Thursday, April 7, 2016

సమ్మర్లో కూల్ కూల్ గా లస్సీ తాగండి..

 వేసవి తాపాన్ని తీర్చే వివిధ రకాల పానియాల్లో లస్సీ ఒక టేస్టీ కూల్ డ్రింక్. మన ఇండియాలో వేసవి కాలంలో మనకు అందుబాటులో ఉంటుంది. భగభగ మండే భానుడి వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల శీతల పానీయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కమర్షియల్ డ్రింక్స్ కన్నా ఆరోగ్యాన్ని పెంపొందించే పానీయాలనే ఎంపిక చేసుకోవడం ఉత్తమం. సరిగ్గా అలాంటి కోవకే చెందినది ఒకటి లస్సీ. లస్సీ అంటానే నోరూరిపోతోందా? నిజమే. దాని రుచి మహత్యం అలాంటిది మరి.. అసలు ఈ లస్సీని ఎలా తయారుచేస్తారు? దాని వల్ల మనకు ఎలాంటి లాభాలు అందుతాయి?వీటన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే... 


ప్లెయిన్ స్వీట్ లస్సీ తయారీకి కావల్సినవి: యాలకులు: 2, పెరుగు: 1cup, క్యాస్టర్ షుగర్: 2tsp, రోజ్ వాటర్ 1tsp, చల్లటి నీళ్లు : 2 గ్లాసులు, పుదీనా ఆకులు: 4 



తయారీ విధానం: ముందుగా యాలకులను నుంచి గింజలు తీసి వాటిని, పెరుగు, చక్కెర, రోజ్ వాటర్ , నీళ్లతో పాటే ఒక పెద్దగిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమం సాప్ట్ గా అయ్యేంత వరకూ కవ్వంతో చిలకాలి. తర్వాత గ్లాసుల్లో పోసి ..పుదీనా ఆకులతో అలంకరించుకుంటే..చల్లచల్లటి ప్లెయిన్ స్వీట్ లస్సీ తయారువుతుంది . 


  • వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది: చల్లటి లస్సీ తాగితే...వేసవి తాపం నుంచి విముక్తి పొందడమే కాదు..మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంలోనూ ఇది తోడ్పడుతుంది.
  • బరువు పెరగడానికి : సన్నగా ఉన్న వారు బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో శరీరానికి కావాల్సిన కొవ్వులు, క్యాలరీలు ఉంటాయి.
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పాల పదార్థాలు ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతాయి. పెరుగుతో తయారుచేసే ఈ లస్సీలో కూడా జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ లు అధికంగా ఉండి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి ఈ లస్సీ ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. 
  • శరీం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఈ కూల్ లస్సీలో ఉండే పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్లు, బి విటమిన్ (బి12)వంటి వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి దీన్ని ఆరోగ్యాన్ని పెంపొందించే సమ్మర్ డ్రింక్ అని కూడా అంటారు . 
  • బాడీ హీట్ ను తగ్గిస్తుంది ఇది ఒక బెస్ట్ ఇండియన్ సమ్మర్ డ్రింక్. పెరుగుతో తయారుచేసే లస్సీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచతుంది. మరియు ఇది సన్ స్ట్రోక్ నుండి మనల్ని రక్షిస్తుంది.
  • యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవచ్చు: పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వల్ల మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ తొలగిపోతాయి.అంతే కాదు ఇది శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతుంది.
  • చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది ఇది శరీరానికి అవసరమయ్యే బ్యాక్టీరియాను మాత్రమే మన దేహంలో ఉంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపేందుకు లస్సీ సహాయపడుతుంది.
  • ఎనర్జీని అందిస్తుంది: శరీరానికి తక్షణ శక్తినిచ్చే పానీయం కాబట్టి, అలసిపోయినప్పుడు శ్రమ ఎక్కువైనప్పుడు దీన్ని తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • రెగ్యులర్ బౌల్ మూమెంట్ పెరుగులో హెల్తీ ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు మలబద్దంను నివారిస్తుంది. దాంతో రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది.
  • ఆకలిని కంట్రోల్ చేస్తుంది మీరు వెయింట్ లాస్ డైట్ లో ఉన్నట్లైతే మీరు ఖచ్చితంగా మీరు భోజనం తినడానికి అరగంట ముందు లస్సీని తీసుకోవచ్చు. అప్పుడు అది మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది.
  • శరీర కణజాల అభివ్రుద్దికి , కండల పెరుగుదలకు శరీర కణజాల అభివ్రుద్దికి , కండల పెరుగుదలకు కావలసిన ప్రోటీన్లు లస్సీలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చాలా మంది బాడీ బిల్డర్లకు ఇది ఒక శక్తినిచ్చే పానీయంలా ఉపయోగపడుతుంది.
  • చూశారుగా ...లస్సీ తయారీ మరియు దీని వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలు. చూశారుగా ...లస్సీ తయారీ మరియు దీని వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాలు...కాబట్టి మీరు కూడా ఇంట్లోనే సులభంగా ఈ శీతల పానీయాన్ని తయారుచేసుకొని ఈ హాట్ హాట్ సమ్మర్ ని కూల్ కూల్ గా మార్చేసుకోండి.


No comments:

Post a Comment