వేసవికాలం మొదలయిన వెంటనే ప్రతిఒక్కరు తమ అందం, ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలను పాటిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు అందం విషయంలో దేనికైనా వెనుకాడరు. వేసవికాలంలో సూర్యుడు, భూమికి కొంచెం దగ్గరగా రావడం వల్ల..సూర్యుని నుంచి వచ్చే కిరణాలు నేరుగా శరీరం మీద పడటంతో అనేక రకాల వ్యాధులుసంక్రమిస్తాయి. అందులో ముఖ్యంగా సూర్యుని నుంచి ప్రసరించే అతినీలలోహితకిరణాలు చాలా హానికరమైనవి. ఇవి చర్మానికి సంబంధించిన క్యాన్సర్ వ్యాధిని కలుగచేస్తుంది.
సాధారణంగా వేసవికాలంలో వుండే వేడితాపంవల్ల ప్రతిఒక్కరు నల్లబడతారు. సూర్యుని కిరణాలలో వుండే శక్తి అధికంగా వుండటం వల్ల.. చర్మంలో వుండే కణాలు దెబ్బతింటాయి. అలాగే కొన్ని పోషకాలనుకూడా కోల్పోవడంతో చర్మం తొందరగా నల్లబడటం మొదలవుతుంది. అలాగే పొడిబారడంకూడా జరుగుతుంది. సహజంగా ప్రతిఒక్కరు తమ కార్యకలాపాలను నిర్వర్తించుకోవడంకోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే బయటకు వెళ్లగానే ఎండతాపంతో చర్మంపైమంటగా అనిపిస్తుంది. అటువంటి చోటే చర్మం ఎక్కువగా నల్లగా మారడం జరుగుతుంది.ఫలితంగా అక్కడ మచ్చలు ఏర్పడుతాయి.
చర్మసంరక్షణకు సంబంధించి వేసవికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.లేకపోతే చర్మ నిగారింపును, అందాన్ని తిరిగి పొందడటానికి చాలా సమయం పడటమేకాకుండా, అధికంగా డబ్బులను వెచ్చించుకోవాల్సి వస్తుంది. వేసవిలోచర్మసౌందర్యం దెబ్బతింటుందనే భావంతో చాలామంది బయటకు వెళ్లడానికి కూడాభయపడుతుంటారు. అటువంటి సమయాల్లో కొన్ని ముందుజాగ్రత్తలు పాటిస్తే.. చర్మంనల్లబడకుండా, పొడిబారకుండా, సౌందర్యం దెబ్బతినకుండా వుండొచ్చు. మరి సమ్మర్లో స్కిన్ టాన్ నివారించే ఫేస్ ప్యాక్ లు మీకోసం...
మింట్ ప్యాక్: ఈ ప్యాక్ సమ్మర్ హీట్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. పదీనా ఆకులను కొద్దిగా తసుకిని అందులో కొద్దిగా పసుపు, గోరువెచ్చని నీరు వేసి మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మిల్క్ క్లెన్సింగ్ : చర్మానికి రెగ్యులర్ క్లెన్సింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది సమ్మర్ సీజన్లో చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక కాటన్ పీస్ తీసుకొని, పాలలో డిప్ చేసి ముఖం మొత్తం తుడవాలి . చర్మంలో దాగి ఉన్న మన కంటికి కనబడిని మురికిని శుభ్రం చేసి తొలగిస్తుంది.
బాదం ఆయిల్ థెరఫీ : ఈ హోం మేడ్ థెరపీ మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా సున్నితమైన చర్మానికి రక్షణ కల్పిస్తుంది. చిన్న కాటన్ పీస్ తీసుకొని బాదం నూనెలో డిప్ చేసి ముఖం మొత్తం తుడవాలి . బాదం ఆయిల్ థెరఫీతో ఎఫెక్టివ్ క్లెన్సింగ్ జరిగి, కంటికి కనబడని మురికి తొలగిస్తుంది. చర్మంను శుభ్రం చేసి క్లియర్ చేస్తుంది.
సోయాబీన్ మరియు లెంటిల్ ప్యాక్ : సోయాబీన్ లో ఐసోఫ్లేవాన్ అధికం మరియు ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఏజింగ్ స్కిన్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది. 50గ్రాముల సోయాబీన్ లేదా పెసరపప్పు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా కాచిన పాలు, బాదం ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి.
