Saturday, April 23, 2016

గ్రీన్ ఫుడ్స్ తింటే... బరువు తగ్గుతారట..!

బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మంది ఒక డిసీజ్ గా ఫీలవుతారు. ముఖ్యంగా చాలా మంది నడుము చుట్టుూ ఉండే ఎక్స్ ట్రా ఫ్యాట్ అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మనం రెగ్యులర్ గా తీసుకొనే ఫుడ్స్ లో గ్రీన్ ఫుడ్స్ ది బెస్ట్ ఫుడ్స్ గా ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గించుకొనే వారికి ఈ గ్రీన్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. 

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో గ్రీన్ ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల 90శాతం మెటబాలిజం రేటు పెరుగుతుందని, 93శాతం వ్యాధినిరోధకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు ఈ గ్రీన్ ఫుడ్స్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే చాన్సెస్ ఉండవు. 

మీరు అధిక బరువుతో విసుగు చెందుతున్నా , మీ బరువు మీకు అసౌకర్యంగా , ఇబ్బందికలిగిస్తున్నా...వెంటనే మీ లైఫ్ స్టైల్లో మరియు డైట్ లో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన గ్రీన్ ఫుడ్స్ బరువు తగ్గించడం మాత్రమే కాదు , ఇవి న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి . బరువు తగ్గించడంలో శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి. 

ఇంకా ఈ గ్రీన్ ఫుడ్స్ వల్ల బరువు తగ్గించుకొనే క్రమంలో మీ శరీరానికి కావల్సిన ఎనర్జీ లెవల్స్ ను ఎక్కువగా అందిస్తాయి . మరి ఇంకెందుకు ఆలస్యం ? మీ లోయర్ బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి కొన్ని గ్రీన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి . నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ గ్రీన్ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకోవడంతో పాటు కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి . 

వాక్ చేయడం, లేదా 20 నిముషాలు రన్నింగ్ చేయడం వల్ల మీ శరీరం ఫిట్ గా మరియు హెల్తీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ ఫుడ్స్ ఫాలో అవుదాం..

బరువు తగ్గించే గ్రీన్ ఫుడ్స్


గ్రీన్ పెప్పర్: గ్రీన్ పెప్పర్ లేదా క్యాప్సికమ్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఈ గ్రీన్ ఫుడ్స్ విటిమన్ సి అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్యాట్ బర్న్ అవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది.



గ్రీన్ ఆపిల్: సహజంగా ఎర్రగా ఉండే ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మనం అనుకుంటాం కాదా? అయితే రెడ్ ఆపిల్ కంటే గ్రీన్ ఆపిల్లో చాలా తక్కవ క్యాలరీలుండటం చేత ఆరోగ్యానికి మరింత బెటర్ గా సహాయపడుతుంది.


గ్రీన్ చిల్లీస్: స్పైసీఫుడ్ శరీరానికి మంచిదే . స్పైసీస్ ఎక్కువగా తినడం వల్ల , అంతే విదంగా బరువు తగ్గించుకోవచ్చు . స్పైసీ ఫుడ్స్ బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది. అదే విధంగా లోయర్ బెల్లీని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.


గ్రీన్ బీన్స్: గ్రీన్ బీన్స్ లో ఫైబర్ మరియు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి . ఈ గ్రీన్ ఫుడ్స్ ను వారంలో రెండు తీసుకోవడం చాలా ఫర్ఫెక్ట్ గా భావిస్తాము . బాగా ఉడికించిన బీన్స్ ను తినడం వల్ల బరువు తగ్గుతారు.


బ్రొకోలీ: బ్రొకోలీ తినడానికి అందరూ ఇష్టపడరు, కానీ విటమిన్ కె వెజిటేబుల్స్ చాలా హెల్తీగా మరియు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి . బ్రొకోలీ శరీరానికి చాలా మేలు చేస్తుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది. క్యాన్సర్ దూరం చేస్తుంది.

ఆకుకూరలు: గ్రీన్ లీపీ వెజిటేబుల్స్ లో విటమిన్ మరియు ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో అతి తక్కువ క్యాలరీలుంటాయి . ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ ఫుడ్.

గ్రీన్ క్యాబేజ్: క్యాబేజ్ సూప్ గురించి మీరు వినే ఉంటారు. బాయిల్ చేసి క్యాబేజ్ సూప్ ను రెండు వారాలకొకసారి తీసుకోవడం మంచిది . మీరు త్వరగా బరువు తగ్గించుకోవాలంటే జీర్ణశక్తికి ఇది చాలా మేలు చేస్తుంది.

No comments:

Post a Comment