Monday, September 12, 2016

ఎంత ప్రయత్నించిన గాఢ నిద్ర పట్టట్లేదా...!


రాత్రి నిద్ర సరిగా లేకపోతే, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి రాత్రి వేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా చెప్పాలంటే, మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి. సాధారణంగా చాలా మందిని మనం గమనించినట్లైతే.. కారణం లేకుండా నిద్రపట్టక ఇబ్బంది పడేవారు. పడుకొన్న వెంటనే హాయిగా నిద్రపట్టాలని భావించేవారు కొందరు ఉన్నారు. మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నపుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవటం వలన నిద్రాభంగం అవుతుంది. నిద్రలేమి, లేదా సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్య మీ ఆహారంలో మార్పు చేసుకొని, భోజనంలో అమినొ ఆసిడ్ల మోతాదు సరిగ్గా చూసుకొంటే మీకు చక్కగా నిద్రపట్టే మార్గం లభించినట్టే. నిద్రలేమి సమస్యను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. మీరు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను నివారించి నిద్రపోయేందుకు బాగా సహాయపడుతాయి. ఈ ఆహారాలు రాత్రుల్లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు బాగా నిద్రపట్టేందుకు సహాయపడుతాయి. మరి ఆ ఆహారాలేంటో ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం... 

పాలు: గోరువెచ్చని పాలు నిద్రని ఆహ్వానిస్తాయని మన పెద్దలకాలంనుంచీ వస్తున్న ఆనవాయితీ. మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీప్రసారకాలు(న్యూరోట్రాన్స్ మీటర్), ట్రైటోపాస్ దాదాపు అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుంది. ఒక గ్లాసు పాలు (చక్కెర గాని మరే తీపి పధార్థమైన కాని చేర్చకుండా) రాత్రి బాగా పొద్దుపోయాక తాగినా, లేదా మీ రాత్రి భోజనంలో పనీర్లాటివి తీసుకున్నా మీకు అందవలసినంత ట్రైటొఫాన్ అందుతుంది. పాలతో తయారైన అన్ని పదార్థాల్లోనూ ట్రైటొఫాన్ ఉంటుంది. 

అరటిపండ్లు : అరటిపండ్లు మెగ్నీషియం, పొటాషియం హెచ్చుమోతాదులో ఉన్నాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్రపట్టేలా చేస్తాయి. అరటి పండు మనం నిద్రిస్తున్నపుడు రక్తపోటుని కూడా నియం త్రించగలుగుతుంది. అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. చర్మ సమస్యలు.. అత్యంత భయంకరమైన వ్యాధులకు సంకేతాలా ? వినాయకుడి తొండం ఎటువైపు తిరిగి ఉంటే శ్రేయస్కరం ? బ్లాక్ హెడ్స్ ని సులువుగా తొలగించే.. టెస్టెడ్ హోం రెమిడీస్ 



చమోమెలీ టీ : ఆశ్చర్యం కదా!అంటే డీ కేఫీనెటెడ్ టీ అనగా చమోమైల్ టీ లేదా గ్రీన్ టీ వంటివి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. వీటిలో థైమిన్ అనే మూలకం నిద్రపొందుటకు బాగా సహాయపడుతాయి. 



తేనె మిల్క్: తేనె మరియు పాల మిశ్రమం నిద్రబాగా పట్టేలా చేస్తుంది. బాగా నిద్రపట్టాలంటే ముందుగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. గోరువెచ్చని పాలలో తేనె మిక్స్ చేసి, అంతర్గతంగా బాడీ టెంపరేచర్ ను పెంచుకోవాలి. ఇది బాడీని రిలాక్స్ చేస్తుంది. తేనెలో ఉండే అమినోయాసిడ్స్ స్లీప్ సైకిల్ ను రెగ్యులేట్ చేస్తుంది. 



చేపలు: చాలా వరకూ అన్ని రకాల చేపలు ముఖ్యంగా సాల్మన్ మరియు తున చేపల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉండి నిద్రపట్టేందుకు బాగా సహకరిస్తాయి. కాబట్టి నిద్ర పట్టాలంటే ఈ ఫుడ్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే.. 



గుడ్డు: ఉడికించిన గుడ్లును ఫ్రీ బెడ్ టైమ్ స్నాక్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి. నిద్రించే ముందు వీటిని తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది అంతే కాదు ఎక్కువ సమయం నిద్రించేందుకు సహాయపడుతుంది. 



ఓట్ ధాన్యపు గింజలు - సాధారణంగా ఓట్ గింజలను ఉదయంవేళ బ్రేక్ ఫాస్ట్ లో వాడతాము. అయితే, వీటిని సాయంత్రంవేళ స్నాక్స్ గా కూడా వాడవచ్చు. వీటిలో సహజమైన మెలటోనిన్ పుష్కలంగా వుండి గాఢ నిద్రను పట్టిస్తుంది. ఓట్ల ను పాలతో కలిపి తింటే అది ట్రిప్టోఫాన్ కూడా అందించి మరింత మెరుగుగా నిద్రకు పనిచేస్తుంది. 




అవిసె గింజలు: వీటిలో నిద్రను కలిగించే ట్రిప్టోఫాన్ మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. నిద్రను నియంత్రించే సెరోటోనిన్ స్ధాయిని శరీరంలో అధికం చేస్తుంది. నిద్ర మాత్రమే కాక అవిసె గింజలు నిద్రను దూరం చేసే ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి తగ్గించటంలో తోడ్పడతాయి.


1 comment: