ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. వీటిలోని విటమిన్స్ అన్ని వయసుల వాళ్ల ఆరోగ్యానికి మంచిది. అయితే పండ్లు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనే దానిపై చాలామందికి అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట ఫ్రూట్స్ తినవచ్చా ? తినకూడదా ? అనేది చాలామందిని వేధించే అనుమానం.
సాధారణంగా పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం మధ్యలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. కానీ రాత్రిపూట మాత్రం పండ్లు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ప్రతి ఫ్రూట్ లోనూ ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది.
మనం ఆకలితో ఉన్నప్పుడు లేదా అలసటగా అనిపించినప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటే.. ఫ్రక్టోజ్ శరీరంలోకి వెళ్లి గ్లూకోజుగా మారుతుంది. అది తక్షణ శక్తినిస్తుంది. కానీ రాత్రిపూట అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో.. తక్షణ శక్తి మంచిది కాదు. అందుకే నిద్రపోవడానికి ముందు పండ్లు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు తీసుకున్నగంట తర్వాతే మధ్యాహ్న భోజనం చేయాలి. వారాంతాల్లో అల్పాహారానికి బదులుగా 90 శాతం పండ్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. యాపిల్, బొప్పాయి వంటి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కానీ ఉదయం అల్పాహారంతో కానీ, మధ్యాహ్నం భోజనంతో కానీ పండ్లు తీసుకోవడం మంచిది కాదు.
భోజనం చేసిన తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల డైజెస్ట్ అవడానికి ఇబ్బందిగా మారుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ తీసుకోకూడదు. అయితే.. సలాడ్ రూపంలో ఒకటి రెండు ముక్కలు తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు.
No comments:
Post a Comment