Tuesday, May 31, 2016

ఇంట్లో బొద్దింకలు బల్లులు ఉన్నాయా ?

ఇల్లు చూసి ఇల్లాలిని చేసుకోవాలనే నానుడి ఎక్కువగా వుంది. ఎందుకంటే ఇంటి శుభ్రత ఎక్కువగా ఇల్లాలికే తెలుసు, ఎక్కువ ఇల్లాలిపై ఆధారపడిపడి వుంటుంది. ఏ వస్తువు ఎక్కడ వుండాలి ఏది ఎంత శుభ్రంగా వుంచుకోవాలి అనే అంశంపై ఆధారపడి వుంటుంది.ఇంటిలోకి ధారాళంగా గాలీ, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఇంటిలో వీలైనంత వెంటిలేషన్‌ బాగా వుండేటట్లు చూసుకోవాలి. మురుగునీరు ఎప్పటికప్పుడు బైటికి ప్రవహించే విధంగా చూసుకోవాలి. కూరగాయలు మీద ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్త పడాలి. ఈగలు, దోమలు వాలిన పదార్థాలు తినటం వలన అనేక రకాల రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ వుంటుంది.

ఏ ఇల్లు అయినా సూక్ష్మజీవులు, బొద్దింకలు, చీమలు, బల్లులు, తేళ్ళు, జెర్రులు వంటివి కంటికి కనిపించే కీటకములు, ఈగలు, దోమలు వంటి వ్యాధి వ్యాపించే కీటకాలు ఇంటిలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. చాలా మంది బొద్దింకలన్నా, బల్లులన్నా విపరీతంగా భయపడుతుంటారు.సాలెపురుగులు, బొద్దింకలు, బల్లులు వంటి కొన్ని జంతువులను, సరీసృపాలను చూసినప్పుడు కొంతమందికి భయం కలుగుతుంటుంది. వారు పెద్దవారైనా సరే ఆ భయం వెంటాడుతూనే ఉం టుంది. లా భయపడే వాళ్లను చాలా మందిని మనం మన చుట్టుపక్క ల ఇళ్లలో గమనించే ఉంటాం. బొద్దికలు వచ్చిన తర్వాత వాటిని చూసి బయపడటం కన్నా, అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే భయం ఉండదు మరియు ఆరోగ్యకరమైన వాతరణం కలిగి ఉంటారు.

ఇల్లల్లో గోడ మీద తిరిగే బల్లులు ఒక రకంగా హెల్ఫ్ అవుతాయనే చెప్పాలి .

ఎందుకంటే ఇంట్లో క్రిములు, కీటకాలను ఇవి ఎప్పటికప్పడు తినేస్తుంటాయి. అయితే పరోక్షంగా మనకు సహాయపడినా..గోడ మీద అవి కనిపిస్తే చాలు బయపడుతుంటాము.అలాగే బొద్దింకలు, ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. ఇవి ఆహారాలను విషపూరితం చేస్తాయి. ఆహారాల మీద చేరినప్పుడు వాటీలాలాజలం కలుషితమై విషపదార్థంగా మారి వివిధ రకాలా వ్యాధులకు గురిచేస్తుంది. ఈ రెండు సరీసృపాలను ఇంట్లో ఉండకూడదనుకుంటే మనకు వెంటనే కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ అవసరం అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల క్రిమి సంహారిణిలు అందుబాటులో ఉన్నాయి .కానీ ఇవన్నీ హానికరమైన కెమికల్స్ తో తయారుచేయబడినవి మరియు టాక్సిక్ నేచుర్ ను కలిగి ఉన్నాయి . పిల్లులు మరియు పెంపుడు జంతువులన్న ఇల్లలో వీటిని ఉపయోగించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకోసం కొన్ని హోం రెమెడీస్ ను మీకు పరిచయం చేస్తున్నాము. ఇవి ఖరీదైనవి కావు. ఎకోఫ్రెండ్లీ తత్వం కలిగి ఈ కీటకాలను ఎఫెక్టివ్ గా నాశనం చేస్తాయి. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం...


