హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కావడం వల్ల ఈ రోజుని ఉగాదిగా భావిస్తారు. కొత్త జీవితం ప్రారంభించడమనే అర్థం ఇందులో మిలితమై ఉంది. అలాగే ఉగాది అంటే కొత్త తెలుగు సంవత్సరం ( క్యాలెండర్ ) ప్రారంభమవుతుందని సూచిస్తుంది. అందుకే ఉగాది రోజు దేవాలయాల్లో పంచాగ శ్రవణం చదివి వినిపిస్తారు. ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో జరుపుకుంటారు. ఉగాది అనేది యుగ, ఆది అనే పదాల నుంచి వచ్చింది. అంటే.. కొత్త శకం ప్రారంభమని అర్థం వస్తుంది. అందుకే ఈ పండుగను ఉగాది అని పిలుస్తారు.
కొత్త సంవత్సరానికి గుర్తుగా.. మొదటి కాపుకి వచ్చిన వాటితో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడికాయలు, వేప పూత, మిరియాలు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి పధార్థానికి ఒక విశిష్ఠత ఉంది. బెల్లం సంతోషానికీ, వేప దు:ఖానికి ప్రతీకలు. జీవితంలో సుఖాలనూ, దు:ఖాలనూ, సమభావంతో చూడాలన్నదే ఇందులోని అంతరార్థం. వేపపువ్వు దేహదారుఢ్యాన్ని కలిగించి సర్వారిష్టాలను తొలగించి పూర్ణాయుష్షును ప్రసాదిస్తుంది. కాబట్టి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి.
అయితే ఉగాదిని ప్రతి ఏడాది జరుపుకుంటాం. ఒక్కో సంవత్సరం, ఒక్కో పేరుతో ఉగాదిని పిలుస్తారు. ఇలా ఉగాదికే ఎందుకు ఈ ప్రత్యేకత ? ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎందుకు వచ్చింది ? అంటే.. పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే.. ఈ తెలుగు సంవత్సరాలట. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో.. ప్రతి ఉగాదికి అవే పేర్లుగా మారిపోయాయి. ఈ ఏడాది వస్తున్న ఉగాది పేరు దుర్ముఖి నామ సంవత్సరం. ఇప్పుడు ఆయా ఉగాది సంవత్సరాలు, వాటి అర్థాలు..
- దుర్ముఖి నామ సంవత్సరానికి అర్థం ఏంటి ? ప్రభవ. ఈ పేరుకి అర్థం ఎక్కువగా యజ్ఞయాగాలు అని అర్థం. విభవ నామ సంవత్సరం అంటే.. ప్రజలకు సుఖసంతోషాలు అని అర్థం వస్తుంది.
- శుక్ల నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా పంటలు పండాలని సంకేతం. అలాగే ప్రమోద్యూత నామానికి అందరికీ ఆనందం అని అర్థం వస్తుంది.
- ప్రజోత్పత్తి నామ సంవత్సరం అంటే.. అన్నింటా అభివృద్ధి చెందాలని సూచిస్తుంది. ఆ తర్వాత వచ్చే అంగీరస నామ సంవత్సరానికి భోగభాగ్యాల సిద్ధి అని అర్థం ఉంది.
- శ్రీముఖ నామ సంవత్సరం అంటే వనరులు సమృద్ధిగా అందాలని చెబుతుంది. ఆ తర్వాత వచ్చే భావ నామ సంవత్సరానికి సద్భావనలు, ఉన్నత భావనలు కలిగి ఉండాలని అర్థం.
- యువ నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలతో ప్రజలు సుఖంగా ఉండాలని తెలుపుతుంది. ధాత నామ సంవత్సరం అనారోగ్యబాధలు తగ్గుతాయని ఆశీర్వదిస్తుంది.
- ఈశ్వర నామ సంవత్సరం అంటే.. క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బాహుధాన్య నామ సంవత్సరం దేశమంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని చెబుతుంది.
