Tuesday, March 1, 2016

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా...?

యూత్ ని ఎక్కువగా ఇబ్బందిపెడుతున్న సమస్య డాండ్రఫ్. దీన్ని నివారించుకోవడానికి యువకులు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ.. ఎన్ని షాంపూలు, హెయిర్ మాస్క్ లు ఉపయోగించినా.. ఫలితం కనిపించదు. కాలుష్యం, ఒత్తిడి, తలలో జిడ్డు తనం వంటి సమస్యల కారణంగా ఎక్కువగా చుండ్రు సమస్య వస్తుంది. 

చుండ్రు ఎక్కువగా ఉంటే.. జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ ఫాలో సమస్య ఎదురవుతుంది. కాబట్టి చుండ్రు నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అలోవెరా. చుండ్రుకి చెక్ పెట్టడంతోపాటు.. జుట్టుకి మంచి పోషణను అందించి.. మెరిసిపోయేలా చేస్తుంది. రోజూ అలోవెరా హెయిర్ ప్యాక్స్ ట్రై చేసి చూడండి.. చుండ్రు సమస్య తగ్గి మీ జుట్టు ఎలా మెరిసిపోతుందో. అలోవెరాను చుండ్రు నివారించడానికి ఉపయోగించే పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం..

అలోవెరా, పెరుగు 2 టీస్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అరకప్పు పెరుగులో కలపాలి. అలోవెరా జెల్ కానీ, అలోవెరా ఆకుల నుంచి తీసిన గుజ్జు కానీ ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు జుట్టుకి అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా, మెంతులు మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. 2 లేదా 3 స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని, 2 స్పూన్ల మెంతుల పేస్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ఫ్ కి అప్లై చేసి.. కాసేపటి తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు క్రమంతప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా, టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఇది చుండ్రు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 4 స్పూన్ల అలోవెరా జెల్ కి, 10 చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి.. స్కాల్ఫ్ కి పట్టించాలి. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా, నిమ్మరసం అలోవెరా ఆకుల నుంచి జెల్ తీయాలి. అందులో సగం నిమ్మచెక్క రసం తీసి కలపాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. స్కాల్ఫ్ కి పట్టించాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా, వెల్లుల్లి 5 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కి, 2 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు కలపాలి. రెండింటినీ పేస్ట్ లా తయారు చేసి.. స్కాల్ప్ కి పట్టించాలి. 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ టిప్ ట్రై చేస్తే చుండ్రు వదిలించవచ్చు.

అలోవెరా, కొబ్బరినూనె అలోవెరా ఆకుల నుంచి తీసిన అలోవెరా జెల్ కి, కొబ్బరినూనె కలపాలి. రెండింటినీ మిక్స్ చేసి.. తక్కువ మంటపై 20 నుంచి 30 నిమిషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత స్కాల్ఫ్ పై కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. గంట, రెండు గంటల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చుండ్రు నివారించవచ్చు.

అలోవెరా జెల్ తీసుకుని.. స్కాల్ఫ్ కి అప్లై చేయాలి. తలపై మసాజ్ చేసి.. గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ ని తలకు చుట్టాలి. కొన్ని నిమిషాలు అలానే వదిలేసి.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.


No comments:

Post a Comment