ఇటీవల కాలంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయి. ఐదేళ్లు కూడా నిండకముందే.. కంటిచూపు సమస్య అనేది ప్రస్తుతం చాలా కామన్ గా మారిపోయింది. లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పులు
కంటిచూపుని బలహీనంగా మారుస్తున్నాయి. మనం టీవీ చూడటానికి, కంప్యూటర్స్ చూడటానికి కేటాయిస్తున్న సమయమే దీనికి కారణం అని చెప్పడంలో ఆశ్చర్యంలేదు.
కంటిచూపు సమస్య ఉందంటే.. అది లాంగ్ సైట్ లేదా షార్ట్ సైట్ అయి ఉండవచ్చు. కంటిచూపు మందగించడానికి చాలా కారణాలుంటాయి. జెనటికల్ రీజన్స్, ఏజింగ్, కళ్లపై ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కంటిచూపులో సమస్యలు ఎదురవుతాయి.
ఒకవేళ మీరు బ్లర్ విజన్ తో బాధపడటం, కంటిలో నుంచి నీళ్లు కారడం, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నాయంటే.. మీరు బలహీనమైన కంటిచూపు సమస్యతో బాధపడుతున్నారని గుర్తించాలి. ఇలాంటప్పుడు వెంటనే జాగ్రత్త తీసుకోకపోతే.. సమస్య మరింత ఎక్కువ అయి..
కంటిచూపుని మసకబరిచే శుక్లం సమస్య వస్తుంది. కంటిచూపు సమస్యలను లేజర్ సర్జరీ, లెన్సెస్, గ్లాసెస్ తో నివారించవచ్చు. కానీ న్యాచురల్ రెమిడీస్, ఆయుర్వేదిక్ హెర్బ్స్ ద్వారా కంటిచూపుని మెరుగుపరుచుకోవచ్చు. ఇది చక్కటి పరిష్కారం. మరి కంటిచూపుని మెరుగుపరుచుకునే.. ఆయుర్వేదిక్ రెమిడీస్ ఏంటో చూద్దామా..
త్రిఫల రకరకాల అనారోగ్య సమస్యలు నివారించడంలో త్రిఫలం మ్యాజిక్ హెర్బ్ గా చెప్పవచ్చు. ఈ మూడింటి మిశ్రమం కంటి సమస్యలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం ఒక టేబుల్ స్పూన్ త్రిఫలాన్ని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి.. కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా త్రిఫలం నానబెట్టిన నీటితో శుభ్రం చేసుకుంటే.. కంటిచూపు మెరుగుపడుతుంది.
ఉసిరికాయ
ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కంటిచూపుకి సంబంధించిన సమస్యలను ఎఫెక్టివ్ గా ట్రీట్ చేస్తుంది. ఒకవేళ మీరు కంటిచూపు సమస్యతో బాధపడుతుంటే.. డైట్ లో ఉసిరిని చేర్చుకుంటే సరిపోతుంది. డ్రై ఆమ్లా పౌడర్, లేదా క్యాప్సూల్ లేదా జ్యూస్ తీసుకోవచ్చు. ఉపయోగించే విధానం తాజాగా తయారు చేసుకుని ఉసిరి జ్యూస్ ని ప్రతి రోజూ తాగాలి. లేదా1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని తీసుకుంటే.. కంటిచూపు మెరుగుపడుతుంది.
క్యారట్
క్యారట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అలాగే అనేక పోషకాలు, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. అనేక పోషక విలువలు ఉండటం వల్ల.. క్యారట్ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ఉపయోగించే విధానం ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ తాగితే.. ఎలాంటి కంటి సమస్యలైనా తగ్గుతాయి. లేదా సలాడ్స్ రూపంలో, భోజనం సమయంలో తీసుకున్నా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
బాదాం:
కేవలం టేస్టీగానే కాదు.. అవి విటమిన్ ఈ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉంటాయి. ఇవన్నీ కంటిచూపు మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఉపయోగించే విధానం గుప్పెడు బాదాం గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం తొక్క తీసేసి.. పేస్ట్ చేసుకోవాలి. ఒక గ్లాసు పాలతో.. ఈ పేస్ట్ కలిపి ప్రతిరోజూ ఉదయం తాగుతూ ఉంటే.. కంటిచూపు మెరుగవుతుంది.
భ్రింగరాజ్:
ఆయుర్వేదిక్ హెర్బ్. ఇది కంటిసంబంధిత సమస్యలు నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం కంటిచూపు మెరుగుపరచడానికి భ్రింగరాజ్ హెర్బ్ ని పేస్ట్ చేసి.. కళ్లపై అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. కంటి చూపు పెరుగుతుంది.
లికోరైస్:
లికోరైస్ ని ములెథి అని కూడా పిలుస్తారు. రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం వల్ల కంటిచూపు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఉపయోగించే విధానం ఒక టీస్పూన్ లికోరైస్ పౌడర్ ను ఆవు పాలు లేదా నెయ్యి లేదా తేనె తో కలిపి తీసుకోవడం వల్ల కంటిచూపు పెరుగుతుంది.
వెల్లుల్లి:
ఆహారాల్లో టేస్ట్ కి మాత్రమే కాదు.. కంటిచూపు మెరుగుపరచడానికి కూడా వెల్లుల్లిని ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ వెల్లుల్లి జ్యూస్ తీసుకోవడం వల్ల కంటిచూపుని మెరుగుపరచవచ్చు.
No comments:
Post a Comment