Friday, May 13, 2016

ఎండల్లోనూ ముఖం మెరిసిపోయే మార్గం ఉందా

ఏంజిల్ లుక్ సొంతం చేసుకోవడానికి న్యాచురల్ సొల్యూషన్స్ కోసం వెతుకుతున్నారా ? గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ పొందడానికి టమోటా, కుకుంబర్ మంచి పరిష్కారం. ఈ రెండూ.. స్కిన్ ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.



సాధారణంగా ఫేస్ లో గ్లో రావడానికి ఫేషియల్స్ లేదా ఫేస్ ప్యాక్ లు వేసుకుంటూ ఉంటారు. అయితే ఫేషియల్స్ అంటే ప్రతి సారి చేయించుకోవడానికి డబ్బుతో కూడిన పని. కాబట్టి.. ఫేస్ ప్యాక్ లను ఇంట్లోనే తయారు చేసుకుని వేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అయితే న్యాచురల్ గ్లో పొందడానికి, చర్మంలో ప్రకాశం ఎక్కువ సమయం ఉండటానికి కుకుంబర్, టమోటా ఫేస్ ప్యాక్ లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని బ్యూటీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.


కుకుంబర్:
చర్మానికి అనేక ప్రయోజనాలు చేకూర్చే గుణం కుకుంబర్ లో ఉంటుంది. చర్మానికి సూతింగ్ ఎఫెక్ట్ ఇవ్వడంతో పాటు, అనేక చర్మ సమస్యలను మాయం చేస్తుంది. యాక్నె, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, ట్యాన్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, కళ్లకింద నల్లటి వలయాలు.. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టే సత్తా.. కుకుంబర్ లో దాగుంది. అలాగే ఇందులో లభించే సిలికా.. ముడతలను నివారించడానికి సహాయపడి.. యంగ్ లుక్ అందిస్తుంది.

యాక్నె:
కుకుంబర్, ఎగ్ వైట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం, పసుపు, కొద్దిగా నిమ్మరసం తీసుకుని.. అన్నింటినీ.. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించడం వల్ల యాక్నె నివారించడంతో పాటు, ఆయిలీ స్కిన్ నివారించవచ్చు.



ఓట్స్ ఫేస్ ప్యాక్:
ఒక కుకుంబర్, రెండు టీ స్పూన్ల తేనె, 4 టీ స్పూన్ల పచ్చి పాలు లేదా పెరుగు, ఒక కప్పు ఓట్స్ కలిపి అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించడం వల్ల.. చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.


రిలాక్సేషన్:
కుకుంబర్, నిమ్మ, తెనె, పుదీనా ఆకులు తీసుకున.. అన్నింటినీ పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మానికి రిలాక్స్ గా అనిపిస్తుంది.

టమోటా:
టమోటా ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల.. గ్లోయింగ్ అండ్ యంగర్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.

సన్ డ్యామేజ్:
ఒకటి లేదా రెండు ఫ్రెష్ టమోటాలు తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా ఓట్ మీల్ మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేసి.. 5 నుంచి 10 నిమిషాలు అలానే వదిలేసి.. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ సన్ డ్యామేజ్ అయిన చర్మాన్ని క్యూర్ చేయడంతో పాటు, గ్లోయింగ్ అందిస్తుంది.



యాక్నే:
యాక్నే నివారించడానికి టమోటా ఫేస్ ప్యాక్ అద్భుత ఫలితాలిస్తుంది. టమోటా గుజ్జు తీసుకుని ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఫేస్ కి అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల యాక్నె తొలగించడంతో పాటు, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ని కూడా అరికట్టవచ్చు.

ప్రకాశవంతమైన చర్మానికి :
ఒక టేబుల్ స్పూన్ చందనం, టమోటా రసం, నిమ్మరసం తీసుకుని.. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మీ చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.

టమోటా, దోసకాయ ఫేస్ ప్యాక్:
ట్యాన్డ్ స్కిన్ ఉన్న వాళ్లకు ఈ ఫేస్ట ప్యాక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టమోటా జ్యూస్, దోసకాయ జ్యూస్ రెండూ సమానం తీసుకుని.. ట్యాన్ ఉన్న దగ్గర అప్లై చేయాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చర్మంపై ట్యాన్ తొలగిపోయి.. ప్రకాశవంతంగా మారుతుంది.



No comments:

Post a Comment