కీరదోస ఫేస్ ప్యాక్: ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది మరియు సమ్మర్లో స్కిన్ స్మూత్ గా మార్చుతుంది. కీరదోసకాయను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా సుగర్ వేసి మిక్స్ చేసి , ఫ్రిజ్ లో ఉంచి చల్లారనివ్వాలి. 20నిముషాల తర్వాత బయటకు తీసి ముఖానికి అప్లై చేసి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
టమోటో ఫేస్ ప్యాక్ : ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ఆయిల్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది స్కిన్ టాన్ తొలగిస్తుంది . హెల్తీ స్కిన్ అందిస్తుంది. టమోటోను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్ది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఓట్ మీల్ ప్యాక్: వేసవిలో డ్రై స్కిన్ తో బాధపడే వారికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక కప్పు ఓట్ మీల్ పౌడర్ కు కీరదోస పేస్ట్ మిక్స్ చేయాలి. తర్వాత ఒక స్పూన్ పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసి, దీన్ని ఫేషియల్ స్కిన్ కు అప్లై చేయాలి. 30 గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే డార్క్ స్కిన్ నివారిస్తుంది.
బనానా ఫేషియల్ మాస్క్: ఇది చాలా సులభంగా ఉపయోగించే ఫేస్ ప్యాక్ ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సమ్మర్లో చర్మానికి రక్షిస్తుంది. సగం బనానాను మెత్తగా మ్యాష్ చేసి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటిలో డిప్ చేసిన క్లాత్ తో ముఖం శుభ్రంగా తుడవాలి.
మిల్క్ మరియు హనీ బ్లీచ్: ఆయిల్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . సన్ టాన్ నివారిస్తుంది. పాలు, తేనె, నిమ్మరసం సమంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సమ్మర్లో చర్మం నల్లగా మారకుండా ఉంటుంది.
ఎగ్ మాస్క్: స్మూత్ అండ్ ఆయిల్ స్కిన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గడ్డు మిశ్రమంలో నిమ్మరసం మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
బేసిన్ మ్యాజిక్: వేసవిలో చర్మంలో మొటిమలు నివారించడానికి ఈ ఫేస్ ప్యాక్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ ప్రొపర్టీస్ మొటిమలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. శెనగపిండిలో గోరువెచ్చని తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
చాక్లెట్ ఫేస్ మాస్క్: డెలిషియస్, టెంప్టిగ్ ఫేస్ ప్యాక్ . స్కిన్ కు తెల్లగా మార్చే గ్రేట్ ఫేస్ ప్యాక్. ఒక చెంచడా డార్క్ చాక్లెట్ లేదా ఒక చెంచడా కోకోపౌడర్ లో 5చెంచాలా తేనె మిక్స్ చేసి 2చెంచాల పాలు మిక్స్ చేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
వాటర్ మెలోన్ ఫేస్ మాస్క్: ఇది స్మూతింగ్ ఫేస్ మాస్క్ . సమ్మర్లో చర్మాన్ని కూల్ గా ఉంచుతుంది . చర్మానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది. ఇది చర్మం క్లియర్ చేస్తుంది, సన్ టాన్ నివారించి స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. 2 చెంచాలా కీరదోసకాయరసం, రెండు చెంచాలా వాటర్ మెలోజ్ జ్యూస్, ఒక చెంచా పెరుగు, 1 చెంచా పాలపౌడర్ మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
గుమ్మడి ఫేస్ ప్యాక్: గుమ్మడిలో నేచురల్ ఎక్స్ ఫ్లోయేటింగ్ యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్ానయి . ఈ ఫేస్ మాస్క్ ఉపయోగించడ వల్ల చర్మం బ్రైట్ గా మారుతుంది . చర్మం సాఫ్ట్ గా కనబడుతుంది. సన్ డ్యామేజ్ నివారిస్తుంది. గుమ్మడిని మెత్తగా పేస్ట్ చేసి అందులో గుడ్డు వేసి మిక్స్ చేయాలి. డ్రై స్కిన్ ఉన్నవారు ఓమేగా రిచ్ బాదం మిల్క్, హనీ కూడా జోడించివచ్చు. ఈ మివ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తరవ్ాత చల్లటి నీటితో కడిగేసి , మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
అలోవెర జెల్ ప్యాక్: అలోవెరలో స్మూతింగ్ ప్రొపర్టీస్ ఎక్కువ. ఈ మాస్క్ సెన్సిటివ్ స్కిన్ ను ఇరిటేట్ చేస్తుంది. కాబట్టి చేతిమీద ప్యాచ్ టెస్ట్ చేసి, తర్వాత అప్లై చేసుకోవచ్చు. అలోవెర జ్యూస్ తీసి ముఖానికి నేరుగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
No comments:
Post a Comment