Monday, March 21, 2016

5 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించే అమేజింగ్ డ్రింక్ ...

బెల్లీ ఫ్యాట్ చాలా మెండి ఫ్యాట్ మరియు దీన్నితగ్గించుకోవడం అంతే సులభం కాదు . ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి డైట్ ఫాలో అయ్యే ఓపిక, మరియు వ్యాయామం చేసే లక్షణాలు మీలో లేనట్లైతే , కొన్ని సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. ఈ రెమెడీని ఫాలో అయితే చాలు, 5 రోజుల్లో మీ బెల్లీ ఇట్టే కరిగిపోతుంది. ఈ సింపుల్ రెమెడీ చాలా నేచురల్ రెమెడీ. దీనికోసం మీరు ఎలాంటి డ్రగ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు . దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ భయం మీకు అవసరం లేదు.

అందుకు మీకు కావల్సిందల్లా నిమ్మకా మరియు పార్ల్సీ . కొద్దిగా పార్ల్సీ ని జ్యూస్ చేసి అందులో నిమ్మరసం జోడించి , ఈ మిశ్రమానికి ఒక గ్లాసు నీళ్ళు చేర్చి , బాగా మిక్స్ చేసి నిద్రలేవగాన కాలి పొట్టతో దీన్ని తాగాలి. ఇలా రెగ్యులర్ గా క్రమం తప్పకుండా త్రాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. 5 రోజుల్లోపలే మీరు ఫలితాన్ని గ్రహిస్తారు.

ఈ నేచురల్ డ్రింక్ రెమెడీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ సహాయపడటంతో పాటు, అనేక విటమిన్స్ మరియు మినిరల్స్ ను అందిస్తుంది. మరియు పార్ల్సీ జీర్ణక్రియను ప్రోత్సహించడంతో పాటు , శరీరంలో అదనపు నీటిని తొలగించి కడుపుబ్బరం మరియు శరీరం యొక్క ఉబ్బును తగ్గిస్తుంది. ఈ జ్యూస్ తీసుకుంటూనే కొన్నింటికి దూరంగా ఉన్నట్లైతే చాలా వేగంగా బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.

షుగర్స్ కు దూరంగా ఉండాలి: స్వీట్స్, పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి, పూర్తిగా వీటికి దూరంగా ఉన్నట్లైతే బెల్లీ ఫ్యాట్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు . బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని కోరుకునే వారు, షుగర్ ప్రొడక్ట్స్, సాప్ట్ డ్రింక్స్, మరియు షుగర్ జ్యూస్ లకు దూరంగా ఉండాలి.

ప్రోటీన్ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలి: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మరియు మద్యహ్నా భోజంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల . బెల్లీ ఫ్యాట్ ను వేగంగా కరిగించుకోవచ్చు.









అన్నం తగ్గించాలి: సాధ్యమైనంత వరకూ బియ్యంతో వండిని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదా చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే అన్నం తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది.




ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి: రెగ్యులర్ డైట్ లో ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా కరిగించుకోవచ్చని చాలా పరిశోధనలు కూడా వెల్లడి చేశాయి.



పరుగు: కిలోమీటర్లు, లేదా మైల్స్ పరుగుపట్టక్కర్లేదు. లేదా గంటలు గంటలు పరిగెత్తక్కర్లేదు. ఒక రోజుకు 5 నుండి పదినిముషాలు పరిగెత్తితే చాలు , మార్పును మీరు గమనిస్తారు.






నీరు ఎక్కువగా త్రాగాలి: రోజులో ఎక్కువగా నీరు త్రాగాలి. శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి మరియు ఆకలిని తగ్గించుకోవడానికి నీరు గ్రేట్ గా సహాయపడుతుంది . దీని వల్ల మీరు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు.



గ్రీన్ టీ: గ్రీన్ టీని రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు శరీరంలో నయమయ్యే గుణాలు ఎక్కువగా కనబడుతాయి . గ్రీన్ టీలో ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి.

1 comment:

  1. sir,
    నమస్కారం. మీరు పార్లే అని రాసారు. ఇది బార్లీ కదా. వివరించగలరు.
    a.v. ramana
    ramana.arcot@gmail.com
    9441426555

    ReplyDelete