Thursday, April 21, 2016

ప్రొద్దున్నే ఆ ఒక్క పని చేస్తే చాలు.. రోజంతా ఉల్లాసమే

జీవితం అంటే పొద్దున్నే ఆరాటంగా లేవటం..మన వాళ్లకోసం హాడావిడిగా పరుగులు పెట్టడం కానే కాదు. ఇలా చేసేవారు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. కాని మనం నిద్ర లేచిన పద్దతిబట్టే ఆ రోజు ఆధారపడి ఉంటుందట. కాదని ఆదరాబాదరగా రోజును మొదలుపెడితే చేయ‌బోయే ప‌నుల‌పై ప్రభావం ఉంటుందని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. రోజూ మన జీవితంలోకి తూర్పు కిరణాలతో సూర్యుడు ఉత్సాహంగా గుడ్ మార్నింగ్ చెప్పినట్టుగా మనం అంతే ఉత్సాహంగా ఉండాలి. మరి దానికోసం ఇలా చేయండి. ఉత్సాహ‌వంత‌మైన వెలుగునే మీ మ‌న‌సులో నింపుకోండి.


  • పొద్దున్నే మేల్కోగానే ఫోన్లలో మాట్లాడడం, ఇమెయిల్స్‌ చెక్‌ చేయకండి.ఇవి కొన్నిసార్లు మూడ్‌ని పాడుచేస్తాయి.
  •  నిద్రలేవ‌గానే ఓ జోక్ చ‌ద‌వ‌డం, అద్దంలో మీ ముఖం చూసుకొని బ‌ల‌వంతంగానైనా 20సెక‌న్లు న‌వ్వండి. 
  • లేవగానే మీ ఇంట్లో వారికి గుడ్ మార్నింగ్ చెప్పడం వంటివి చెయ్యండి.
  • నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాస‌క్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది. 
  • రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది. 
  • పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచి, శ‌రీరాన్ని స్ట్రాంగ్ అండ్ ఫిట్ గా ఉంచుతాయి. మ‌న‌కు కొండంత ఎన‌ర్జీని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతాయి.. 
  • ప్రతీ రోజు నిద్రలేచే స‌మ‌యం క‌న్నా మ‌రో గంట ముందుగా నిద్రలేచే అల‌వాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కోవ‌డం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది. 
  •  నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయ‌డం మీ అల‌వాట్లో లేక‌పోతే, ఆ అల‌వాటును అల‌వ‌రుచుకోండి. 
  • రోజు హాయిగా ఉండడానికి ఉద‌యం పూట మెలోడీ, భక్తి సంగీతం వినడం మంచిది. సంగీతం మ‌న‌లో చైతన్యం పెంచుతుంది.‎ అంతేకాకుండా మ‌న మూడ్ రొటీన్‌గా ఉండ‌కుండా సంగీతం సాయం చేస్తుంది.

No comments:

Post a Comment