Friday, March 25, 2016

ఏం చేయాలో ధోనీకి తెలుసు, అలా సాహసం చేశాడు'

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బాల్ సందర్భంగా మన కెప్టెన్ సింగ్ ధోనీ వ్యవహారం సోషల్ మీడియా క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు తెరలేపింది. హార్డిక్ పాండ్య చివరి బంతిని సంధించినప్పుడు ధోనీ తన కుడి చేతికున్న గ్లోవ్‌ను తీసేశాడు. దీంతో పాండ్య సంధించిన లోబౌన్సర్ ఒడిసి పట్టి బ్యాట్స్‌మన్‌తో సమానంగా పరిగెత్తి రనవుట్ చేశాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 


కీపర్ అలా గ్లోవ్ తీసేయొచ్చా? నిబంధనలు అందుకు అంగీకరిస్తాయా? అంటూ పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనికి కొందరు సమాధానం ఇస్తూ... ధోనీ గ్లోవ్స్ మొత్తం తీసేయలేదని పేర్కొంటున్నారు. గ్లోవ్స్‌కు సంబంధించిన స్పష్టమైన నిబంధనలు ఏం లేవని, రక్షణ కోసం కొన్ని ధరించవచ్చు, సౌకర్యం కోసం తీసేయొచ్చు అని మరికొందరు సమాధానం చెబుతున్నారు. 



అంతిమంగా ఆటగాడి రక్షణే ఉద్దేశ్యమని చెబుతున్నారు. వాటిని ధరించాలా? తీసివేయాలా? అనేది ఆయా ఆటగాడి విచక్షణ అని పలువురు సమాధానం చెబుతున్నారు. పాండ్యా వేసిన చివరి ఓవర్ సమయంలో ధోనీ పక్కా ప్లాన్ ప్రకారం నడుచుకున్న విషయం తెలిసిందే. చివరి బంతికి అతను గ్లోవ్స్ తీశాడు. 



ధోనీకి అందుకే చిర్రెత్తుకొచ్చింది మరోవైపు, మ్యాచ్ అనంతరం ధోనీ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆగ్రహించిన విషయం తెలిసిందే. అయితే, ఆ విలేకరి అడిగిన ప్రశ్న ధోనీకి కోపం తెప్పించింది. ఆ మీడియా ప్రతినిధి ఏం అడిగారన్నది మొదట తెలియరాలేదు. అయితే, అతను అడిగిన ప్రశ్న ధోనీకి కోపం తెప్పించింది. ఆ విలేకరి 'బంగ్లాదేశ్ పై టీమిండియా ప్రదర్శించిన ఆటతీరు తో మీరు సంతోషంగా ఉన్నారా?' అని ప్రశ్నించాడని తెలుస్తోంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన ధోనీ.. 'ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం నాకు చాలా అసంతోషంగా ఉంద'ని సీరియస్‌గా సమాధానమిచ్చాడు. మీకు సంతోషంగా లేనట్లుగా ఉందని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.





బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్ గెలుపు నేపథ్యంలో కెప్టెన్ ధోనీ పైన ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులు, మాజీ ఆటగాళ్లు ధోనీని ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా, మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కితాబిచ్చాడు. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో మాట్లాడుతూ... ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో ధోనీకి తెలుసునని చెప్పాడు. అతని ప్రణాళికలు చూస్తుంటే అతని దూకుడు అర్థమవుతోందని అభిప్రాయపడ్డాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆటగాళ్ల చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నాడు. చివరలో ముష్ఫికర్, మహ్మదుల్లాలు భారీ షాట్లకు వెళ్లారని, అది సరికాదని ఆయన అన్నాడు.



పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కూడా ధోనీకి కితాబిచ్చాడు. బౌలింగ్ మార్పు ద్వారా ధోనీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. అతను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించాడు. భారత్ మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే, పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా కూడా ధోనీకి కితాబిచ్చారు.

భారత్ - బంగ్లా మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో కెప్టెన్ ధోనీ అద్భుతమైన వ్యూహాన్ని రచించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏమాత్రం అనుభవం లేని పేసర్ పాండ్యను ఎంచుకున్నాడు. అంతేకాదు, చివరి బంతికి సూచనలు కూడా చేశాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్   బంగ్లా విజయానికి 11 పరుగుల దూరంలో ఉంది. ఎలాంటి ప్రయోగానికి పోలేదు ధోని. పాండ్యకు బంతి ఇచ్చాడు. ఏమవుతుందో అని తీవ్ర ఒత్తిడితో ఎక్కడి వారు అక్కడ కదలకుండా మ్యాచ్‌ చూస్తుండగా.. సరదాగా నవ్వుతూ బంతి అందుకున్నాడు పాండ్య.

భారత్ - బంగ్లా మ్యాచ్   తొలి బంతిని ఆఫ్‌స్టంప్‌ ఆవల వేయగా మహ్మదుల్లా ఒక పరుగు చేశాడు. రెండో బంతిని స్లో బాల్‌ వేయగా ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా బౌండరీ బాదేశాడు ముష్ఫికర్. నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. ఆఫ్‌స్టంప్‌ ఆవల వేసిన బంతిని ముష్పికర్‌ స్వీప్‌ చేయడంతో మరో ఫోర్.

భారత్ - బంగ్లా మ్యాచ్   ఈ సమయంలో మ్యాచ్ భారత్ చేజారినట్లే కనిపించింది. మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదే గెలుపు. ఈ దశలో భారత్‌ గెలుస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ అద్భుతం జరిగింది. నాలుగో బంతికి పాండ్య స్లో బాల్‌ వేయగా ముష్ఫికర్‌ పుల్‌ షాట్‌ ఆడాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్   క్యాచ్‌ అందుకోవడంలో శిఖర్ ధావన్‌ పొరపాటు చేయలేదు. ఐదో బంతికి ఫుల్‌ టాస్‌ బంతిని మహ్మదుల్లా భారీ షాట్‌ కొట్టగా జడేజా చక్కటి క్యాచ్‌ అందుకున్నాడు.  

భారత్ - బంగ్లా మ్యాచ్ ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే బంగ్లా గెలుపు. టై అయినా భారత్‌కు మేలే. ఆస్ట్రేలియాపై గెలిస్తే చాలు.. సెమీస్‌ చేరుకోవచ్చు. ఇలా అభిమానులు అంచనాల లెక్కలు వేసుకుంటున్న సమయంలో పాండ్య ఆఫ్‌స్టంప్‌కు దూరంగా బంతి వేశాడు.

భారత్ - బంగ్లా మ్యాచ్ వికెట్ల వెనక బంతి అందుకున్న ధోని ఎలాంటి పొరపాటు చేయకుండా పరుగెత్తుకుంటూ వచ్చి బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేశాడు. భారత్‌ ఒక్క పరుగుతో గెలిచింది.

No comments:

Post a Comment