Saturday, October 31, 2015

వీణా - వాణీల పరిస్థితి అంతేనా? స్పందించని ఎయిమ్స్.. చలనం లేని రాష్ట్ర సర్కారు?

అవిభక్త కవలలు వీణా-వాణీ (13)లు పడుతున్న నకరయాతన నుంచి స్వేచ్ఛాజీవితం ప్రసాదించడం ఓ కలగానే మిగిలిపోయేలా ఉంది. ఈ కవల పిల్లలకు చేయాల్సిన ఆపరేషన్‍‌‌పై స్పష్టత కరువైంది. దీనికి ప్రధాన కారణం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఓ కారణం కాగా, తెలంగాణ రాష్ట్ర సర్కారు మరోకారణంగా ఉంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
 
ఈ అవిభక్త కవలలకు శస్త్రచికిత్స చేసేందుకు లండన్‌ వైద్యులు ముందుకు వచ్చారు. అయితే, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ సంస్థకు అప్పగించింది. ఆ సమయంలో ఎయిమ్స్ వైద్యులు... లండన్ డాక్టర్లను ఢిల్లీకి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. 
 
అయితే, ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుపై స్పష్టత కోరుతూ ఎయిమ్స్‌కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం... శస్త్రచికిత్స కోసం లండన్ వైద్యులు ఢిల్లీకి వచ్చేందుకు ముందుకొస్తారో లేదో తెలుసుకోవాలని కోరింది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి 5 నెలలు దాటింది. ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఇదే అంశంపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలను ఆరా తీస్తే... ఆపరేషన్ చేయించే విషయంలో ఎయిమ్స్ చేతులెత్తేసినట్టుగా ఉందని పేర్కొంటున్నాయి.

No comments:

Post a Comment