Monday, January 25, 2016

ఆరోగ్యంగా ఉంచే 7 రకాల అలవాట్లు

  • * ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించటం వలన జీవితంలో చాలా మార్పులు వస్తాయి.
  • * రోజు ఉదయాన మీ రోజును సానుకూల దృక్పదంతో ప్రారంభించండి.
  • * రోజు వ్యాయామాలను చేయండి.
  • * మంచి పాటలను లేదా సంగీతాన్ని వినండి.

  • రోజు కొన్ని రకాల అలవాట్లను అనుసరించటం వలన మీ జీవన శైలిలో మార్పులు కలిగి, రోజును సంతోషంగా ప్రారంభిస్తారు మరియు ముగిస్తారు. ఈ చిన్న చిన్న అలవాట్లను అనుసరించటం వలన మీ జీవితంలో మంచి మార్పులను జరిగి, శారీరకంగానూ, మానసికంగాను చాలా ప్రయోజనాలను పొందుతారు.
  • ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లను అనుసరించటం వలన మీ జీవితంలో అద్బుత మార్పులు సంభవిస్తాయి కావున మంచి అలవాట్లను మరియు సరైన అలవాట్లను ఎంచుకోండి. కొన్ని ముఖ్యమైన నియమాలు, వాటిని అనుసరించటానికి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేదు అని చెప్పవచ్చు. ఈ నియమాలు పాటించటం సులభం కావున ఇలాంటివి అనుసరించటం ఇబ్బందిగా భావించారు. మీరు పాటించాల్సిన 7 ఆరోగ్యకర అలవాట్లు ఇక్కడ తెలుపబడ్డాయి.

    రోజును సానుకూల దృక్పదంతో ప్రారంభించండి

    మీరు రోజు ఉదయాన లేసిన తరువాత రోజును సానుకూల దృక్పదంతో ప్రారంభించటం ముఖ్యమైనది. ఉదయాన లేచిన తరువాత మీ జీవితం ఆనందంగా ఉంది, జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి వాటిని సాధించి, సంతోషంగా ఉన్నాము అనే ఉద్దేశంతో ఉదయాన్ని ప్రారంభించండి. మీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండి, వృత్తిలో సరైన విధంగా నడుచుకుంటూ, విజయం సాధించిన వాటికి గర్వపడుతూ ఉండండి. ఇలా మనసులో భావిస్తూ, ఉదయాన ఒక కప్పు టీ లేదా కాఫీ త్రాగి మరియు ఆరోగ్యాన్ని పెంపొందించే అల్పాహారాన్ని సేకరించి, తరువాతి పనిని కొనసాగిస్తూ శిఖరాలను అధిగమించండి.

    స్నానం

    మీరు ఉదయాన లేవగానే ఇది తప్పనిసరి ప్రక్రియగా చెప్పవచ్చు. మీరు స్నానం చేసేటపుడు ఎలాంటి సమస్యల గురించి ఆలోచించకుండా కేవలం స్నానం పైన దృష్టి పెట్టండి. స్నానం సమయంలో సబ్బుతో మీ శరీరాన్ని గట్టిగా రాయకుండా మృదువుగా మీ చర్మానికి సబ్బు రాస్తూ, చేసే స్నానాన్ని ఆస్వాదించండి. మీరు వాడే సబ్బు సువాసనను వేలువరిచేదిగా ఉండాలి మరియు రోజు మొత్తం ఆ వాసన వచ్చేదిగా ఉండాలి. కావున మంచి సబ్బులను వాడండి. మీరు ఆరోగ్యంగా ఉండటంలో ఇవి కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.


  • మ్యూజిక్ వినండి

    రోజు మీరు చేసే పనిలో చాలా బిజీగా ఉంటున్నారా! ఇలాంటి సమయంలో మీకు ఇష్టమైన పాటలను వింటూ పని చేయటం వలన, ముఖ్యంగా మంచి సంగీత పాటలు, విశ్రాంతి చేకూర్చే పాటలను వినండి. ప్రతి రోజు సంగీతాన్ని వినటానికి ప్రయత్నించండి, కాస్త సమయం పాటూ మీ పని పక్కన పెట్టి కొద్ది సమయం పాటు సంగీతాన్ని ఆస్వాదించండి. కొన్ని రకాల శాస్త్రీయ సంగీతాలు లేదా ఫోక్ సాంగ్స్, ఇలా మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఉండండి. కానీ మీరు సంగీతాన్ని వినేటపుడు మాత్రం ఎలాంటి భంగాలు కలుగకుండా చూసుకోండి.