1. ఎగ్ సెల్స్: బల్లులు ఎగ్ స్మెల్ కు ఆ చుట్టుపక్కలకు రాకుండా ఉంటాయి . కాబట్టి డోర్ దగ్గర్లో మరియు గోడల మీద మూలల్లో అక్కడక్కడ ఎగ్ సెల్ ను ఉంచండి . ఇవి ఇంట్లోకి రాకుండా తిరగకుండా ఎగ్ స్మెవ్ వాటిని కట్టడి చేస్తుంది.


2. వెల్లుల్లి: వెల్లుల్లి కూడా క్రిమినాశక పదార్థమే. ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన వాటిని రాకుండా చేస్తుంది. ముఖ్యంగా గార్లిక్ జ్యూస్ ను స్ప్రే బాటిల్లో వేసి ఇట్లో అప్పుడప్పుడ స్ప్రే చేస్తుండాలి . ఇలా చేయడం వల్ల బొద్దికలు మరియు బల్లులు ఇంటి చాయలకు రాకుండా ఉంటాయి.


3. కాఫీ బాల్స్ మరియు టుబాకో పౌడర్: కాఫీ పౌడర్ మరియు టుబాకో పౌడర్ ను మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసే అగ్గిపుల్ల లేదా టూత్ స్టిక్ కు గుచ్చి ఇంట్లో అక్కడక్కడ చెక్కిపెట్టాలి . వీటిని కప్ బోడ్స్ మరియు బల్లులు తిరిగే ప్రదేశంలోఉంచితే బల్లులనేవి కనబడవు .


4. ఉల్లిపాయలు: ఉల్లిపాయల్లో ఉండే ఘాటైన వాసన బొద్దికలను, బల్లులను నివారిస్తుంది . ఉల్లిపాయను జ్యూస్ చేసి స్ప్రే బాటిల్లో పోసి ఇంట్లో స్ప్రే చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే క్రిమికీటకాలు కనబడవు.

5.నాఫ్తలీన్ బాల్స్ : నాఫ్తలిన్ బాల్స్ బల్లుల్లను చుట్టు ఇంట్లో తిరగనివ్వకుండా చేస్తాయి . వీటిని కిచెన్ సెల్ఫ్స్ మరియు కప్ బోర్డ్స్ లో ఉంచుకోవచ్చు .

6. కాఫీ గింజలు: బొద్దికలను నివారించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి . కాఫీ విత్తనాలను కొన్నింటిని చిన్న చిన్న గిన్నెల్లో వేసి అక్కడక్కడా ఉంచాలి . దాంతో ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో బొద్దింకలు చేరకుండా ఉంటాయి.

7. బోరాక్స్ అండ్ షుగర్: మరో అమేజింగ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ బోరాక్స్ మూడు బాగాలు తీసుకొని అందులో ఒక బాగం షుగర్ మిక్స్ చేయాలి .బొద్దింకలున్న ప్రదేశంలో వీటిని ఉంచడం ద్వారా బొద్దింకలు నివారించబడుతాయి . కొన్ని గంటల్లోనే బొద్దింకలను దూరం చేస్తాయి.

8. బేకింగ్ సోడా మరియు షుగర్ : బోరాక్స్ ఉపయోగించడం మీకు సురక్షితం కాదు అనిపిస్తే, బేకింగ్ సోడా మరియు షుగర్ మిశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చు, ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి అక్కడక్కడ చిలకరించుకోవాలి . వీటిని బొద్దికలు తినడం వల్ల అవి చనిపోతాయి.

9. ఫ్యాబ్రిక్ సాప్ట్నర్స్ : ఈ స్ప్రేలో మూడు ఫ్యాబ్రిక్స్ , రెండు బాగాలు నీళ్ళు మిక్స్ చేయాలి. ఈ వాటర్ ను బొద్దింకల మీద చల్లడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

10. అమ్మోనియా మరియు వాటర్: అమ్మోనియం వాటర్ తో తరచూ ఇల్లు శుభ్రం చేస్తుంటే బొద్దింకలు, మరియు బల్లుల బెడదను నివారించుకోవచ్చు . రెండు కప్పులు అమ్మోనియంను ఒక బకెట్ వాటర్ లో మిక్స్ చేసి ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

No comments:

Post a Comment