Monday, April 4, 2016

హెయిర్ సమస్యలకు చెక్ పెట్టె ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం జుట్టుకి చాలా మంచిది, చాలా అద్భుతమైనదని పరిగణించవచ్చు. ఉల్లిపాయ రసాన్ని చిక్కని పేస్ట్ లా చేయండి, దీనిని పొడి జుట్టు (నూనె లేని జుట్టుకు) అప్లై చేసి, కనీసం అరగంట ఆరనివ్వండి, తరువాత గోరువెచ్చని నీటితో, ఇంట్లో తయారుచేసిన లేదా తక్కువ గాఢత కలిగిన షాంపూ తో తలస్నానం చేయండి. జుట్టుకి ఉల్లిపాయ రసం వాడడానికి కారణం ఏమిటంటే, దీనిలో ఉన్న ఘాటు లక్షణాలు జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

అధ్యయనాల ప్రకారం, ఎవరైతే జుట్టుకు ఇతర సహజ పదార్ధాలతో పాటు ఉల్లిపాయ రసాన్ని కూడా వాడతారో, నెలలోపే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. జుట్టు ఊడిపోవడం వల్ల కొంచెం బాధగానే ఉంటుంది, ప్రత్యేకంగా అది విపరీతంగా ఉన్నపుడు. మీ అందం తగ్గిపోతుంది, మిమ్మల్ని చూసుకుని మీరే అభద్రతకు లోనౌతారు. ఈ సమయాలు అన్నిటికీ పరిష్కారం ఉల్లిపాయ రసం. ఈ రసం నెరిసిన జుట్టును నల్లగా మారుస్తుంది, జుట్టు నేరవదాన్ని అరికడుతుంది కూడా.

మరోవైపు, జుట్టు మెరుస్తూ, కళ్ళు తిప్పకుండా చూడాలి అనిపిస్తుంది. అందువల్ల, ఒక్క నెలలో మీ జుట్టులో మార్పు కనిపించాలి అనుకుంటే, ఉల్లిపాయ రసం ఉపయోగించే 7 మార్గాలు ఇవ్వబడ్డాయి. జుట్టు బాగా కనిపించడానికి ఉల్లిపాయ రసంతో పాటు ఇతర పదార్ధాలను కలిపి చేసే 7 మార్గాలపై మీరు ఎందుకు దృష్టి పెట్టకూడదు.



కేవలం రసం: ఒక అచిన్న బౌల్ లో, తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా నీరు కలపండి. ఉల్లిపాయలను నీటిలో ఉడికించండి. మెత్తబడ్డాక, నీరు వడకట్టి, ఆ నీటి ద్రవాన్ని మీ మాడుకి మర్దనా చేసి, బాగా జుట్టు పెరగడానికి ముడి కట్టండి. ఒక గంట తరువాత, ఆ గాఢమైన వాసన పోవడానికి షాంపూతో జుట్టు కడగండి.



తల స్నానం తరువాత: తన స్నానం తరువాత, ఉల్లిపాయ రసంతో కడగండి. ఆ రసం మాడుకు పట్టేదాకా వదిలేయండి, తరువాత గోరువెచ్చని నీటితో, ఇంట్లో తయారుచేసిన షాంపూ తో జుట్టును కడగండి. ఇంట్లో తయారుచేసిన రసంతో తన స్నానం చేస్తే మీ జుట్టు బాగా మెరుస్తుంది.



ఆ రసాన్ని కొబ్బరి నూనెతో కలపడం: కొబ్బరి నూనె కూడా జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. జుట్టు పెరుగుదల మెరుగుపరుచుకోవడానికి, గోరువెచ్చని కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని కలపండి, ఈ రెంటినీ బాగా కలిపి, మాడుకు, జుట్టు చివరలకు బాగా అప్లై చేయండి. ఇలా ఒక గంట ఉంచి, కడిగేయండి.


రమ్ కలపడం: ఒక బౌల్ లో ఉల్లిపాయ రసం తీసుకుని, చిన్న మంటపై వేడిచేయాలి. ఈ ఉల్లిపాయ రసంలో 60ml రమ్ కలపండి. ఈ రెండు గాఢమైన పదార్ధాలను కలపండి, ఈ ద్రవంతో జుట్టును కడగండి. మీ జుట్టు వాసన అద్భుతంగా, తాజాగా ఉండడమే కాకుండా మీ జుట్టు పొడవు కూడా బాగా పెరుగుతుంది.




కొద్దిగా తేనె తో ప్రయత్నించండి: తేనె కూడా శక్తివంతమైన పదార్ధం, గాఢమైన ఒక కప్పు ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనెను కలపండి. తేనెను జుట్టుపై అప్లై చేయడం వల్ల అది బాగా మెరుస్తుంది, బలం పెరుగుతుంది, దాంట్లో ఉన్న ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.


ఆలివ్ ఆయిల్ గురించి: కొబ్బరి నూనె తరువాత వరుసలో వచ్చేది ఆలివ్ ఆయిల్. ఒక వరస ఆలివ్ ఆయిల్ ని మీ జుట్టుకు పట్టించండి. 15 నిమిషాల తరువాత, ఉల్లిపాయ రసంతో జుట్టును తడపండి. మాడుపై ఆరే వరకు ఉంచండి. 10 నిమిషాల తరువాత, మీ జుట్టును షాంపూ, గోరువెచ్చని నీటితో కడగండి. ఆలివ్ ఆయిల్ జుట్టు కుదుళ్ళకు పట్టడం వల్ల జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

బీర్ తో జతచేయండి: బీర్ జుట్టు కుదుళ్ళు గట్టిపడడానికి ఉపయోగించే ప్రసిద్ధ ద్రవం. మీ జుట్టును బీర్ తో కడగండి, 8 గంటల తరువాత, ఉల్లిపాయ రసంతో మీ జుట్టును, కుదుళ్ళను మర్దనా చేయండి. ఈ చికిత్సను అటుదిటు ఇటుదటు చేయోచ్చు, ముందు ఉల్లిపాయ రసాన్ని అప్లై చేసి, చల్లని బీరుతో కడగడం. వేసవిలో జుట్టు పెరుగుదలకు ఇది చక్కని పరిష్కారం.

No comments:

Post a Comment