించాల్సిన ఒక ఎఫెక్టివ్ హోం మేడ్ హెయిర్ ప్యాక్. దీన్ని ఎలా తయారుచేయాలి, ఏఏ పదార్థాలు అవసరమవుతాయో తెలుసుకుందాం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...
పదార్థాలు:
గుడ్డు 1
ఉప్పు: 2 టేబుల్స్ స్పూన్లు
నిమ్మరసం 3 టేబుల్ స్పూన్లు
ఎలా ఉపయోగించాలి: *ముందుగా గుడ్డు సొన ఒక బౌల్లో తీసుకొని, అందులో నిమ్మరసం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. *ఇలా బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని తలకు మొత్తం అప్లై చేసి 10 నుంచి 15 నిముషాల వరకూ మసాజ్ చేయాలి. *తర్వాత షవర్ క్యాప్ తో తలను కవర్ చేయాలి. *ఇలా షవర్ క్యాప్ పెట్టుకొని అరగంట అలాగే ఉండి కొద్దిగా తడి ఆరిన తర్వాత మీకు నచ్చిన షాంపుతో తలస్నానం చేయాలి. *తర్వాత కండీషనర్ ను అప్లై చేయాలి. ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హెయిర్ మాస్క్ ను వారంలో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల క్రమంగా తలలో ఎక్సెస్ ఆయిల్ ను నివారిస్తుంది. మీ జుట్టు మరింత అందంగా కనబడేలా చేస్తుంది.
No comments:
Post a Comment