    కాఫీకి బదులుగా టీ తాగండి

    ఏది ఏమైనా కొంత మంది ఎక్కువ కప్పుల కాఫీ తాగటం వలన వారి ఆరోగ్యానికి మంచిది అని భావిస్తుంటారు. కానీ ఇలా చేయటం వలన నిద్రకు తప్పని సరిగా భంగం కలుగుతుంది మరియు మీరు ఒత్తిడి, ఉద్రేకతలకు గురవుతుంటారు. ఉదయాన లేదా ఎపుడైన ఒక కప్పు కాఫీ తాగటం వలన ఎలాంటి ప్రమాదం లేదు కానీ రోజు మొత్తం కాఫీ మాత్రం తాగకండి. మీకు కాఫీ తాగటం ఎక్కువ అలవాటు ఉన్నట్లయితే, కాఫీకి బదులుగా టీ తాగటానికి ప్రయత్నించండి. గ్రీన్ టీ లేదా ఇతర రూపాలలో ఉన్న టీలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లు ఉంటాయి. కావున కాఫీకి బదులుగా టీ తాగటం శ్రేయస్కరం.

    ఆహరం నెమ్మదిగా నమలండి

    కొంత మంది చాలా వేగంగా ఆహరాన్ని నములుతూ, తింటూ ఉంటారు, ఇలా వేగంగా లేదా సరిగా ఆహారాన్ని నమలకపోవటం వలన జీర్ణ వ్యవస్థకు సమస్యలు కలిగే అవకాశం ఉంది. కారణం జీర్ణ వ్యవస్థలో ఉండే లాలాజలం జీర్ణ ఎంజైమ్లను కలిగి ఉంటుంది. కావున ఆహరాన్ని నెమ్మదిగా చిన్న చిన్న ముక్కలుగా నమలటం వలన జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. ఆహరం పెద్ద ముక్కలుగా ఉన్నట్లయితే జీర్ణం అవటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు ఆహరం తినేటపుడు ఇలాంటివి గుర్తుపెట్టుకోండి.

  • మెట్లు ఎక్కండి
  • మీరు ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఎలివేటర్ మరియు ఎస్కలేటర్లు వంటివి కాకుండా మెట్లను ఉపయోగించి ఎక్కండి. ఇలా మెట్లు ఎక్కటం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. వీలుపడినపుడల్లా మెట్ల ద్వారా వెళ్ళటానికి ప్రయత్నించండి, దీని వలన మీ పాదాలకు రక్తప్రసరణ జరుగుతుంది, రోజు మొత్తం ఎక్కవగా నడవటానికి ప్రయత్నించండి. మీ శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గే అవకాశంతో పాటూ, శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

    వ్యాయామాలు

    వ్యాయామాలు అనగానే అందరు చాలా నిరాశకు గురవుతుంటారు, కారణం ఉదయాన లేచి వ్యాయామాలు చేయటం బద్దకంగా అనిపిస్తుంది. తీవ్రమైన లేదా కష్టతరమైన వ్యాయామాలను కాకుండా రోజు ఉదయాన చిన్న చిన్న వ్యాయామాలను చేయండి. ఈ సమయంలో మీరు వ్యాయామాల వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాల గురించి గుర్తించనట్లయితే, భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాయామాల వలన మెడ నొప్పి, వెన్ను నొప్పులు మరియు కీళ్ళ నొప్పుల వంటి ఇబ్బందులకు గురవరు. కావున రోజు వ్యాయామాలు చేయటానికి ప్రయత్నించి, రోజులో కలిగే ఒత్తిడిల నుండి ఉపశమనం పొందండి.
    ఆరోగ్యంగా జీవించటం అనేది గొప్ప విషయం లేదా పెద్ద సమస్య కూడా కాదు. మీరు చేసే పనుల మరియు అనుసరించే నియమాల పైన మాత్రమె ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు పాటించే నియమాలు మీ శరీరానికి ఉపయోగపడేవిగా ఉండాలే కానీ అనారోగ్యాలకు గురి చేసేవిగా ఉండకూడదు.

No comments:

Post a Comment