మనకు కోహ్లీ.. వాళ్లకు క్రిస్ గేల్..! ఇటు అశ్విన్, జడేజా... అటు బెన్, బద్రీ..! ప్రస్తుతం మన ఓపెనింగ్ బలహీనం.. ప్రత్యర్థి ఫినిషింగ్ వీక్..! అటువైపు అంతా ఆల్‌రౌండర్లూ, హార్డ్ హిట్టర్లూ.. అన్నింటా సమతూకంలో మనదీ పక్కా టీ-20 జట్టే..! పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని వెస్టిండీస్.. సొంతగడ్డపై ఎదురులేని టీమిండియా..! రెండూ మాజీ చాంపియన్లే..! రెండో టైటిల్‌కు రెండడుగుల దూరంలో ఉన్నాయ్.! కానీ, వాటిలో
ముంబై: ప్రపంచక్‌పలో మొదటి సెమీఫైనల్ ఫైట్ ముగిసింది. టోర్నీలో అపజయం ఎరుగని న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్ టైటిల్ ఫైట్‌కు చేరుకుంది. ఇప్పుడు తేలాల్సింది ఇంగ్లిష్ జట్టు ప్రత్యర్థి ఎవరన్నదే..! దానికోసం మాజీ చాంపియన్లు భారత, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీ్‌సలో నెగ్గి ఇంగ్లండ్‌తో టైటిల్ ఫైట్‌కు చేరుకోవాలని ఇరు జట్లూ పట్టుదలగా ఉన్నాయి. మాటల తూటాలు పేలకున్నా.. సవాళ్లు, ప్రతిసవాళ్లూ లేకున్నా గెలుపు మాదంటే మాదేనని అంటున్నాయి. ఈ ఏడాది టీ-20ల్లో అద్భుత రికార్డు, సన్నాహకాలు, ఫామ్, సొంతగడ్డపై అనుకూలతలు అన్నీ ఆతిథ్య జట్టువైపే. 2011 వన్డే ప్రపంచక్‌పను నెగ్గిన ప్రతిష్టాత్మక మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెగ్గి తుదిపోరుకు చేరుకోవాలని భారత పట్టుదలగా ఉంది. కానీ, ఆట ఎక్కడ జరిగినా.. విజయం తమదే అని కరీబియన్లు అంటున్నారు. ఆతిథ్య జట్టుకు భంగపాటు మిగులుస్తామని డేంజర్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ హెచ్చరించాడు కూడా. మరి బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌పై విజయం ఎవరిని వరిస్తుందో.. వాంఖ‘డే’ ఎవరిది అవుతుందో చూడాలి.
ముందస్తు ప్రణాళిక ప్రకారం మెగా టోర్నీ సన్నాహకాలను చాలా ముందుగానే ప్రారంభించిన టీమిండియా అందులో అదరగొట్టింది. ఈ ఏడాది 15 టీ-20ల్లో ధోనీసేన 13 విజయాలు సాధించింది. అందుకే టోర్నీ కి ముందు హాట్ ఫేవరెట్ ట్యాగ్‌లైన్ తగిలించారు. కానీ, తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో చిత్తవడంతో భారత జట్టు దిమ్మదిరిగింది. అయితే, పాక్, బంగ్లా, ఆసీ్‌సను దాటుకొని హ్యాట్రిక్ విజయాలతో సెమీ్‌సకు చేరుకుంది. ముఖ్యంగా బంగ్లా, ఆసీ్‌సతో మ్యాచ్‌ల్లో ధోనీసేన బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలకు విషమ పరీక్ష ఎదురైంది. చావోరేవో లాంటి మ్యాచ్‌లో ఆసే్ట్రలియాపై విరాట్ కోహ్లీ చారిత్రక ఇన్నింగ్స్ జట్టును గెలిపించింది.
అయితే ఇంత దూరం వచ్చినా టోర్నీ ముందు నుంచీ భారతను ఒకే రకమైన సమస్యలు వేధిస్తున్నాయి. ఓపెనర్ల వైఫల్యం, మిడిలార్డర్ నిలకడలేమి ధోనీసేనను ఇబ్బంది పెడుతోంది. నాలుగు మ్యాచ్‌ల్లో రోహిత, ధవన్, రైనా, యువరాజ్ కలిపి 181 పరుగులే చేశారు. ఓపెనింగ్ జోడీ చేసింది 88 పరుగులే. దీన్ని బట్టి మన టాప్, మిడిలార్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ ఒక్కడే అద్భుతంగా రాణిస్తుండగా, ధోనీ మంచి ముగింపు ఇస్తున్నాడు. అయితే కీలక మ్యాచ్‌లో ఒకరిద్దరిపై ఆధారపడడం మంచిది కాదు. బ్యాటింగ్ పిచ్‌పై అదీ ఆల్‌రౌండర్లు, హార్డ్ హిట్లర్లతో నిండిన విండీ్‌సతో పోటీ అంటే మన బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోతే కష్టమే. ముఖ్యంగా కోహ్లీని ప్రత్యర్థి బౌలర్లు టార్గెట్ చేసే అవకాశం ఉంది. అతను రాణిస్తే సరే.. కానీ, విఫలమైనప్పుడు మిగతా వారు బాధ్యతలు తీసుకోవాలి. కాగా, బౌలింగ్ విభాగం నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. కానీ, ఈ పిచ్‌పై మన బౌలర్లు కరీబియన్లను ఎలా కట్టడిచేస్తారో చూడాలి.
గత మ్యాచ్‌లో గాయపడ్డ యువరాజ్ సింగ్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో అతనికి బ్యాక్‌పగా మనీష్ పాండేను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే అజింక్యా రహానె రూపంలో నాణ్యమైన ఆటగాడున్నాడు. మంగళవారం సీసీఐలో జరిగిన ప్రాక్టీస్ లో బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో ఈ ఇద్దరూ కఠోరంగా సాధన చేశారు. రహానె, బంగర్ చర్చించుకుంటూ కనిపించగా, పాండే మాత్రం భారీ షాట్లు సాధన చేస్తూ కనిపించాడు. రహానెనే సీనియర్ అయినప్పటికీ.. ఐదు, ఆరుస్థానాల్లో భారీ హిట్టింగ్ చేసే పాండే వైపు జట్టు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే సమయంలో ధోనీ ఆల్‌రౌండర్ పవన్ నేగిని తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్, ధవన్, కోహ్లీ, రైనా, పాండే/రహానె/నేగి, ధోనీ (కెప్టెన్/కీపర్), హార్దిక్, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. వెస్టిండీస్: గేల్, లెండిల్ సిమ్మన్స్, జాన్సన్ చార్లెస్, శామ్యూల్స్, రామ్‌దిన్ (కీపర్), డ్వేన్ బ్రావో, ఆండ్రీ రస్సెల్, డారెన్ సామి (కెప్టెన్), బ్రాతవైట్, శామ్యూల్ బద్రీ, సులేమాన్ బెన్.
No comments:
Post a Comment