Tuesday, April 5, 2016

సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ తో ఆరోగ్యం మెండు..

పండ్లు ,కాయలు మానవ ఆరోగ్యం కాపాడటంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. వేసవి వచ్చిందంటే పుచ్చకాయ, సపోటా, చెరకు రసం, కీరా వంటి వాటికి భలే గిరాకీ ఉంటుంది. వీటితో పాటు నిత్యం లభ్యమయ్యే కొబ్బరి బొండాలతో అధికంగా ఉపయోగం ఉంటుంది. సహజ సిద్ధంగా లభ్యమయ్యే పండ్లు, కాయలు మానవ శరీరానికి కావలసిన ఖనిజాలు, లవణాలు, పోషకాలను అందించి అలసటను తీరుస్తున్నాయి. అంతే కాకుండా పలు వ్యాధులకు ఔషధాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. 

చెరుకు వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి శరీరానికి కావాల్సిన పోషకాలను ఇవ్వడంలో చెరుకు ఎంతో తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి, జ్వరంతో ఉన్నవారికి చెరకు రసాన్ని ఇస్తే శరీరానికి కావాల్సిన షుగర్‌, ప్రోటీన్స్‌, ఎలక్ర్టోలైట్స్‌ అందించి ఉపశమనం కలుగుతుంది. శొంటితో కానీ అల్లంతో కానీ చెరకు రసం కలిపి ఇస్తే వెక్కిళ్లు,జాండిస్‌ తగ్గుతాయి. చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల కడుపు, కిడ్నీ, గుండె, కళ్లు, బ్రెయిన్‌కు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా చెరకు గడ తినడం వల్ల పళ్లు, దవడలు గట్టిపడతాయి.ఒక్కగ్లాసు చెరకు రసంలో 75 శాతం నీరు ఉంటుంది.


సపోటా వేసవి కాలంలో విరివిగా దొరికే పండు సపోటా....దీనిలో ఎక్కువ క్యాలరీలు ఉండటంతో అధిక శక్తిని ఇస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కేన్సర్‌ కారక విషపదార్థాల నుంచి పెద్దపేగును కాపాడుతుంది. అంతే కాకుండా అతిసారం, రక్తస్రావం కాకుండా పేగు వ్యాధులనుంచి కాపాడుతుంది.


మామిడిపండ్లు: మామిడిపండ్లును వేసవి సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవాలి . ఇది శరీరంలో వేడి పుట్టించే ఫుడ్స్ అయినా, వేసవి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

అరటిపండ్లు: అరటిపండ్లలో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక బెస్ట్ ఇండియన్ సూపర్ ఫుడ్ . 


ద్రాక్ష: ద్రాక్ష మహిళలకు ఒక ఆరోగ్యకరమైన ఫుడ్. ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది


స్ట్రాబెర్రీస్: స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఈ సూపర్ ఫుడ్ సమ్మర్ సీజన్ ఒక ఒక ఉత్తమ ఫుడ్ అంతే కాదు వీటిలో క్యాల్షియం కంటెంట్ కూడా అధికంగా ుండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


No comments:

Post a Comment