- ప్రమాది నామ సంవత్సరం అంటే.. వర్షాలు మధ్యస్థంగా ఉంటాయని తెలుపుతుంది. విక్రమ నామ సంవత్సరానికి సమృద్ధిగా పంటలు, విజయాలు సాధిస్తారనే అర్థం ఉంది.
- వృష నామ సంవత్సరానికి సమృద్ధిగా వర్షాలు పడతాయని అర్థం ఉంది. ఆ తర్వాత వచ్చే చిత్రభాను నామం సంవత్సరం అంటే.. అంచనాలకు అందని ఫలితాలు పొందుతారని అర్థం.
- స్వభాను నామ సంవత్సరం అంటే.. ప్రజలకు క్షేమం, ఆనందం, ఆరోగ్యం అందుతాయని అర్థం. తారణ నామ సంవత్సరం అంటే.. సరైన సమయంలో సకాల వర్షాలు కురుస్తాయని అర్థం.
- పార్థివ నామ సంవత్సరం అంటే.. ఐశ్వర్యం, సంపదలు ఎక్కువగా ఉంటాయని అర్థం. ఆ తర్వాత వచ్చే వ్యయ నామ సంవత్సరానికి అతివృష్టి, అధికఖర్చు అని అర్థం వస్తుంది.
- సర్వజిత్ నామ సంవత్సరం అంటే.. సంతోకరంగా వర్షాలు వస్తాయని అర్థం. సర్వధారి సంవత్సరం అంటే.. దేశం సుభిక్షంగా ఉండాలనే అర్థం వస్తుంది.
- విరోధి నామ సంవత్సరం అంటే.. వర్షాలు తగ్గుముఖం పడతాయని అర్థం. అలాగే వికృత నామ సంవత్సరం అంటే.. అశుభ ఫలితాలని అర్థం ఉంది.
- ఖర నామ సంవత్సరం అంటే.. సామాన్య పరిస్థితులు అని అర్థం. ఆ తర్వత వచ్చే నందన నామ సంవత్సరానికి ప్రజలకు ఆనందం కలుగుతుందనే అర్థం వస్తుంది.
- విజయ నామ సంవత్సరానికి శత్రుజయమని అర్థం. అలాగే జయ నామ సంవత్సరానికి కార్యసిద్ధి, ప్రజలకు లాభం కలుగుతుందని సూచిస్తుంది.
- ఇక మన్మధనామ సంవత్సరానికి భోగభాగ్యాలు, ఆరోగ్యం అనే అర్థం ఉంది. ఇక ఈ ఏడాది వస్తున్న దుర్ముఖి నామ సంవత్సరానికి ఇబ్బందులు ఉన్నా క్షేమకర ఫలితాలు పొందుతారని సూచిస్తుంది.
- హేవళంబి నామ సంవత్సరానికి ప్రజలకు ఆనందం, విళంబి నామ సంవత్సరానికి సుభిక్షంగా ఉంటారనే అర్థం వస్తుంది.
- వికారి నామ సంవత్సరం అంటే.. శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తుంది. శార్వరి నామ సంవత్సరం అంటే.. సామాన్యంగా పంటల దిగుబడి ఉంటుందని సూచిస్తుంది.
- ప్లవ నామ సంవత్సరం అంటే.. సమృద్ధిగా నీటి వనరులు అందుతాయని తెలుపుతుంది. శుభక్రుతు నామ సంవత్సరం అంటే.. ప్రజలకు ఆనందం అని సూచిస్తుంది.
- ఆ తర్వాత వచ్చే శోభక్రుతు నామ సంవత్సరానికి ప్రజలకు సుఖ సంతోషాలు అందుతాయని సూచిస్తుంది. క్రోధి నామ సంవత్సరానికి కోపస్వభావంతో సామాన్యఫలాలు పొందుతారని అర్థం ఉంది.
No comments:
Post a Comment