మీరు రోజు ప్రారంభించే దాన్ని బట్టి.. రోజంతా ఆధారపడి ఉంటుంది. రోజు ఆరంభించేటప్పుడు మీరు హెల్తీగా, హ్యాపీగా ఉంటే.. పూర్తీ రోజంతా ఎలా గడుపుతారనే దానిపై ప్రభావం ఎలా ఉంటుందో గమనించవచ్చు. రోజుని మీరు సరైన పద్ధతిలో ప్రారంభించడానికి కొన్ని విషయాలు సహాయపడతాయి.
ప్రస్తుతం చాలా మంది నిద్రలేస్తూనే చేసే పని ఫోన్ చూసుకోవడం. ఉదయాన్నే ఇలాంటి అన్ హెల్తీ హ్యాబిట్ మీ మూడ్ తో పాటు, మీ ఆరోగ్యంపైన కూడా దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి నిద్రలేచేటప్పుడు ఫాలో అయ్యే అలవాట్లు మీ రోజుని అద్భుతంగా మారుస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ నిద్రలేచేటప్పుడు అంటే ఉదయం తొమ్మిది గంటల లోపు చేసే పొరపాట్లు ఏంటి ? ఎలాంటి అలవాట్లు హెల్తీ అండ్ హ్యాపీ మూడ్ తీసుకొస్తాయి..?
నిద్రలేచేటప్పుడు మీ పిల్లలను స్కూల్ కి పంపాలి, బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయాలి అన్న తొందరలో.. బెడ్ రూమ్ నుంచి డైరెక్ట్ గా వంట గదిలోకి పరుగుపెడుతున్నారా ? అది అతి పెద్ద పొరపాటు. ఉదయం నిద్రలేవగానే.. శరీరానికి కాస్త రెస్ట్ అవసరం. కాబట్టి ఒక్కసారి శరీరాన్ని వెనక్కి వంపి.. సేద తీర్చాలి.
శరీరం కళ్లు తెరవగానే ఫ్లోర్ పై కాళ్లు పెట్టడం వల్ల వెన్నెముక కండరాలు దెబ్బతింటాయి. అలాగే బ్లడ్ కాళ్లకు చేరిపోయి.. నొప్పికి కారణమవుతాయి. కాబట్టి కళ్లు తెరిచిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వండి. నిద్రలేచిన వెంటనే శరీరాన్ని అన్ని డైరెక్షన్స్ లో స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే రక్త ప్రసరణ శరీరమంతా వ్యాపించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఆకలి పనుల్లో నిమగ్నమై..
ఆకలిగా లేదంటూ చాలామంది రోజులో చాలా ముఖ్యమైన బ్రేక్ ఫాస్ట్ ని మానేస్తుంటారు. లేదా ఇతర పనులు చేస్తూ.. గాబరా ఏదో కొంచెం తినేస్తుంటారు. కానీ నిద్రలేచిన తర్వాత మెటబాలిజం స్లోగా ఉంటుంది. అది రీస్టార్ట్ అవ్వాలంటే శక్తి అవసరం. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ సరైన దారిలోకి రావాలంటే.. ఆహారం అవసరం.
బ్రేక్ ఫాస్ట్
నిద్రలేచిన తర్వాత 45 నిమిషాల నుంచి గంటలోపు ఏదో ఒకటి తీసుకోవాలి. ఎగ్స్, ఫ్రూట్ బౌల్, పాలు, నట్స్ ఇలా ఏదో ఒకటి తినడం చాలా ముఖ్యం. అలాగే ఉదయాన్నే పరకడుపున 2 నుంచి 3 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీకోసం కాస్త సమయం ఉదయం లేవగానే ఫోన్ చూసి మెయిల్స్ చెక్ చేసి, రిప్లై ఇచ్చేసి, పిల్లలను స్కూల్ కి పంపించి, రెడీ అవడం, హడావుడిగా బ్రేక్ ఫాస్ట్ చేయడం.. ఇలా ఫుల్ హైరానా పడుతూ.. రోజుని ప్రారంభించేస్తున్నారా ? ఇలా గాబరాగా అన్ని పనులు చేసేసి ఆపీస్ కి వెళ్తే మధ్యానానికి మీ స్టామినా పడిపోవడం ఖాయం. ఇది సరైన అలవాటు కాదు.
ఏం చేయాలి ?
ఉదయం నిద్రలేవగానే కాసేపు మీకోసం టైం స్పెండ్ చేయండి. లాంగ్ వాక్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్, రీడింగ్.. ఇలా ఏదో ఒక అలవాటుకి కొంచెం టైం కేటాయించండి.
అలారమ్
చాలా మందికి అలారమ్ ను రెండు నిమిషాలు, ఐదు నిమిషాల తేడాతో అంటే.. 6:30, 6:45, 6:50.. ఇలా పెట్టుకోవడం అలవాటు ఉంటుంది. కానీ.. ఇలా పెట్టుకోవడం మంచిది కాదని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
ఏం చేయాలి ?
మీరు ఏ సమయానికి లేవగలరో ఆ సమయానికి అలారమ్ పెట్టుకోవడం, అలారమ్ మోగిన వెంటనే లేచే విధంగా శరీరానికి మైండ్ సెట్ చేయడం చాలా అవసరం. అలారం మోగిన వెంటనే లేని.. బెడ్ పైనే శరీరానికి స్ట్రెచ్ ఇవ్వండి. డీప్ బ్రీత్ ఇవ్వండి. ఇలా రోజు ప్రారంభించి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది.
వ్యాయామం
వ్యాయామం చేయడానికి ఉదయం సరైన సమయం. కానీ కొంతమంది ఉదయం నిద్రలేవడానికి బద్ధంగా అనిపించి.. సాయంత్రం పూట వ్యాయామాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. రాత్రి పూటే వ్యాయామానికి లేదా జాకింగ్ కి సంబంధించి క్లాత్స్ తీసిపెట్టుకోవాలి. ఉదయం లేవగానే.. వ్యాయామం చేయండి. దీనివల్ల రోజంతా యాక్టివ్ గా, హెల్తీగా, హ్యాపీగా ఉంటారు.
మంచి టిప్స్ ఇచ్చారు థాంక్స్
ReplyDelete