Thursday, January 28, 2016

పంచదారకు బదులు వీటిని ట్రై చేయండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి...

తియ్యగా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీట్స్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే... చెంచాల కొద్దీ చక్కెర కలిపి తయారు చేసిన పిండి వంటలు, స్వీట్లు, పళ్ల రసాలు, బేకరీ ఐటమ్స్ అంటే మనకెంతో ఇష్టం. అయితే ఇలా చక్కెర వాడకం పెరుగుతూ పోతే మన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుంది. ఫ్రూట్‌ జ్యూసులు, డెజర్టులు చక్కెరతో కలిపి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. కానీ చక్కెర ఎక్కువ వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. రకరకాలైన అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. శరీరంలోకి చక్కెర ఎక్కువగా చేరుతున్న కొద్దీ మన ఒంట్లో జీవ క్రియలు అస్తవ్యస్తం అవుతాయి. బరువు అదుపు తప్పుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ఇన్సులిన్‌ నిరోధకత వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... చక్కెర కూడా మద్యంతో సమానమే అంటారు శాస్త్రవేత్తలు. ఈ నేపథ్యంలో చక్కెరకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయాలను ప్రయత్నించడం మేలు. హై బిపి ఉన్నప్పుడు, ఉప్పుకు బదులు ఈ ఆహారాలు తినండి... అందుకే శరీరంలో బ్లడ్‌ షుగర్‌ పెరగకుండా సహజ తీపిదనాన్ని కలిగి ఉండే తేనె, పళ్ల లాంటి వాటిని వాడితే శరీరానికి ఎంతో మంచిది. స్వీటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కానీ... వాటిని చక్కెరతో తయారుచేస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. చక్కెరకు బదులు ఆర్గానిక్‌ బెల్లం, చెరుకురసం, ద్రాక్షపళ్లు, తేనె, ఖర్జూరం, ఎండుద్రాక్ష, ఆప్రికాట్స్‌, తాజా పళ్లను పదార్థాల్లో వాడితే ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదేలాగో చూద్దాం...

బ్రౌన్ షుగర్: ఒక కప్పు టీకి 1టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ జోడించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే బ్రౌన్ షుగర్ లో మినిరల్స్(క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్)లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వ్యాధినిరోధకతను పెంచి, వ్యాధులను దూరంగా ఉంచుతాయి.


ఖర్జూరం: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరియు డయాబెటిక్ పేషంట్స్ కు ఇవి చాలా సురక్షితమైనవి. ఖర్జూరాలను నేరుగా అలాగే తీసుకోవడం లేదా సిరఫ్ లాగా తయారుచేసుకొని టీ లేదా కాఫీలకు ఉపయోగించుకోవచ్చు. 


తేనె : పంచదారకు బదులు తేనె వాడకం చాలా మంచిది. రోజూ కొద్దిగా తేనె తింటే గుండెకు మంచిది. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి దరిచేరవు. అంతేకాదు శరీరంలోని రక్తాన్ని అది శుభ్రం చేస్తుంది. కడుపులో ఎసిడిటీ, గ్యాస్‌లాంటి సమస్యలు తలెత్తవు. 


పచ్చి కొబ్బరి : పచ్చికొబ్బరి తురుము ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. షుగర్ కు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. అలాగని, టీ, కాఫీలలో దీన్ని చేర్చలేరు, కానీ ఇతర స్వీట్ డిష్ లకు కొబ్బరిని చేర్చుకోవచ్చు.


డ్రై ఫ్రూట్స్ : డ్రైఫ్రూట్స్‌ అంటే ఎండు ఖర్జూరం, ఎండుద్రాక్ష, అంజీర్‌ వంటి వాటిని చక్కెరకు బదులు వాడొచ్చు. ఖర్జూరంలో పొటాషియం, ఐరన్‌, విటమిన్‌-బి, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తినే పదార్థాలకు ఎండు ద్రాక్షను జోడించి తింటే స్వీటు తినాలన్న మీ కోరిక కూడా తీరుతుంది. ఎండుద్రాక్షలో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. అజీర్తితో బాధపడేవాళ్లు అంజీర తింటే మంచిది. ఉబ్బసంతో బాధపడేవారికి కూడా అంజీర ఎంతో మంచిది. దగ్గు, జలుబులతో బాధపడేటప్పుడు అంజీర తింటే ఎంతో ఆరోగ్యం. కఫం కూడా బాగా తగ్గిపోతుంది. అంతేకాదు ఇవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పనిచేసేట్టు చేస్తాయి. ఎప్పుడైనా స్వీట్లు తినాలనిపిస్తే డ్రైఫ్రూట్లు తినండి. మనం చేసే స్వీట్లలో చక్కెరకు బదులు డ్రై ఫ్రూట్లను వాడొచ్చు. చక్కెరతో పనిలేకుండా డ్రైఫ్రూట్‌తో చిక్కి చేయొచ్చు.


చెరుకురసం : చక్కెరకు బదులుగా చెరకు రసాన్ని కూడా వాడుకోవచ్చు . చెరుకురసంలో విటమిన్‌-బి, విటమిన్‌-సిలు ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనత , జాండీ‌స్ వంటి వ్యాధులతో బాధపడేవారిని చెరుకురసం ఎక్కువగా తీసుకోమంటారు. అల్లం, నిమ్మకాయ లాంటి ఫ్లేవర్లు ఏమీ లేకుండా తాజా చెరకురసం తాగితే ఒంటికి మంచిది.


బెల్లం : పంచదారకు బదులుగా బెల్లం వాడుకోవడం ఎప్పుడూ మంచిదే. దీన్ని మెడిసెనల్‌ షుగర్‌ అని కూడా పిలుస్తుంటారు. దగ్గు, మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యల పరిష్కారానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చక్కెరకు బదులు బెల్లాన్ని విరివిగా వాడొచ్చు. బెల్లం పొడిరూపంలో, ఘన, ద్రవ రూపాల్లో కూడా దొరకుతుంది. బెల్లంతో చిక్కీలను తయారుచేయడం అందరికీ తెలిసిందే. అంతేకాదు పప్పు, కూరల్లో కూడా కొంతమంది బెల్లం వేస్తుంటారు. అవి తీయగా ఉండి రుచిగా అనిపిస్తాయి.


పళ్లు లేదా పండ్ల రసాలు : కొన్ని రకాల వంటల్లో పంచదారకు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్ జ్యూస్ లను ఉపయోగించుకోవచ్చు . ఫ్రూట్ జ్యూస్ లలో న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి. పంచదారకు బదులుగా మనకు అందుబాటులో దొరికే పళ్ళను కూడా వాడుకోవచ్చు. ఇలా సహజసిద్దంగా లభించే వాటిని చక్కెరకు బదులుగా వాడుకోవడం వల్ల మనకు అనారోగ్య సమస్యల భయం తగ్గుతుంది. మన ఆరోగ్యము బేషుగ్గా ఉంటుంది. అలాంటి పండ్లలో మామిడి, అరటి, కేరట్‌, బొప్పాయి, యాపిల్‌, పుచ్చకాయలాంటివి బాగా తీయగా ఉంటాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలేమీ తలెత్తవు. బ్లడ్‌ షుగర్‌ ఎక్కువ కాదు.పళ్ల ప్రత్యేకత ఏమిటంటే అవి జీరో ఫ్యాట్‌.

No comments:

Post a Comment