Monday, February 15, 2016

టమోటాలో దాగి ఉన్న బ్యూటీ సీక్రెట్స్

కొంతమందిని పొగిడేటప్పుడు నీ బుగ్గలు ఎర్రగా టమోటాల్లా ఉన్నాయి అని కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంటాం. టేస్టీ, జ్యూసీ టమోటాలు చూడ్డానికే కాదు.. తినడానికి, అందానికి కూడా ఎట్రాక్టివే. ఎందుకంటే.. ఇందులో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి, అందానికి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తాయి.


ప్రతి ఒక్కరికీ సహాయపడే టమోటో హెల్త్ బెనిఫిట్స్ 
చాలా వరకు అన్ని రకాల వంటకాల్లో టమోటాలను ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమంది పచ్చివే తినడానికి కూడా ఇష్టపడతారు. ఇవి రక్తం ఉత్పత్తి చేయడంలోనూ, రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగపడతాయి. అయితే ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. మీ చర్మానికి కూడా హెల్త్ బెన్ఫిట్స్ చేకూర్చే సత్తా టమోటాల్లో దాగుంది.

టమోటో జ్యూస్ త్రాగడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్
టమోటాలను వండే సంగతి పక్కనపెడితే.. వీటిని రకరకాల పద్ధతుల్లో ఉపయోగించి మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. టమోటాలు తీసుకోవడం వల్ల హెల్తీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ పొందవచ్చు.

చర్మంపై గుంతలు :
నాలుగు చుక్కల టమోటా రసం, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు కలిపి దూదితో ముఖానికి పట్టించాలి. లేదా స్మూత్ గా ముఖంపై మసాజ్ చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ముఖంపై ఏర్పడిన గుంతలు మూసుకుపోతాయి.


గ్లోయింగ్ స్కిన్ :
టమోటాలు హెల్తీ డైట్ మాత్రమే కాదు.. ఇవి చర్మంపై చాలా వండర్స్ చేస్తాయి. టమోటా జ్యూస్ లేదా టమోటాలను నేరుగా ముఖంపై మసాజ్ చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే చర్మం హెల్తీగా నిగారిస్తుంది.

యాక్నే:
విటమిన్ ఏ, సి ఉండే ఆయింట్మెంట్స్, మెడిసిన్స్ ను యాక్నే నివారించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ ఎసిడిక్ కంటెంట్ ఉన్న టమోటాలు యాక్నేతో చాలా న్యాచురల్ గా పోరాడతాయి. ఎక్కువగా యాక్నే సమస్య ఉంటే.. టమోటా తొక్కు తీసి.. ముఖానికి అప్లై చేయాలి. గంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆయిల్ :
ముఖం ఆయిలీగా ఉంటే.. మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి మీది ఆయిలీ స్కిన్ అయితే.. 2 టమోటాల రసం, 4 టేబుల్ స్పూన్ల కుకుంబర్ రసం కలిపి.. ముఖానికి రోజూ టోనర్ లా ఉపయోగిస్తే.. ఆయిలీ స్కిన్ నుంచి బయటపడవచ్చు.

ఏజింగ్ :
చర్మంలో వయసు ఛాయలు కనిపించకుండా.. యంగ్ లుక్ సొంతం చేసుకోవడానికి టమోటాలు చక్కటి పరిష్కారం. కాబట్టి రెగ్యులర్ గా టమోటాతో ముఖానికి స్క్రబ్ చేయడం వల్ల ఏజింగ్ ను నిరోధించవచ్చు. Show Thumbnail

సన్ స్క్రీన్ లోషన్ :
అనేక అధ్యయనాల ప్రకారం టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి న్యాచురల్ సన్ స్క్రీన్ లోషన్ లా పనిచేస్తాయి. యూవీ రేస్ నుంచి టమోటా ద్వారా రక్షణ పొందవచ్చు.


బ్లీచింగ్ :
టమోటాలు న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తాయి. స్కిన్ టోన్ ని షైనింగ్ గా మార్చడానికి టమోటాలు చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. ఒక టీ స్పూన్ ఓట్ మీల్, ఒక టీ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే.. మీ చర్మంలో కొత్త మెరుపు వస్తుంది.

స్మూత్ స్కిన్ :
టమోటా రసం, తేనె కలిపి పేస్ట్ లా తయారు చేసుకుని.. ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మీ చర్మం స్మూత్ గా, గ్లోయింగ్ గా మారిపోతుంది.

మృతకణాలు :
చర్మాన్ని నిర్జీవంగా మార్చే మృతకణాలను టమోటాలు చాలా తేలికగా తొలగిస్తాయి. మిక్సీలో టమోటాలను బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. దానికి 1 టీస్పూన్ పంచదార కలిపి... ఫేస్ పై అప్లై చేసి.. గుండ్రంగా ముఖంపై మసాజ్ చేయాలి. లేదా టమోటాను కట్ చేసి.. షుగర్ లో అద్ది స్క్రబ్ లా ఉపయోగించినా సరిపోతుంది. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.




No comments:

Post a Comment